మామూన్ ప్రతిపాదన నిజమైనదేనా?

గురు, 07/02/2020 - 18:52

మామూన్ నిజంగానే ఇమాం ల వారికి ఖిలాఫత్ ను కట్టుబెట్టాలని చూసాడా? సాక్ష్యాల ఆధారంగా అతని ప్రతిపాదన నిజమైనది కాదని తెలుస్తుంది.ఎందుకంటే ఖిలాఫత్ పట్ల అత్యాసతో ఉన్న వ్యక్తి మరియు ఆ ఖిలాఫత్ గురించి స్వతహా తన సోదరుని రక్తాన్ని,మంత్రులు మరియు కమాండర్ల రక్తాన్నే చిందించిన వ్యక్తి ఇలాంటి ప్రతిపాదన ఎందుకు చేస్తాడు?

ఇమాం రిజా,మామూన్,ఖిలాఫత్.

మామూన్ ఇమాం రిజా[అ.స] ల వారిని ఖిలాఫత్ ను స్వీకరించమని ప్రతిపాదించటం జరిగింది.ఎన్నో సందర్భాలలో ముఖ్యంగా మదీనాలో,మర్వ్ లో ఇమాం ల వారు ఉన్నప్పుడు ఖిలాఫత్ ను స్వీకరించమని మామూన్ పట్టుబట్టడం జరిగింది.ఇమాం ల వారిని బెదిరించాడు,ఇమాం రిజా[అ.స] ల వారిని చంపించేంత నీచమైన పనికి కూడా దిగజారాడు.కానీ ఇమాం రిజా[అ.స] ల వారిపై ఎప్పుడూ గెలవలేకపోయాడు.చివరకు నిరాశ చెంది తన రాజ్యానికి వారసునిగా నియమించటం జరిగింది.ఆ పదవిని కూడా ఇమాం ల వారు మామూన్ యొక్క బెదిరింపుల కారణంగా స్వీకరించటం జరిగింది.ఇలాంటప్పుడు ఒక ప్రశ్న కలుగుతుంది. మామూన్ నిజంగానే ఇమాం ల వారికి ఖిలాఫత్ ను కట్టుబెట్టాలని చూసాడా? సాక్ష్యాల ఆధారంగా అతని ప్రతిపాదన నిజమైనది కాదని తెలుస్తుంది.ఎందుకంటే ఖిలాఫత్ పట్ల అత్యాసతో ఉన్న వ్యక్తి మరియు ఆ ఖిలాఫత్ గురించి స్వతహా తన సోదరుని రక్తాన్ని,మంత్రులు మరియు కమాండర్ల రక్తాన్నే చిందించిన వ్యక్తి ఇలాంటి ప్రతిపాదన ఎందుకు చేస్తాడు?  మరియు మామూన్ ప్రతిపాదన ఒక వేళ నిజమై ఉంటే అతను ఇమాం ల వారిని అన్ని సార్లు చంపుతానని ఎందుకు బెదిరిస్తాడు? కేవలం ఇమాం ల వారి అంతర్గత ఉద్దేశాలను తెలుసుకోవటానికి మామూన్ ఈ ప్రతిపాదనను చేయటం జరిగింది.కానీ ఇమాం ల వారికి మామూన్ యొక్క లక్ష్యాలేమిటో తెలుసు ఇమాం ల వారు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాన్నని అది తన కోసం మరియు ఇస్లామిక్ ఉమ్మత్ కోసం మంచిది కాదని కూడా వారికి తెలుసు అందువలనే ఇమాం రిజా[అ.స] ల వారు అతని ప్రతిపాదనను ఎన్నో సార్లు నిరాకరించారు.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13