ఒవైస్ గురించి దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉల్లేఖనం.

ఆది, 07/05/2020 - 15:51

దైవప్రవక్త[స.అ.వ] దృష్టిలో ఒవైస్ గొప్పతనన్ని వివరించే ఒక సంఘటన.

ఒవైస్,దైవప్రవక్త,ఒంటెల కాపరి.

ఒవైసె ఖరని ఒంటెలను మేపి దాని ద్వారా వచ్చే ఆదాయంతో తన తల్లిని పోషించేవారు.ఒక రోజు దైవప్రవక్త[స.అ.వ] ల వారి దర్శనార్ధం మదీనా వెళ్ళుటకు తన తల్లిని అనుమతిని కోరారు.వారి తల్లి "నేను అనుమతిని ఇస్తాను కానీ ఒక షరతు,నీవు మదీనాలో సగం రోజు కన్నా ఎక్కువ ఉండకూడదు" అని అన్నారు.ఒవైస్ మదీనాకు చేరుకుని దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఇంటికి వెళ్ళగా దైవప్రవక్త[స.అ.వ] ల వారు లేరు.ఒవైస్ రెండు గంటల వరకు నిరీక్షించి దైవప్రవక్త[స.అ.వ] ల వారిని చూడకుండానే యెమెన్ కు తిరిగి వచ్చేసారు.ఎప్పుడైతే దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఇంటికి తిరిగి వచ్చారో అప్పుడు "ఈ ఇంట్లో ప్రకాసించే ఈ కాంతి ఎవరిది?" అని ప్రశ్నించారు.దానికి "ఒంటెల కాపరి అయిన ఒవైస్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది" అని సమాధానమివ్వటం జరిగింది.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు "అవును ఒవైస్ ఈ కాంతిని మా ఇంట్లో మాకు బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయాడు" అని అన్నారు.ఇటువంటి వ్యక్తి గురించి దైవప్రవక్త[స.అ.వ] ల వారు వేరొక చోట ఈ విధంగా సెలవిచ్చారు: "పరిమళభరితమైన స్వర్గపు గాలి యెమెన్ నుండి వీస్తుంది. నిన్ను చూడటానికి నేను ఎంతగానో ఆశక్తిగా ఉన్నాను ఓ ఒవైస్!" అని అన్నారు.

రెఫరెన్స్: ముంతహల్ ఆమాల్,షైఖ్ అబ్బాసె ఖుమ్మి,1వ భాగము,పేజీ నం:142.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12