రాఫిజీ

మంగళ, 07/14/2020 - 16:46

షియా ముస్లిముల విరోధుల పుస్తకాలలో “రాఫిజీ” లేదా “రవాఫిజ్” లాంటి బిరుదులు లిఖించబడి ఉన్నాయి...

 

రాఫిజీ

షియా ముస్లిముల విరోధుల పుస్తకాలలో “రాఫిజీ” లేదా “రవాఫిజ్” లాంటి బిరుదులు లిఖించబడి ఉన్నాయి. అందకనే పాఠకుడికి, దానిని చదవగానే “షియా ముస్లిములు దైవప్రవక్త[స.అ] దౌత్యాన్ని ధిక్కరించేవారు, ఇస్లాం చట్టాన్ని నిరాకరించేవారు, మరియు వాటి పై అమలు చేయనివారు” అని ఆలోచనలు వస్తాయి.
వాస్తవానికి “బనీఉమయ్యాహ్” మరియు “బనీఅబ్బాస్”ల అధికారులు మరియు వాళ్ళ ముఖస్తుతి చేసే ఉలమాలు, షియా ముస్లిములను ఈ చెడు బిరుదులతో గుర్తుచేసే వాళ్ళు. ఎందుకంటే షియాలు హజ్రత్ అలీ[అ.స]ని ఇష్టపడేవారు. వారు అబూబక్ర్, ఉమర్, ఉస్మానుల ఖిలాఫత్‌ను నిరాకరించే వారు. మరి అలాగే అమవీ మరియు అబ్బాసీయుల అధికారుల ఖిలాఫత్‌ను కూడా నిరాకరించేవారు. బహుశ ఆ అధికారులు నకిలీ హదీసులను తయారు చేసే సహాబీయుల నుండి కొందరి సహాయంతో ఉమ్మత్‌పై అధికారాన్ని చేజిక్కించుకొని ఉంటారు. ఎందుకంటే సహాబీయులు వాళ్ళ ఖిలాఫత్‌ను షరీఅత్ పరమైనది, అని ప్రకటించేవారు. మరియు అల్లాహ్ యొక్క ఈ ప్రవచనాన్ని నిదర్శనంగా ప్రదర్శిస్తూ ఉంటారు: “ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్తకు మరియు మీలోని ఊలిల్ అమ్ర్(అధికారం కలిగి ఉన్నవారు)కు విధేయత చూపండి”[నిసా:59]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4