విశ్వాసం హృదయానికి సంబంధించినది

మంగళ, 06/30/2020 - 12:56

ఇస్లాం స్వీకరణ మరియు విశ్వాసం వేర్వేరు అని వివరిస్తున్న ఆయత్ వివరణ సంక్షిప్తంగా...

విశ్వాసం హృదయానికి సంబంధించినది

ఇస్లాం ఆచరణకోసం తప్పనిసరిగా ఇస్లామీయ ఆలోచనలు, బోధనలు మరియు ఆచారాలను నేర్చుకోవాలి, వాటికి అనుగుణంగా ఉండాలి. అంతేకాకుండా, ఇస్లాం ఆచరణలో కొంత త్యాగం అవసరం. ఇది ఇలా ఉండగా, త్యాగం యొక్క అవసరం ఆటంకం కాకూడదు. (దైవప్రవక్త ముహమ్మద్[స.అ] వివరణ, “ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అల్లాహ్ కోసం ఇస్తే, అల్లాహ్ దానికి మించిన మంచిని బదులుగా ప్రసాదిస్తాడు”.
విశ్వాసం యొక్క యథార్థత కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది. ప్రవక్త ముహమ్మద్[స.అ] ఇస్లాం సందేశాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టినప్పుడు, కొంతమంది ప్రజలు ఆయన వద్దకు వచ్చారు మరియు వారు ఇస్లాం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని తెలియజేశారు. అందుకు బదులుగా అల్లాహ్ ఈ ఆయత్ ను అవతరింపజేశాడు, “(ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు: “నిజానికి మీరింకా విశ్వసించలేదు. కాని లొంగిపోయాము (ఇస్లాం స్వీకరించాము) అని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు”[49:14].
దైవప్రవక్త ముహమ్మద్[స.అ] యొక్క ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స] ఇస్లాం ధర్మ క్రియాశీల ప్రక్రియ గురించి వివరించారు: “ఇంతకు ముందు ఎవ్వరూ వర్ణించనంతగా నేను ఇస్లాంను వర్ణిస్తాను: ఇస్లాం, అంటే సమర్పించుకోవడం, సమర్పించుకోవడం నమ్మకం, నమ్మకం కలిగిఉండడం ప్రతిజ్ఞకు నిదర్శనం, ప్రతిజ్ఞ అంగీకరణకు కారణం, అంగీకరణ అనగా అమలు అందులో ఉంది.”[నహ్జుల్ బలాగహ్, ఉపన్యాసం125]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6