యదార్థాన్ని వివరించాలి...

శని, 07/18/2020 - 16:32

కేవలం ఒక్క అనుమానం తొలిగిపోతే ఒక శత్రువు, మిత్రుడిగా మారడాన్ని చూడగలరు అని వివరిస్తున్న సంఘటన...

యదార్థాన్ని వివరించాలి...

కేవలం ఒక్క అనుమానం తొలిగిపోతే ఒక శత్రువు, మిత్రుడిగా మారడాన్ని చూడగలరు.
చరిత్రలో ఉన్న ఒక సంఘటనయే దీనికి నిదర్శనం.
సిరియాకు చెందిన ఒక వ్యక్తి. అతడు దైవప్రవక్త[స.అ] యొక్క సమాధి దర్శనానికై మదీనాలో ప్రవేసించాడు. అక్కడ గుర్రంపై కూర్చుని ఉన్న ఒక గొప్ప వ్యక్తిని చూశాడు. అతని చుట్టూ ఆజ్ఞకోసం అతని సహాబీయులు వేచి ఉన్నారు. ప్రపంచంలో ముఆవియా కన్న ఎక్కువ ఘనత మరియు గౌరవం మరొకరికి ఉంటాయా, అని ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఆశ్చర్యంగా ఉండి పోయాడు!. అతడు, ఇతనెవరూ? అని ప్రశ్నించాడు. ఇతను అలీ ఇబ్నె అబీతాలి[అ.స] కుమారుడు హసన్[అ.స], అని సమాధానమిచ్చారు. అబూతురాబ్ కుమారుడు, ఖారిజీ ఇతడే! అని చెప్పి, ఇమామ్ హసన్[అ.స] మరియు అతని తండ్రి మరియు కుటుంబసభ్యులను అపవాదించడం మరియు శపించడం మొదలు పెట్టాడు.
ఇమామ్ హసన్[అ.స] అనుచరులు ఖడ్గాలను ఒరల నుండి తీసి అతనిని చంపేయాలని అనుకున్నారు, కాని ఇమామ్ హసన్(అ.స) వారిను ఆపారు. గుర్రం నుండి దిగి క్రిందికు వచ్చి అతనికి స్వాగతం పలికి ఇలా అన్నారు: ఓ సోదరా! నీవు భాటసారివా? ఆ వ్యక్తి అవును నేను అమీరుల్ మొమినీన్ మరియు ముస్లిముల నాయకుడైన ముఆవియా ఇబ్నె అబీసుఫ్యాన్ యొక్క అనుచరుడిని, అని అన్నాడు. ఇమామ్ హసన్[అ.స] మరలా అతడికి స్వాగతం పలికి ఇలా అన్నారు: నీవు ఈ రోజు నా అతిథివి. సీరియావాసుడు అంగీకరించలేదు, కాని ఇమామ్ హసన్[అ.స] అతను ఇంటికి రావడానికి అంగీకరించేంత వరకు వదల్లేదు. ఇమామ్ స్వయంగా అతనిని అతిథి మర్యాదలు చేశారు. అతడు మూడు రోజుల పాటు ఇమామ్ ఇంట్లోనే ఉన్నాడు. నాలుగోవ రోజు అతడి ముఖంపై పశ్చాత్తాపం కనిపించింది, ఇమామ్ హసన్[అ.స]తో తాను చేసిన ఆ చెడు ప్రవర్తనకు బదులు అతని ఈ అతిథి మర్యాద మరియు సత్ప్రవర్తన చూసి ఇమామ్‌తో క్షమాపణ కోరాడు. ఇమామ్‌తో తనను క్షమించమని కోరాడు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ:
ఇమామ్ హసన్[అ.స]: ఓ సోదరా! నీవు ఖుర్ఆన్ చదివావా?
ఆ వ్యక్తి: నాకు పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.
ఇమామ్ హసన్[అ.స]: అల్లాహ్ అన్ని అపవిత్రతలను దురంగా ఉంచి పవిత్రులుగా నిర్ధారించిన ఆ అహ్లెబైత్[అ.స] ఎవరో నీకు తెలిసా?.
షామీ: అవును తెలుసు, అది ముఆవియా మరియు అబూసుఫ్యాన్ వంశీకులు!.
అక్కడున్న వారు ఆశ్చర్యపడ్డారు, కాని ఇమామ్ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నారు: నేను “అలీ[అ.స]” కుమారుడు హసన్[అ.స]నీ, నా తండ్రి దైవప్రవక్త[స.అ] గారి పినతండ్రి కుమారుడు. నా తల్లి “ఫాతమా జహ్రా[స.అ]”, ఆమె ప్రపంచ స్త్రీలకు నాయకురాలు. నా తాతాగారు దైవప్రవక్త[స.అ], ప్రవక్తలందరి నాయకులు. నా పినతండ్రి సయ్యదుష్షుహదా “హంజా”. ఇంకో పినతండ్రి “జాఫరె తయ్యార్”. అల్లాహ్ ద్వార పవిత్రులుగా నిశ్చయించబడినటువంటి మరియు ముస్లిములపై మా ప్రేమను వాజిబ్ చేయబడినటువంటి ఆ వంశం, మాదే. మరి మాపై అల్లాహ్, ఆయన దూతలు దురూద్ పంపుతారు మరియు ముస్లిములకు మాపై దురూద్ పంపమని ఆదేశించబడినటువంటి వాళ్ళము. నేనూ, నా సోదరుడు స్వర్గయువకుల నాయకులం. 
ఇమామ్ హసన్[అ.స] క్రమంగా అహ్లెబైత్[అ.స]ల ప్రతిష్టతలను చెబుతూనే ఉన్నారు, చివరికి యదార్ధం అతడికి తెలిసోచ్చింది. ఆ వ్యక్తికి అతనిపై ఇష్టం ఏర్పడింది మరియు ఏడ్పు మొదలు పెట్టాడు. ఇమామ్ హసన్[అ.స] యొక్క చేతులును హత్తుకొని ముద్దాడాడు మరియు తాను చెప్పిన మాటలపై క్షమాపణ కోరుతూ ఇలా అన్నాడు: అల్లాహ్ ప్రమాణంగా చెబుతున్నాను, మదీనాలో ప్రవేసించిన రోజు మిమ్మల్ని ద్వేషించినంతగా మరెవ్వరినీ ద్వేషించే వాడిని కాదు, కాని ఈరోజు మీ కన్నా ఎక్కువ ఎవ్వరిని ఇష్టపడడం లేదు. మీపై ప్రేమ మరియు మీ అనుచరణ ద్వార అల్లాహ్‌కు దగ్గరవ్వాలని అనుకుంటున్నాను, మరియు మీ శత్రువులను అసహ్యిస్తున్నాను.
ఇమామ్ తమ అనుచరులతో ఇలా అన్నారు: మీరు ఈ అమాయకుడిని చంపాలని అనుకున్నారు. ఒకవేళ అతనికి యదార్ధం తెలిసి ఉంటే ద్వేషించేవాడు కాదు. షామ్‌లో ఉన్న చాలా మంది ఇటువంటి వారే, ఒకవేళ వాళ్ళు యదార్ధం తెలుసుకుంటే, దానిని అనుచరిస్తారు.
ఆ తరువాత ఈ ఆయత్‌ను పఠించారు:
إِنَّمَا تُنذِرُ مَنِ ٱتَّبَعَ ٱلذِّكۡرَ وَخَشِيَ ٱلرَّحۡمَٰنَ بِٱلۡغَيۡبِۖ فَبَشِّرۡهُ بِمَغۡفِرَةٖ وَأَجۡرٖ كَرِيمٍ
అనువాదం: “(నీవు) కేవలం హితభోధన (ఖుర్ఆన్)ను అనుచరించే వాడిని మరియు కరుణామయుడైన (అల్లాహ్) ను చూడకుండానే భయపడేవాడిని మాత్రమే హెచ్చరించగలవు. కనుక అతనికి క్షమాభిక్షా, మహత్యమైన ప్రతిఫలమూ (లభిస్తాయానే) సుభవార్తను అందించు”[యాసీన్:11]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7