హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధి

ఆది, 12/24/2017 - 17:42

.హజ్రత్ మాసూమహ్[స.అ] సమాధిని అల్లాహ్ హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధి మాదిరిగా నిర్ధారించెను.

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధి

ఇస్లాం ధర్మవేధి అయిన మర్హూమ్ ఆయతుల్లాహ్ మర్అషీ నజఫీ ఇలా ఉల్లేఖించారు: నా తండ్రి మర్హూమ్ “అల్లామా సయ్యద్ మహ్మూద్ మర్అషీ[ర.అ]” నజఫ్ లో ఉండేవారు, వారు ఎలాగైనా సరే దైవప్రవక్త[స.అ] కుమార్తె జనాబె ఫాతెమా జహ్రా[స.అ] యొక్క సమాధిని కనిపెట్టాలని, దాని దర్శించుకోవాలని అనుకునేవారు. అందుకోసమని 40 రోజుల పాటు ఒక అనుభవసిద్ధమైన కార్యమును అమలు పరిచారు. నలభయవ రోజు రాత్రి ఆ పనిని సంపూర్ణత్వాన్ని చేర్చి చాలా చాలా దుఆ చేశారు, ఆ తరువాత నిద్రపోయారు. వారు నిద్రలో స్వప్నంలో ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] వద్దకు హజరయ్యారు, ఇమామ్ అతనితో ఇలా అన్నారు: “కరీమయే అహ్లె బైత్[అ.స] సన్నిధికి చేరు”. అప్పడు అతను ఇమామ్ ఉద్దేశం హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] అని అనుకున్నారు. కాని ఇమామ్ ఇలా అన్నారు: “నా ఉద్దేశం ఖుమ్ లో ఉన్న హజ్రత్ మాసూమా[స.అ] యొక్క పవిత్ర సమాధి, అల్లాహ్ కొన్ని కారణాల వల్ల హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధిని రహస్యంగా ఉంచాలనుకున్నాడు, అందుకని హజ్రత్ మాసూమహ్[స.అ] సమాధిని అల్లాహ్ హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధి మాదిరిగా నిర్ధారించెను”.[కరీమయే అహ్లెబైత్[స.అ], పేజీ43,44]
అనగ ఎవరైనా హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధిని దర్శించుకోవాలనుకుంటే హజ్రత్ మాసూమహ్[స.అ] సమాధిని ఖుమ్ పట్టణంలో దర్శించుకుంటే చాలు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11