సాద్ సూరహ్

ఆది, 12/24/2017 - 18:22

.అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర గ్రంథం యొక్క 38వ సూరహ్ అయిన “సాద్” సూరహ్ సంక్షిప్త వివరణ.

సాద్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 38వ సూరా ఇది. “సాద్” అరబీ అక్షరములలోని ఒక అక్షరం. అరబీ భాషలో “సాద్” అక్షరం ఇలా లిఖించబడుతుంది “ص”. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని మొదటి ఆయత్. ఈ సూరాలో “సాద్” అను పదం ఒకసారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో ఒకసారి వచ్చింది. ఈ సూరాలో 88 ఆయత్‍లు, 735 పదాలు మరియు 3061 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఖమర్” సూరా మరియు దీని తరువాత “ఆరాఫ్” సూరా అవతరించబడ్డాయి. ఈ సూరహ్ పేరు “సాద్” అని పెట్టడానికి గల కారణం ఈ సూరహ్ “సాద్” పదంతో మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి హజ్రత్ ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే షబే జుమా(గురువారం రాత్రి) సాద్ సూరహ్ ను పఠిస్తారో అల్లాహ్ వారికి దైవప్రవక్తలకు మరియు అతిసామిప్యముగల దూతలకు మాత్రమే వర్తించేటు వంటి ఇహపరలోక అనుగ్రహాలు ప్రసాదించబడతాయి. అతను స్వర్గంలో ప్రవేశించబడతాడు మరియు అతను తనకు ఇష్టంవచ్చినంత వారిని స్వర్గంలో ప్రవేశ పెట్టగలడు, చివరికి ఇంట్లో పని చేసేవారిని కూడా ప్రవేశపెట్టగలడు. ఎంతమందిని కావాలనుకుంటే అంత మందిని ఆశ్రయం కలగజేయగలడు”

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20