మనిషి సమాధి అవ్వక ముందే అక్కడ పనికి వచ్చే పుణ్యకార్యాలను ముందుగా పంపుకుంటే మంచిది.
మృత్యువు ఒక సవారీ లాంటిది.అది ప్రతీ ఇంటి తలుపు వధ్ధ కాచుకుని ఉంటుంది.మానవుడు ఎంత కాలం జీవించిన చివరకు మట్టిలో కలవాల్సిందే. మానవుడు కూడబెట్టిన ధనము ,సంతానము,హోదా ఏదైనా ఈ నసించిపోయే జీవితం వరకే అందువలనే అల్లాహ్ దివ్య ఖురానులో మీ ఈ సిరిసంపదలు మరియు సంతానము కేవలం మీ పాలిట పరిక్ష.గొప్ప ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉన్నది అని సెలవిస్తున్నాడు. అందువలనే సమాధి అవ్వక ముందే అక్కడ పనికి వచ్చే పుణ్యకార్యాలను ముందుగా పంపుకుంటే మంచిది.దివ్య ఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: "ప్రతీ ప్రాణి మరణం రుచి చూడవలసిందే.మరి మీరంతా నా వైపుకే మరలించబడతారు" [అన్ కబూత్ /57]. దైవప్రవక్త[స.అ.వ] ల వారు "మృత్యువు రాకముందే దాని కొరకు సన్నద్ధమవ్వండి" అని సెలవిచ్చారు.ఒక హదీసులో ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: నసించిపోయే జీవితంలోనే శాస్వతమైన జీవితం కొరకు పనికి వచ్చే సామగ్రిని సిధ్ధం చేసుకోండి".
రెఫరెన్స్: మీజానుల్ హిక్మహ్,హదీసు నం:18864,18891.
వ్యాఖ్యానించండి