ఆది, 05/17/2020 - 07:31
ఖుర్ఆన్ ఎవరినైతే హకీమ్ అని సంబోధిస్తుందో అలాంటి లుఖ్మాన్ తన కుమారునికి ఏమని హితబోధన చేశారు?...
లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నారు..
“ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం”[లుఖ్మాన్:13]
“నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు”[లుఖ్మాన్:16]
“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు”[లుఖ్మాన్:17]
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి