మమూన్ యొక్క ఖిలాఫత్ ప్రతిపాదనకు కారణం

గురు, 07/02/2020 - 18:19

అయతుల్లాహ్ ముహమ్మద్ హుసైన్ తబాతబాయీ ల వారి ప్రకారం మామూన్ దైవప్రవక్త[స.అ.వ] ల వారిని సంతానాన్ని తన ఖిలాఫత్ లో జోక్యం చేసుకోకుండా నియంత్రించటానికి మరియు షీయా ముస్లిముల తిరుగుబాట్లను నిరోధించటానికి ఈ విధంగా చేసాడని చెప్పవచ్చు

ఇమాం రిజా,ప్రతిపాదన,ఖిలాఫత్.

మామూన్ యొక్క పరిపాలనలో ఇమాం రిజా[అ.స] ల వారి యొక్క అనుచరులు మరి షీయాలు దైవప్రవక్త[స.అ.వ] ల వారి సంతానాన్ని వారి యొక్క నిజమైన వారసులని మరియు ఖిలాఫత్ కు వారే అర్హులని భావించేవారు.ఈ విధమైన నమ్మకం షీయా ఆదర్శాలకు దూరంగా ఉండే అబ్బాసీ ఖలీఫాల కొరకు చాలా ప్రమాదమని పరిగణించి మమూన్ ఇమాం రిజా[అ.స] ల వారి ముందు ఖిలాఫత్ యొక్క ప్రతిపాదనను ఉంచటం జరిగింది.ఇమాం ల వారు ఆ ప్రతిపాదనను స్వీకరించలేదు.ఆ తరువాత ఇమాం రిజా[అ.స] ల వారిని ఖురాసాన్ కు రప్పించటం జరిగింది. అయతుల్లాహ్ ముహమ్మద్ హుసైన్ తబాతబాయీ ల వారి ప్రకారం మామూన్ దైవప్రవక్త[స.అ.వ] ల వారిని సంతానాన్ని తన ఖిలాఫత్ లో జోక్యం చేసుకోకుండా నియంత్రించటానికి మరియు షీయా ముస్లిముల తిరుగుబాట్లను నిరోధించటానికి ఈ విధంగా చేసాడని చెప్పవచ్చు. ఉయూనొ అఖ్బారుర్ రిజా లో షైక్ సదూఖ్[అ.ర] ల వారి నివేదిక ప్రకారం ఇమాం రిజా[అ.స] ల వారి ఖిలాఫత్ కు అనుకూలంగా మమూన్ తాను ఖిలాఫత్ నుండి వైదొలగాలని మొదట్లో భావించాడు.అందువలనే ఇమాం రిజా[అ.స] ల వారు మామూన్ తో “ఒక వేళ ఖిలాఫత్ నీకు చెందినదైతే దానిని ఇతరులకు ఇచ్చే హక్కు నీకు లేదు ఒక వేళ నీకు చెందినది కాకపోతే,నీకు చెందని దానిని నాకు ఇవ్వటానికి నీకు ఎలాంటి అనుమతి లేదు” అని అన్నారు.

రెఫరెన్స్: మౌసూ అతో ఇమాం అర్ రిజా[అ.స],తబాతబాయీ,పేజీ నం:259.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13