దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఎనిమిదవ ఉత్తరాధికారియైన ఇమాం రిజా[అ.స] ల వారి గురించి సంక్షిప్తముగా.
షీయా ముస్లిముల ఎనిమిదవ ఇమాము మరియు మహాప్రవక్త[స.అ.వ] ల వారి ఎనిమిదవ ఉత్తరాధికారి ఇమాం రిజా[అ.స] ల వారు. వారి నామము అలి మరియు లఖబ్[శీర్షిక] రిజా మరియు కున్నియత్ అబుల్ హసన్.వారు ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారము హిజ్రి యొక్క 148వ యేట 11వ నెలైన జీఖాదా యొక్క 11వ తారీకున మదీనా పట్టణంలో జన్మించారు.వారు 7వ ఇమాం ల వారైన ఇమాం మూసా కాజిం[అ.స] మరియు నజ్మా ఖాతూన్ ల వారి సంతానము.ఇమాం రిజా[అ.స] ల వారు కూడా ఇతర ఇమాముల మాదిరిగానే మానవ నైతికత యొక్క అన్ని సద్గుణాలను ఉన్నత స్థాయిలో కలిగి ఉన్నారు.వారి అనుచరులు మరియు స్నేహితులే కాకుండా వారి శత్రువులు సైతం వారి సద్గుణాలకు ముగ్దులై వారిని ప్రశంసించేవారు. వారి ఇమామత్ అబ్బాసీ ఖులఫాల యొక్క ఖిలాఫత్ యొక్క సమయంలోనే సాగింది.అబ్బాసీ ఖులఫాలైన హరూన్ రషీద్,అమీన్,మామూన్ ఇమాం రిజా[అ.స] ల వారి సమకాలికులు.
వ్యాఖ్యానించండి