నరకవాసులు

గురు, 01/04/2018 - 17:14

నరకవాసుల లక్షణాలను ఖురాన్ అనుసారంగా ఈ క్రింది వ్యాసంలో ప్రస్థావించడం జరిగింది. 

నరకవాసులు

మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గం మరియు చెడుపనుల ఫలితంగా నరకమునకు పోవుట తప్పదు,ఇది అందరికి తెలిసిన విషయమే కాని ఎవరు స్వర్గవాసులు మరియు ఎవరు నరకవాసులు?దీనికి జవాబు కూడా ఆ అంతిమ దైవగ్రంధమే చెప్పాలి.
నరకవాసులు మరియు వారి చాలా లక్షణాలను ఖురాన్ పేర్కొనటం జరిగింది వాటిలో కొన్నింటిని మేము ఇక్కడ ప్రస్థావిస్తున్నాము:
1. వారు అవిశ్వాసులు:
قُل لِّلَّذِينَ كَفَرُوا۟ سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ ٱلْمِهَادُ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసులతో చెప్పు: “త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు. నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం”.[అల్-బఖర/39].
2. వారు చెడు కార్యములు చేయు వాళ్ళు:
وَلَيْسَتِ ٱلتَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ حَتَّىٰٓ إِذَا حَضَرَ أَحَدَهُمُ ٱلْمَوْتُ قَالَ إِنِّى تُبْتُ ٱلْـَٰٔنَ وَلَا ٱلَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُو۟لَٰٓئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًۭا
నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, ''ఇప్పుడు నేను పశ్చాత్తాప పడు తున్నాను'' అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు.   ఇలాంటి వారి కోసమే మేము వ్యధా భరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము[అన్-నిసా/18].
3. వడ్డి తినే వారు:
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَأْكُلُوا۟ ٱلرِّبَوٰٓا۟ أَضْعَٰفًۭا مُّضَٰعَفَةًۭ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ٭وَٱتَّقُوا۟ ٱلنَّارَ ٱلَّتِىٓ أُعِدَّتْ لِلْكَٰفِرِينَ
ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి, అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి[ఆలె ఇమ్రాన్/130, 131].
4. నమాజు చేయని వారు:
مَا سَلَكَكُمْ فِى سَقَرَ٭قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ
''ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది?'' (అని ప్రశ్నిస్తారు), వారిలా సమాధానమిస్తారు: ''మేము నమాజు చేసేవారము కాము.''[అల్ ముద్దసిర్/42,43].
5. వారు పిసినారులు:
ٱلَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ ٱلنَّاسَ بِٱلْبُخْلِ وَيَكْتُمُونَ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِ وَأَعْتَدْنَا لِلْكَٰفِرِينَ عَذَابًۭا مُّهِينًۭا
వారు పిసినారులుగా ప్రవర్తించటమే గాక, ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారు కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము (అన్-నిసా/37).
6. అల్లాహ్ మరియు తన ప్రవక్తను పరిహాసించేవారు:
ذَٰلِكَ جَزَآؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا۟ وَٱتَّخَذُوٓا۟ ءَايَٰتِى وَرُسُلِى هُزُوًا
వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు[అల్-కహఫ్/106].
7. క్రూరత్వంగా ప్రవర్తించేవారు:
وَقَالَ مُوسَىٰ رَبِّىٓ أَعْلَمُ بِمَن جَآءَ بِٱلْهُدَىٰ مِنْ عِندِهِۦ وَمَن تَكُونُ لَهُۥ عَٰقِبَةُ ٱلدَّارِ ۖ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّٰلِمُونَ
మూసా ఇలా చెప్పాడు: "తన వద్ద నుంచి మార్గదర్శకత్వాన్ని తెచ్చే వ్యక్తి గురించి, పరలోక పరిణామం రీత్యా కృతార్థులయ్యే వారి గురించి నా ప్రభువుకు బాగా తెలుసు. దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు."[అల్-ఖిసస్/37].
ఇంకా చాలా కారణాలను ఖురాన్ ప్రస్తావిస్తుంది వీటి బారిన పడకుండా ఆ పరమేశ్వరుడైన అల్లాహే తమ దాసులను రక్షించవలెనని కోరుకుందాం.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11