మనిషి పుట్టుక దశలు దైవ ఖురాన్ లో

శని, 12/30/2017 - 19:08

ఎప్పుడైతే మనిషి దేవుని సృష్టిపై ఆలోచించడం మొదలుపెడతాడో అదే ఆ దేవునిపై తన విశ్వాసానికి తొలి మెట్టు. 

మనిషి పుట్టుక దశలు దైవ ఖురాన్ లో

అనంతకరుణామయుడు అపారకృపాశీలుడైన అల్లహ్ పేరిట
విశ్వ స్రుష్టికర్త అయిన అల్లాహ్ మానవుని పుట్టుక దశలను ఈ విధంగా వివరిస్తున్నాడు:
هُوَ ٱلَّذِى خَلَقَكُم مِّن تُرَابٍۢ ثُمَّ مِن نُّطْفَةٍۢ ثُمَّ مِنْ عَلَقَةٍۢ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًۭا ثُمَّ لِتَبْلُغُوٓا۟ أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا۟ شُيُوخًۭا ۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ ۖ وَلِتَبْلُغُوٓا۟ أَجَلًۭا مُّسَمًّۭى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో (తల్లి గర్భం నుంచి) బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్తవయస్సుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను   ఇస్తున్నాడు, ఆపైన వార్ధక్యానికి చేరుకునేందుకు (గడువు ఇస్తున్నాడు). మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి (వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు)[అల్-గాఫిర్/67].
మనిషి ఉనికి యొక్క మొదటి దశ మట్టి మరియు దానితోనే మనిషి తినే ఆహరం (పండ్లు, ఫలాలు) ఆ మట్టిలోనే వృద్ది చెందుతాయి, వాటిని ఆ మనిషి తల్లితండ్రులు ఆహరంగా తీసుకోవటం జరుగుతుంది, కొంత కాలం తరువాత ఆ ఆహరం వీర్యంగా మారుతుంది, రెండవ దశ ఆ వీర్యం(స్పెర్మ్) ద్వారా ఆ తల్లి కడుపులో గర్భధారణ జరుగుతుంది, మూడవ దశలో అది ఒక మాంసపు ముద్దగా మారుతుంది, నాలుగవ దశలో ఇప్పుడు మనిషి ఉనికిలోనికి వస్తాడు(పుట్టుక జరుగుతుంది).
ఇన్ని దశల ప్రయాణంలో ఆ జీవిని తన తల్లితండ్రుల ద్వారా ఆ అల్లాహ్ సర్వసృష్టికర్త సంరక్షించాడు, ఈ మనిషి పుట్టుక దశల ద్వారా ఆ అల్లాహ్ యొక్క సృష్టి మరియు గొప్పతనం సృష్టంగా తెలుస్తుంది, ఎన్ని క్లిష్టమైన పరిస్తితులను దాటుకుంటూ ఈ మనవుని స్రుష్టి సాధ్యమైందో దాని గురించి దివ్య ఖురాన్లో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు:
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِن كُنتُمْ فِى رَيْبٍۢ مِّنَ ٱلْبَعْثِ فَإِنَّا خَلَقْنَٰكُم مِّن تُرَابٍۢ ثُمَّ مِن نُّطْفَةٍۢ ثُمَّ مِنْ عَلَقَةٍۢ ثُمَّ مِن مُّضْغَةٍۢ مُّخَلَّقَةٍۢ وَغَيْرِ مُخَلَّقَةٍۢ لِّنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِى ٱلْأَرْحَامِ مَا نَشَآءُ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّۭى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًۭا ثُمَّ لِتَبْلُغُوٓا۟ أَشُدَّكُمْ ۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرْذَلِ ٱلْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِنۢ بَعْدِ عِلْمٍۢ شَيْـًۭٔا
ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి... మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితం గానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము - మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయ బడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు[అల్-హజ్జ్/5].
అల్లాహ్ ఏ మట్టీతో అయితే ఈ మానవుని సృష్టించాడో అది ఒక నిర్జీవి(ప్రాణము లేనిది),ఒక నిర్జీమైనటువంటి మట్టితో సమస్త జీవరాసులలో శ్రేష్టమైన జీవి అయినటువంటి మనవుని సృష్టించిన ఆ అల్లాహ్ ఆరాధించుటకు ఎలా అర్హుడు కాలేడు?

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24