ప్రవక్తలందరి ధర్మం

మంగళ, 06/30/2020 - 13:04

అల్లాహ్ ఆదేశం ప్రకారం, “ఇస్లాం” మరియు “ముస్లిం” పదాలను ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి గురించి సంక్షిప్త వివరణ...

ప్రవక్తలందరి ధర్మం

అల్లాహ్ ఆదేశం ప్రకారం, “ఇస్లాం” మరియు “ముస్లిం” పదాలను ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి, హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స]. ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది, “ఇది(ఇస్లామీయ ఏకేశ్వరవాదం) మీ పితామహుడైన ఇబ్రాహీమ్(అబ్రహం) ధర్మం. దీనికి(ఖుర్ఆన్) పూర్వం కూడా ఆయన(అల్లాహ్) మిమ్మల్ని ‘ముస్లింలు’గానే నామకరణం చేశాడు”[హజ్:78] “ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు, అతడు నిజమైన ముస్లిం(అల్లాహ్ యొక్క విధేయుడు), ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు”[ఆలి ఇమ్రాన్:67]. కేవలం ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] మాత్రమే తన ధర్మం ఇస్లాం అని చెప్పలేదు, ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] తరువాత ప్రవక్తలు కూడా తన ధర్మం ఇస్లాం అని చెప్పారు. ప్రవక్త యూసుఫ్(జోసఫ్) ఉల్లేఖనం, ఖుర్ఆన్ యొక్క “యూసుఫ్” అనబడే అధ్యాయంలో ఇలా ఉంది: “నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వొసగు. నన్ను సజ్జనులలో చేర్చు”[యూసుఫ్:101].
ఈ ప్రకారంగా, అల్లాహ్ ఖుర్ఆన్ లో ప్రకటించెను: “నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం”[ఆలిఇమ్రాన్:19].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7