ప్రళయ దినంపై విశ్వాసం ఇస్లాం యొక్క మూల విస్వాశాలలో ఒకటి,ఎవరైతే తమను ముస్లింలుగా పిలుచుకుంటారో వారు ఈ ప్రళయ దినంపై తప్పని సరిగా విశ్వాసించాలి.
అనంతకరుణామయుడు అపారకృపాసీలుడైన అల్లాహ్ పేరుతో
ప్రపంచంలో నివసించే ముస్లింలలో ఏ తెగవారైనా సరే ఈ ప్రపంచం అంతరించిపోనుందని దీని తరువాత ఒక ప్రపంచం అనేది ఉందని ఆ రోజు చనిపోయిన వారందరు దేవుని ముందు హాజరు చేయబడతారని విశ్వాసిస్తారు,ఇది ఇస్లాంలోని ఐదు ముఖ్యమైన విస్వాశాలలో ఒకటి,మనవునికి మార్గదర్శిగా ఆ మహాప్రవక్తపై అవతరిపబడిన ఖురాన్ లో కూడా ప్రళయ దినం మరియు దాని లక్షణాలు మరియు ఏ పాపం చెసిన వారికి ఏ శిక్ష లభించనుంది వీటంతటి ప్రస్థావన చాల చొట్ల జరిగింది.
ఖురాన్ లో ప్రళయ దినాన్ని వివిధ రకాల పేర్లతో గుర్తుచేయటం జరిగింది ఒక చొట "ఖియమత్" అంటే మరల లేవబడే రోజు మరియు వెరే చొట "మ ఆద్" అంటే దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళే రోజు,మరికొన్ని చోట్ల దీని పేరు "యౌం"తో మొదలవుతుంది:
1. "యౌముద్దీన్" అంటే "ప్రతిఫల దినం" [అల్-హంద్/4]
2. "యౌమ యంజురుల్ మర్ ఉ మా ఖద్దమత్ యదాహ్" అంటే "ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు"[అన్-నబా/40].
3. "యౌమ తుబ్లస్సరాయిర్" అంటే "ఆ రోజు లోగుట్టులన్ని పరికించబడతాయి"[అత్-తారిఖ్/9].
4. "యౌమ యకూనున్నాసు కల్ ఫిరాషిల్ మబ్ సూస్" అంటే "ఆ రోజు మనుషులు చెల్లాచెదురైన దీపపు పురుగుల మాదిరి అయిపోతారు"[అల్-ఖారి అహ్/4].
5. "యౌమ యఫిర్రుల్ మర్ ఒ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి " అంటే "ఆ రోజు మనిషి తన (సొంత) సొదరుడి నుండి మరియు తన తల్లి,తండ్రి నుండి మరియ తన భార్య పిల్లల నుండి (పారిపోతాడు).[అబస/34,35,36].
6. "యౌమ లా యంతిఖూన్" అంటే "ఆ రోజు వారు మాట్లాడనూలేరు"[అల్-ముర్సలాత్/35].
7. "యౌమ లా తంలికు నఫ్సున్ లె నఫ్సిన్ షైఅన్" అంటే "ఆ రోజు ఏ జీవి మరో జీవి కొసం ఎమి చేయజాలదు.[అల్-ఇన్ ఫితార్/19].
ఇలా దివ్య ఖురాన్ లో వేరే చాల చొట్ల వేర్వేరు పేర్లతొ ఆ ప్రళయ దినాన్ని గుర్తుచేయటం జరిగింది,ఖురాన్ కేవలం దాని పేర్లు మరియు దాని లక్షణాలను ప్రస్థావించడం లేదు దానితో పాటు ఆ రోజున ఏ కష్టాల బారిన పడకుండా ఉండటానికి ఉపాయాలను కూడా చూపిస్తుంది,ఒక వేళ మనం ఈ దివ్య ఖురాన్ ను మన మార్గదర్శిగా చేసుకున్నట్లైతే ఆ రోజు సంభవించే కష్టాలు మరియు ఆపత్తుల నుండి విముక్తి పొందినట్లే.
వ్యాఖ్యానించండి