సాఫ్ఫాత్ సూరహ్

ఆది, 12/24/2017 - 17:53

.అల్లాహ్ అవతరింపజేసిన పవిత్ర ఖుర్ఆన్ యొక్క 37వ సూరహ్ “సాఫ్ఫాత్” సూరహ్. దాని సంక్షిప్త వివరణ.

సాఫ్ఫాత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 37వ సూరా ఇది. “సాఫ్ఫాత్” అనగ వరుసలో నిలబడి ఉన్న వారు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని మొదటి ఆయత్. ఈ సూరాలో “సాఫ్ఫాత్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 7 సార్లు వచ్చింది. ఈ సూరాలో 182 ఆయత్‍లు, 866 పదాలు మరియు 3903 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 15 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అన్ఆమ్” సూరా మరియు దీని తరువాత “లుఖ్మాన్” సూరా అవతరించబడ్డాయి. ఈ సూరహ్ పేరు “సాఫ్ఫాత్” అని పెట్టడానికి గల కారణం ఈ సూరహ్ “సాఫ్ఫాత్” పదంతో మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి హజ్రత్ ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే ప్రతీ శుక్రవారం సాఫ్ఫాత్ సూరహ్ ను పఠిస్తారో ఇహలోక ఆపదల నుండి రక్షణలో ఉంటాడు మరియు అల్లాహ్ విశలభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అతని శరీరం, సంపద మరియు సంతానం చెంతకు షైతాన్ చేరలేడు మరియు అతను స్వర్గంలో ప్రవేసిస్తాడు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7