ఖుద్స్ డే ఉపన్యాసం 1399

గురు, 05/28/2020 - 18:57

ప్రపంచ ఖుద్స్ దినోత్సవం సందర్భంగా ఇస్లామిక్ రివిల్యూషన్ సుప్రీమ్ నేత ఆయతుల్లాహ్ అల్ ఉజ్మా ఖామెనయి ఉపన్యాసం సిఫరస్సుల మినహ...

ఖుద్స్ డే ఉపన్యాసం 1399

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వ సొల్లల్లాహు అలా ముహమ్మదివ్ వ అలిహిత్తాహిరీన్ వ సొహ్బతుల్ మున్తజబీన్ వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సాని ఇలా యౌమిద్దీన్
ప్రపంచ వ్యాప్తంగా, ముస్లిం సోదరా సోదరీమణుల పై దురూద్ మరియు సలామ్ పంపుతున్నాను. అల్లాహ్ తఆలా ను ఈ పవిత్ర రమజాన్ మాసం లో వారి ప్రార్థనలు స్వీకరించబడాలని కోరుకుంటున్నాను, ఈదుల్ ఫిత్ర్ యొక్క శుభాకాంక్షలు ముందుగానే వారికి తెలియపరుస్తున్నాను మరియు అల్లాహ్ యొక్క ఆథిత్య మాసంలో ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
ఈ రోజు ఖుద్స్ డే. ఈ రోజు ఇమామ్ ఖుమైనీ యొక్క దృఢ ప్రయత్నం, ఖుద్స్ షరీఫ్ మరియు అణగారిన పాలస్తీన ప్రజల గురించి ముస్లిముల గొంతులను ఏకం చేయడానికి కారణంగా నిలిచింది. ఈ కొన్ని దశబ్ధాలలో ఇది తన ప్రభావితమైన పనితీరును చూపించింది మరియు ఇన్షా అల్లాహ్ ఇక ముందు కూడా చూపిస్తుంది. ప్రపంచ దేశాలు ఖుద్స్ డే ను స్వాగతం పలికారు మరియు దాన్ని ప్రాముఖ్యత ఇచ్చారు అనగా పాలస్తీన దేశ స్వాతంత్ర్యం జెండాను ఎత్తె ఉధ్యమంగా నిర్వర్తించారు. ముస్లిముల ఆలోచనల నుండి ఫాలస్తీన సమస్యను తక్కువ చేసి దాన్ని మరిచిపోయేలా చేయడమే ఇస్తిక్బార్(లోకాన్ని శాసించాలనుకుంటున్నవారు) మరియు జియోనిజం యొక్క మూల పాలసీ. ఇది స్వయంగా ఇస్లామీయ దేశాలలో శత్రువుల రాజకీయ మరియు సాంస్కృతిక ఏజెంట్స్ ద్వార చేయబడుతుంది., (ఈ పరిస్థితిలో) అందరి తక్షణ చర్య ఈ అపకార ద్వారాన్ని కట్టిపడేయటం. యదార్థమేమిటంటే ముస్లిం దేశాల మానం, రోజురోజుకి పెరుగుతున్న ఆత్మవిశ్వాసం మరియు మేల్కొలుపు పాలస్తీన సమస్యను మరిచిపోనివ్వదు. నిజానికి ఇలా జరగాలని అమెరికా మరియు ఇతర తమ అధికారం చెలాయించాలనుకుంటున్న శక్తులు మరియు వారి ఏజెంట్స్ తమ ధనాన్ని మరియు శక్తిని ఉపయోగిస్తున్నారు.
అన్నింటి కన్నా ముందు పాలస్తీన దేశాన్ని అక్రమంగా ఆక్రమించడం మరియు అక్కడ జియోనిజం యొక్క క్యాన్సర్ వచ్చిన విషాదాన్ని గుర్తుచేయాలి. ఈ గతించిన కొంతకాలంలో జరిగిన మానవ నేరాలలో ఇలాంటి మరియు ఈ దృఢత్వంతో ఇంకో ఏ అపరాధమూ సంభవించలేదు. ఒక దేశాన్ని ఆక్రమించుకోవటం, సాధారణ ప్రజలను శాస్వతంగా వారి ఇళ్ళ నుండి మరియు వారసత్వంగా పొందిన నేల నుండి నీకు ఎటువంటి హక్కు లేదు అని త్యజించటం అది కూడా ప్రాణాలు తీసి, అన్యాయం చేసి, వ్యవసాయ భూములను మరియు వారి సంతానాన్ని అతి క్రూరంగా నాశనం చేయటం, మరియు దశబ్ధాల వారిగా ఈ చారిత్రాత్మిక అణిచివేత సాగుతూనే ఉంది, యదార్థానికి ఇది మానవ క్రూరత్వం మరియు షైతాన్ రుపం యొక్క కొత్త రికార్డు.
ఈ విషాదం యొక్క నిజమైన అపరాధి మరియు బాధ్యులు Western governments  మరియు వారి ఈవిల్ పాలసీలు. ఫస్ట్ వరల్డ్ వార్ లో విజయాన్ని సాధించి Western governments ఆసియా యొక్క ప్రదేశాలు అనగా ఉస్మానియహ్ అధికరం యొక్క ఆసియా భూభాగాన్ని అతి ముఖ్య మాలే గనీమత్(యుద్ధం ద్వార చేజిక్కినవి) పరంగా ప్రెస్ కాన్ఫ్రెన్స్ లో పరస్పరం పంచుకుంటున్న రోజు, ఈ భాగం పై ఎల్లప్పుటికీ తమ అధికారం ఉండాటం కోసం దాని మధ్యలో ఒక సురక్షితమైన ప్రదేశం తప్పకుండా ఉండాలని అనుకున్నారు. బ్రిటీష్ ఎన్నో సంవత్సరాల క్రితం బాల్ఫోర్ Declaration ను  ను ప్రదర్శించి పరిస్థితులను అనుకూలంగా చేసుకుంది మరియు యూధ శ్రీమంతులను తమ ఆలోచనల మార్గంలో తీసుకొచ్చి మిషన్ ను ముందుకు తీసుకెళ్ళడానికి జియోనిజాన్ని సృష్టించారు.
ఇక ఆ తరువాత ప్రాక్టికల్ గా పనులు చేయటం ప్రారంభించారు. అప్పటి నుండే మెల్లమెల్లగా తమ పనులను క్రమంగా చేసుకుంటూ వచ్చారు, చివరికి సెకండే వరల్డ్ వార్ తరువాత అచ్చటి అధికారం యొక్క అప్రమత్తం మరియు కష్ట సమయాన్ని తమ లాభానికి వాడుకుంటూ దెబ్బ తీసి, నకిలీ మరియు జాతిలేని ఒక అధికారాన్ని ప్రకటించారు.
ఈ దెబ్బ ప్రభావం ముందు పాలస్తీన ప్రజల పై మరియు ఆ తరువాత దాని చుట్టుప్రకలున్న దేశాల పై పడనుంది.
పాలస్తీనలో సంభవించిన సంఘటనలను పరిశీలించిన పిదప, Western governments మరియు యూధ శ్రీమంతుల జియోనిజం అధికారం స్థాపించడానికి అసలైన మరియు త్వర లక్ష్యం, వెష్ట్ ఆసీయా లో తమ నిరంతరం ఉండిపోవటానికి ఒక అడ్డాను స్థాపించాలని మరి అలాగే దాని చుట్టు ప్రక్కల దేశాల మరియు వారి అధికార సమస్యలలో జోక్యం చేసుకొని వారిపై తమ అధికాన్ని చెలయించాలి అందుకని అతి సమీపంలో ఉండాలని ఇలా చేశారని తెలుస్తుంది. అందుకనే ఈ నకిలీ మరియు అక్రమ అధికారానికి వివిధ బలమైన సైన్య మరియు అసైన్య పరికరాలతో చివరికి అణు ఆయుధాలతో అమర్చారు. నీలు సముద్రము నుంచి ఫురాత్ వరకు ప్రదేశంలో ఈ క్యాన్సర్ వ్యాప్తికి తమ ఎజెండాలో చోటిచ్చారు.
దురదృష్టవశాత్తు అరేబియా అధికారాల నుండి ఎక్కువ శాతం మొదట్లో పడిన కష్టాల తరువాత వారిలో కొందరు ప్రశంసలకు అర్హులు, మెల్ల మెల్లగా ఆయుధాలను వేసేశారు, ముఖ్యంగా ఈ సమస్యలో అమెరికా ఎంటర్ అయిన తరువాత వారు మానవ, ఇస్లామియా మరియు రాజకీయ కర్తవ్యంతో పాటు తమ అరబ్ జాతి గౌరవమర్యాదలను కూడా అటకపై పెట్టేశారు. భావనలపై ఆశ పెట్టి శత్రువుల లక్ష్యాన్ని పరిపూర్ణం చేయటానికి సహాయం చేశారు. దీనికి మంచి నిదర్శనం Camp David యొక్క చేదు యదార్థం.
ముజాహిద్ సంస్థలు కూడా మొదటి సంవత్సరాలలో నిష్కల్మషంగా ప్రయత్నించాయి, పోనుపోను అక్రమ బలగాలతో మరియు వారి సహచరులతో ఫలితంలేని చర్చలలో పడి పాలస్తీన ఆశాలను నెరవేర్చే మార్గాన్నే విడిచాయి. అమెరికా, ఇతర Western governments మరియు ప్రభావం లేని అంతర్జాతియ సంస్థలతో చర్చలు, పాలస్తీన యొక్క చేదు మరియు విఫలమైన అనుభవాన్ని మిగిల్చాయి. United Nations జనరల్ అసంబ్లీలో ఆలీవ్ కొమ్మను చూపినదానికి ఫలితంగా Oslo యొక్క నష్ట ఒప్పదం తప్ప వేరే ఏదీ దక్కలేదు. చివరికి యాసిర్ అరఫాత్ యొక్క భయంకరమైన సంఘటనపై అంతమయ్యింది.
ఇరాన్ దేశంలో ఇస్లామీయ విప్లవం విజయవంతం అయిన తరువాత పాలస్తీన కోసం జిహాద్ యొక్క కొత్త ద్వారం తెరవబడింది. మొదటి అడుగుగా జియోనిజం యొక్క మూలాలను బయటకు తరిమారు వీళ్లు షాహ్ అధికారంలో ఇరాన్ ను తమ రక్షణ స్థావరంగా భావించేవారు. జియోనిజం అధికారం యొక్క అక్రమ ఎంబసీను పాలస్తీన ప్రితినిధి కార్యాలయానికి అందజేయటం మరియు పెట్రోల్ సప్లయి నిలిపివేయటం నుంచి పెద్ద పెద్ద చర్యల వరకు అన్ని కార్యకరాపాల ఫలితంగా పాలస్తీన మొత్త ప్రతిఘటన చర్యలు ఏర్పడ్డాయి, అలా సమస్య పరిష్కారం పై ఆశ కలిగింది. ప్రతిఘనట సంఘాలు ఏర్పడిన తరువాత జియోనిజం అధికారానికి రోజురోజుకి కష్టాలు ఎక్కువయ్యాయి. ఇన్షా అల్లాహ్ మున్ముందు వారి కష్టాలు ఇంకా ఎక్కువవుతాయి. కాని ఈ అధికారం యొక్క మద్దత్తుదారులు అందూలో మొట్టమొదట వచ్చే పోరు అమెరికా, అమెరికా దాని తరపు నుండి డిఫెన్స్ ను గట్టిగా పెంచింది. లెబ్నాన్ లో విశ్వాసులు, యువకులు మరియు వీరులు, హిజ్బుల్లాహ్ స్థాపన మరియు పాలస్తీన సరిహద్దులో అత్యుత్సాహంగా హిమాస్ మరియు జిహాదె ఇస్లామీ సంస్థల స్థాపన, జియోనిజం పెద్దలే కాదు అమెరికా మరియు పడమటి శత్రువులను ఆందోళనకు మరియు భయానికి గురి చేశాయి, దాంతో వారు అక్రమ అధికారం యొక్క ఆలోచన మరియు మద్దత్తు దళాల ద్వార ఆ ప్రదేశం మరియు స్వయంగా అరబ్ సొసైటీసుల నుండి ఏజెంట్స్ లను నియమించడాన్ని తమ ఎజెండాలో చేర్చారు. వాళ్ళ నిరంతర ప్రయత్నం ఫలితంగా ఈనాడు అరేబీయ అధికారం యొక్క కొంతమంది పెద్దలు మరియు అరేబీయ దేశానికి చెందిన రాజకీయ, సంస్కృత కార్యకర్తలలో కొంతమంది అపకారుల ప్రవర్తన మరియు వారి స్టేట్‌మెంట్స్ లలో కనిపిస్తూనే ఉంటుంది మరియు ఇది అందరి కళ్ళ ముందు ఉంది.
ఈనాడు ఘర్షణ సమయంలో ఇరువైపుల నుండి వివిధ చర్యలు కనిపిస్తున్నాయి, వాటి మధ్యలో కేవలం తేడా ఏమిటంటే ప్రతిఘటన దళాలు రోజురోజుకు పవర్, (విజయంపై) ఆశ మరియు బలాన్ని పెంచే ఆధారాలను పెంచుకొంటుపోతుంది కాని దానికి వ్యతిరేకంగా అక్రమ మరియు అన్యాయ దళాలు రోజురోజుకు వారి చేతులు ఖాలీ అవుతన్నాయి, వారిలో (విజయంపై) ఆశ మరియు బలం తగ్గుతూ పోతుంది. ఈ మాటకు స్పష్టమైన నిదర్శనం., అపజయం ఎరగని మరియు మెరుపులా దూసుకెళ్ళిపోయే సైన్యంగా భావించబడే జియోనిజం సైన్యం, మరియు వారిపై దాడి చేసిన రెండు దేశాల పెద్ద పెద్ద సైన్యాన్ని కొన్ని రోజుల్లోనే నిలిపివేసే శక్తి ఉండే సైన్యం ఈరోజు లెబ్నాన్ మరియు గజ్జా లో సామాన్య ప్రజల ప్రతిఘటన దళాల ముందు నిలబడలేక వెనక్కి తగ్గి తమ అపజయాన్ని అంగీకరించాల్సివచ్చింది.
అయినప్పటికీ, ఘర్షణ మైదానం చాలా ప్రమాదకరమైనది, పరిస్థితులు మారిపోయి అవకాశాలున్నాయి, నిరంతరం నిఘా పెట్టడం అవసరం మరియు ఈ పోటీ పడటం అనే విషయం చాలా చాలా ముఖ్యమైనది, ఇదే తీర్మానం మరియు ఇదే ప్రాణం పోసేది. ప్రాథమిక అంచనాలలో ఎలాంటి అప్రమత్తం, అల్ప ఆలోచన మరియు తప్పులు చేసినా దాంతో చాల పెద్ద నష్టాలు కలుగుతాయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17