బుధ్ధి పరిపక్వతకు కారణమైన పది అంశాలు ఇమాం రిజా[అ.స] ల వారి దృష్టిలో
ఇమాం రిజా[అ.స] ల వారు ఒక హాదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ముస్లిం యొక్క బుధ్ధి పరిపక్వ దశకు చేరుకోదు కానీ అతనిలో పది అంశాలుంటే తప్ప:
1.అతడు సజ్జనుడు మరియు ఉపకారపరుడని నమ్మకం కలగాలి.
2.ప్రజలు అతని నుండి రక్షణలో ఉండాలి.
3.ఇతరుల చిన్నపాటి మంచి కార్యాన్ని కూడా పెద్దదిగా భావించాలి.
4.తన యొక్క ఎక్కువ ఉపకార్యలను కొద్దిగా భావించాలి.
5.అతని నుండి ఎంత సహాయాన్ని కోరినా,అతను అలిసిపోకూడదు.
6.జీవితం మొత్తం జ్ఞానాన్వేషణలో అలిసిపోకూడదు.
7.అల్లాహ్ దారిలో పేదరికం, అతని దృష్టిలో ఐశ్వర్యం కన్నా గొప్పదై ఉండాలి.
8.దేవుని దారిలో అవమానం పొందటం,అతని దృష్టిలో దేవుని శత్రువు ముందు గౌరవాన్ని పొందటం కంటే ఇష్టమైనదై ఉండాలి.
9.అప్రసిధ్ధాన్ని[అనామకతను] ప్రసిధ్ధం [ప్రఖ్యాతం] కన్నా ఎక్కువగా ఇష్టపడె వాడై ఉండాలి.
అప్పుడు పదవ అంశమేమిటని ప్రశ్నించగా ఇమాం ల వారు: “ఏ ఒక్కరిని చూసినా అతను నా కన్నా గొప్పవాడు మరియు దైవభక్తి కలవాడు అనే భావన ఉండాలి” అని సెలవిచ్చారు.
రెఫరెన్స్: తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:467.
వ్యాఖ్యానించండి