ముస్లిం ఇబ్నె అఖీల్ ప్రాణత్యాగం

బుధ, 07/29/2020 - 19:05

చరిత్ర ప్రకారం ముస్లిం మద్దతుదారులను చెదరగొట్టటానికి ఉబైదుల్లాహ్ సహచరుల అబద్ధపు ప్రచారాలు ప్రజలలో భయాన్ని పెంచాయి.ఎంతగా అంటే చివరకు ముస్లిం ఇబ్నె అఖీల్ ఒంటరిగా మిగిలిపోయారు. ఒంటరిగా మరియు నిరశ్రయులైన తరువాత ముస్లిం “తౌఆ” అనే మహిళ ఇంట్లో తలదాచుకున్నారు.చివరకు అక్కడకు కూడా చేరుకున్న ఒబైదుల్లాహ్ సైనికులతో ఒంటరిగా పోరాడి ఓడిపోయారు.

ముస్లిం ఇబ్నె అఖీల్,ఒబైదుల్లాహ్,తిరుగుబాటు.

  ముస్లిం ఇబ్నె అఖీల్ తన అనుచరులను గోప్యంగా కలుసుకునేవారు.కానీ ఉబైదుల్లహ్ ఇబ్నె జియాద్ నియమించిన గూఢచారులలో ఒకడైన “మాఖల్” తనను తాను ముస్లిం ఇబ్నె అఖీల్ అనుచరుడిగా చూపి,ముస్లిం ఉన్న చోటు గురించి ఉబైదుల్లాహ్ కు తెలియపరచాడు.ముస్లిం ఉన్న చోటు గురించి తెలుసుకున్న ఉబైదుల్లాహ్,హాని ఇబ్నె ఉర్వహ్ ను తన దర్బారుకు పిలిచి ముస్లిం ను తనకు అప్పగించాలని చెప్పాడు.కానీ హానీ భయపడలేదు,ముస్లిం ను అప్పగించటాన్ని తిరస్కరించిన హానీ ను ఖైదు చేయటం జరిగింది. కానీ ముస్లిము మద్దతుదారులు ఉబైదుల్లాహ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి నిశ్చయించుకున్నరు.వారి సంఖ్య 4000 అని చరిత్ర చెబుతుంది.ఈ తిరుగుబాటులో ముస్లిం మద్దతుదారులలో ముఖ్యంగా ముస్లిం ఇబ్నె ఔసజ,అబి సమామయె సైదావి మొదలైన వారు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.తిరుగుబాటుదారులు చివరకు ఉబైదుల్లాహ్ యొక్క రాజ భవనాన్ని చుట్టుముట్టారు.ఆ సమయానికి ఆ రాజమందిరంలో కేవలం 50 మంది ఉన్నారు. చివరకు కూఫాలో ఉబైదుల్లాహ్ మద్దతుదారులైన మొహమ్మద్ ఇబ్నె అష్ అస్,షబస్ ఇబ్నె రబీ,షుమ్ర్ ఇబ్నె జిల్ జొషన్ మొదలైన వారు ఉబైదుల్లాహ్ కు షాం నుండి సైన్యం రానుందని అది వస్తే కూఫాలో ఎవరూ ప్రాణాలతో మిగలరని చెప్పి బెదిరించమని చెప్పారు.చివరకు ఉబైదుల్లాహ్ యొక్క ఈ పన్నాగం సఫలమైంది.చరిత్ర ప్రకారం ముస్లిం మద్దతుదారులను చెదరగొట్టటానికి ఉబైదుల్లాహ్ సహచరుల అబద్ధపు ప్రచారాలు ప్రజలలో భయాన్ని పెంచాయి.ఎంతగా అంటే చివరకు ముస్లిం ఇబ్నె అఖీల్ ఒంటరిగా మిగిలిపోయారు. ఒంటరిగా మరియు నిరశ్రయులైన తరువాత ముస్లిం “తౌఆ” అనే మహిళ ఇంట్లో తలదాచుకున్నారు.చివరకు అక్కడకు కూడా చేరుకున్న ఒబైదుల్లాహ్ సైనికులతో ఒంటరిగా పోరాడి ఓడిపోయారు. ముస్లిం ను ముహమ్మద్ ఇబ్నె అష్ అస్ బంధీని చేసి ఒబైదుల్లాహ్ ముందు హాజరుపరచటం జరిగింది.చివరకు వారి తల నరికి వారి మృతదేహాన్ని రాజభవనంపై నుండి క్రిందికి పడవేసారు.

అన్సాబుల్ అష్రాఫ్,బిలాజరి,2వ భాగము,పేజీ నం:79,80,తారీఖుల్ ఉమం వల్ ములూక్,5వ భాగము,పేజీ నం:350,374.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11