ముస్లిం ఇబ్నె అఖీల్ కూఫాలో

బుధ, 07/29/2020 - 15:26

ముస్లిం ఇబ్నె అఖీల్ కూఫా చేరుకున్న తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి సంక్షిప్త వివరణ.

ముస్లిం ఇబ్నె అఖీల్,ఉబైదుల్లాహ్,కూఫా.

ముస్లిం ఇబ్నె అఖీల్ కూఫా చేరుకున్నప్పుడు నొమాన్ ఇబ్నె బషీర్ కూఫా గవర్నర్ గా ఉన్నాడు.ఎప్పుడైతే కూఫా వాసులు ముస్లిం చేతిపై బై అత్ చేసారన్న వార్త తెలిసిందో  నొమాన్ కూఫా వాసులను సంభోదిస్తూ నేను మీకు విభజనకు దూరంగా ఉండమని తాకీదు చేస్తున్నాను మరియు అతను[ముస్లిం] ఎప్పటివరకైతే నాతో యుద్ధాన్ని కోరుకోడో నేను కూడా అతనితో యుద్ధాన్ని కోరుకోను అని అన్నాడు. బని ఉమ్మయ్యా మద్దతు దారులైన ఉమర్ ఇబ్నె సాద్,ముహమ్మద్ ఇబ్నె అష్ అసె కింది మొదలైన వారు నొమాన్ యొక్క పద్దతిపై అభ్యంతరం తెలిపిన తరువాత యజీద్ కు ఒక లేఖ ద్వారా నోమాన్ చేతకానివాడని,ఒక వేళ నీకు కూఫా దక్కాలనుకుంటే నోమాన్ ను గద్దె దించక తప్పదని పిర్యాదు చేసారు.ఈ విషయాన్ని తెలుసుకున్న యజీద్, బస్రా పట్టణానికి గవర్నర్ గా ఉన్న ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్ ను కూఫాకు పంపటం జరిగింది. ఉబైదుల్లాహ్ మరియు అతని తండ్రి జియాద్ లను మునుపటి ఖలీఫాలు ఎన్నో తిరుగుబాట్లను అణిచివేసేందుకు ఉపయోగించి ఉన్నారు.అలాంటి ఉబైదుల్లాహ్ పట్ల కూఫా వాసులలో అసహనం కూడా ఉంది.కూఫా చేరుకున్న ఉబైదుల్లాహ్ ముస్లింతో సంబంధమున్న వారిని వెతికి వారి పేర్లను తనకు ఇవ్వాలని,లేదా మేము ఉమ్మాయా ఖలీఫాలకు వ్యతిరేకించమని ప్రతీజ్ఞ చేయాలని,ఒక వేళ అలా కూడా చేయక పోతే వారి రక్తాన్ని చిందించి వారి ఆస్తిని జప్తు చేసుకుంటానని బెదిరించాడు. ఉబైదుల్లాహ్ రాకతో మరియు అతని బెదిరింపులతో కూఫాలో అసురక్షితమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి పరిస్థితిలో ముఖ్తారె సఖఫి ఇంట్లో తల దాచుకున్న ముస్లిం, తనకు ఆశ్రయమివ్వాలని కూఫా పెద్దలలో ఒకరైన హాని ఇబ్నె ఉర్వాను కోరారు.ముస్లిం యొక్క భద్రత యొక్క బాధ్యతను స్వీకరించటం ప్రమాదమైనప్పటికి హాని,ముస్లిం కు ఆశ్రయమిచ్చారు.

రెఫరెన్స్: తారీఖుల్ ఉమం వల్ ములూక్,తబరి,4వ భాగము,పేజీ నం:265,అన్సాబుల్ అష్రాఫ్,బిలాజరి,పేజీ నం:77,78.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20