షహీదె అవ్వల్

శుక్ర, 06/19/2020 - 12:54

ప్రముఖ షియా ఆలిమ్ అయిన షహీదె అవ్వల్ జీవిత చరిత్ర సంక్షిప్తగా...

షహీదె అవ్వల్

పేరు అబూ అబ్దిల్లాహ్ షమ్సుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె మక్కీ ఆములీ, “షహీదె అవ్వల్” గా ప్రఖ్యాతి చెందారు. హిజ్రీ యొక్క 734వ సంవత్సరంలో లెబ్నాన్ లో ధర్మనిష్ఠగల కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి గారు అప్పటి జ్ఞానులలో ఒకరు. వారు కొంతకాలం తమ పట్టణంలో ఆ తరువాత పై చదువుల కోసం ఇతర ప్రాంతలకు ప్రయాణం చేశారు ఉదాహారణకు బగ్దాద్, హిల్లా, దమిష్ఖ్, మక్కా, మదీనహ్, బైతులు ముఖద్దస్, మిస్ర్ మొ...
వారి ప్రత్యేకతలలో ఒకటి, ఫిఖా విభాగాలపై మరియు వాటి మూలాధారల(ఖుర్ఆన్ మరియు సున్నత్) పై మరియు ఇతర వర్గాల ఫిఖా పై పట్టు ఉండేది.
వారు తమ చివరి కాలంలో ఒక సంవత్సరం పాటు అధికారం వీక్షణలో గడిపారు. ఆ తరువాత జుమాదల్ ఊలా 9వ తారీఖూ, హిజ్రీ యొక్క 786వ సంవత్సరంలో వీరమరణం పొందారు. వారిని ఉరిఖంబానికి వేలాడిదీసిన తరువాత ఈజిప్టు రాజులలో ఒకడైన ..బర్ ఖూఖ్.. ఆదేశానుసారం దమిష్క్ అధికారి ఉత్తర్వులు జారీ చేయటంలో వారి దేశాన్ని కాల్చివేశారు.
వారు గొప్ప గొప్ప జ్ఞానుల వద్ద శిష్యరికం చేశారు. అంతే కాకుండా వారు ఇంచు మించు 40 మంది అహ్లెసున్నత్ ఉలమాల నుండి కూడా శిక్షణ పొందారు. వారు ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. వారు లిఖించిన పూస్తకాలలో ప్రముఖ మరియు ఉత్తమమైనది “అల్ లుమ్అతుద్ దమిష్ఖియహ్” ఈ గ్రంథం ఈనాటికీ ఇస్లామీయ విశ్వవిధ్యాలయాల పాఠ్యక్రమంలో ఉంది.[అఅయాన్ అల్ షియా, భాగం1, పేజీ177]

రిఫరెన్స్
అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయాన్ అల్ షియా, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, 1406ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19