ఉలుల్ అమ్ర్ అనగా అబ్బాసీ మరియు అమవీ అధికారులు అని తప్పుడు హదీసులు నిదర్శనం...

ఖుర్ఆన్ ఆదేశం: “ఓ విశ్వాసులారా! అల్లాహ్
కు విధేయత చూపండి. ప్రవక్తకు మరియు మీలోని ఊలిల్ అమ్ర్(అధికారం కలిగి ఉన్నవారు)కు విధేయత చూపండి”[నిసా:59]
ముస్లిం వర్గాలలో కొందరు అబ్బాసీ మరియు అమవీ అధికారులే ఈ ఆయత్ లో సూచించబడిన అధికారులు అని నమ్ముతారు. ఈ ఆయత్ వాళ్ళ గురించే అవతరించబడిందనీ మరియు వాళ్ళే “أُوْلو ٱلۡأَمۡرِ” అనీ, మరి వాళ్ళ ఆజ్ఞను పాటించడం ప్రతీ ముస్లింపై వాజిబ్, అని అంటారు. కొన్ని సందర్భాలలో అధికారులు, దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు అని నకిలీ హదీసులను తయారు చేసేవారిని డబ్బు ఆశ చూపించి కొనేవారు. అలా దైవప్రవక్త[స.అ] ద్వారా ఇటువంటి హదీస్ లు లిఖించబడ్డాయి:لیس احد خرج من السلطان شبرا فمات علیه الامات الجاھلیه అనువాదం: “ఎవ్వరికి కూడా అధికారికి ఒక్క అడుగు కూడా వ్యతిరేకించే హక్కులేదు మరియు ఒకవేళ అతడు అలాగే(వ్యతిరేకతలో) చనిపోతే, అతడు అజ్ఞాన కాలం(అవిశ్వాసిగా)లో చావు పొందినట్లు”.
అంటే ఏ ముస్లిముకూ అధికారిని వ్యతిరేకించే హక్కు లేదన్నమాట.
వ్యాఖ్యానించండి