ఉపవాసం యొక్క నియమాలు

సోమ, 05/11/2020 - 13:01

ఈ నెలలో ఉపవాసంతో పాటు ముస్లిములు పాఠించవలసిన కొన్ని నియమాలను ఈ క్రింది వ్యాసంలో ప్రస్థావించటం జరిగింది.

రమజాన్,ఉపవాసం,నియమాలు.

పవిత్ర రమజాన్ మాసము ముస్లిములు ఉపవాసం ఉండటానికి దేవుడు విధిగా చేసిన అత్యంత విలువైన సమయం.కానీ ఈ ఉపవాసంలో కొన్ని నియమాలు కూడా పాఠించడం అవసరం.ఆ నియమాలను హదీసులలో ప్రస్థావించడం జరిగింది.

1.పాపాలకు దూరంగా ఉండటం: ఒక రోజు దైవప్రవక్త[స.అ.వ] ల వారితో ఇమాం అలి[అ.స] ల వారు "ఓ దైవప్రవక్త! ఈ మాసములో చేయవలసిన అతి ఉత్తమమైన పని ఏమిటి?" అని ప్రశ్నించారు.దానికి దైవప్రవక్త[సవ్వ్] ల వారు దేనినైతే ఆ భగవంతుడు నిషేదించాడో,దానికి దూరంగా ఉండటం.

2.విధులను నిర్వర్తించడం: ఈ నెలలో విధిగా చేయబడిన అన్ని కార్యాలను సక్రమంగా నివర్తించడం.ప్రత్యేకంగా రమజాన్ మాసంలో తాకీదు చేయబడిన ప్రార్ధనలు,నమాజులు ఈ నెల యొక్క ప్రత్యేకతను మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.ఈ మాసంలో ఒక దాసుడు ఆ దేవునికి ఇచ్చే అత్యంత విలువైన బహుమతి ఏదీ? అని ప్రశ్నిస్తే అది కేవలం మీ నుదుటిని నేలపై ఉంచి మరియు చేతులను పైకెత్తి ఆ దేవునిని వేడుకోవటం.

3. 3.ఖురాను పఠనం: ఈ పవిత్ర మాసములో సర్వమానవాళికి మార్గదర్శనం చేయటానికి అవతరింపబడ్డ దివ్య ఖురాను యొక్క పఠనానికి చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ నెలలో ఖురాను పఠనానికి పదిరెట్లు ఎక్కువ ప్రతిఫలం కూడా లభిస్తుంది.

4.ఇతర నియమాలు: పై నియమాలు మాత్రమే కాకుండా చాలా నియమాలను ఈ మాసంలో పాఠించటానికి తాకీదు చేయటం జరిగింది.వాటిలో దానధర్మాలు చేయటం,పెద్దలను గౌరవించటం,చిన్నవారి పట్ల దయ,బంధువులతో ప్రేమతో మెలగటం,అనాధలపై కనికరం చూపటం,ఆ దేవుని సన్నిధిలో పాపాలకు ప్రాయశ్చితాన్ని కోరటం,ఇఫ్తారీని పంచటం,మంచి ప్రవర్తన మరియు మొహమ్మద్[స.అ.వ] మరియు వారి సంతతిపై సలవాత్ పంపటం ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

రెఫరెన్స్: జామె ఉస్ స ఆదాత్,3వ భాగం,పేజీ నం: 381,295,356,357. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10