ఆయతుల్లాహ్ రష్తీ యొక్క త్యాగం

శని, 01/23/2021 - 15:09

షియా వర్గానికి చెందిన ప్రముఖ ముజతహిద్ మర్హూమ్ సయ్యద్ రష్తీ ఏ విధంగా తాము చేసిన త్యాగం వల్ల గొప్ప స్థానాన్ని పొందారో వారే స్వయంగా వివరించారు...

ఆయతుల్లాహ్ రష్తీ యొక్క త్యాగం

అల్ప ఆలోచనగలవారు కేవలం తమ సౌకర్యం మరియు అసౌకర్యాలు గురించే ఆలోచిస్తారు, ఇతరుల కష్టాలను పట్టించుకోరు, అవి వారి దృష్టిలో విలువలేనివి. కాని గొప్పగా ఆలోచించేవారి దృష్టి తమ కష్టాల కన్నా ఇతరుల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
షియా వర్గానికి చెందిన ప్రముఖ ముజతహిద్ మర్హూమ్ సయ్యద్ రష్తీ, ఇరాన్ దేశంలో ఉన్న ఇస్ఫహాన్ పట్టణంలో ఉండేవారు. వారు విజ్ఞాన మరియు ధర్మనిష్ఠ పరంగా చాలా గొప్ప స్థానం గలవారు. వారి స్థాయి గురించి చెప్పాలంటే అప్పటి రాజు నాసిరుద్దీన్ షాహ్ కుమారుడి వద్ద ఎవరో సహాయం కోరి వస్తే అతడితో ఇలా అన్నాడు: ఎందుకని నా వద్దకు వచ్చావు? విజ్ఞాన సహాయం కావాలి అంటే సయ్యద్ మస్జిదుకు వెళ్ళు, ధన సహాయం కావాలి అంటే సయ్యద్ మస్జిదుకు వెళ్ళు. నిజంగా మర్హూమ్ రష్తీ ఇస్ఫహాన్ పట్టణంలో సాటిలేని మస్జిద్ నిర్మించారు, దాని పేరు మస్జిదె సయ్యద్.
ఇక్కడ ప్రశ్నేమిటంటే వారు ఈ స్థానానికి ఎలా చేరుకున్నారు?
ఈ ప్రశ్నకు వారే సమాధానమిచ్చారు: ఒక కుక్క నన్ను ఈ స్థానానికి చేర్చింది, నేను నజఫ్ లో చదువుకుంటున్న సమయంలో ఇరాన్ నుండి నా ఖర్చులకు పంపబడే డబ్బులు రాలేదు, కొద్దిరోజులు ఎవరికి చెప్పకుండా సహనంగా ఉన్నాను కాని చివరికి అవసరం వచ్చి నా స్నేహితుడి నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. రొట్టే మరియు తలకాయ కూర తీనాలని నిర్ణయించుకున్నాను, వాటిని కొని ఇంటికి వెళ్లుండగా నీళ్లలో పడి వున్న కుక్కను చూశాను అది చాలా ఆకలితో ఉంది, దానికి మూడు కుక్కపిల్లలు ఉన్నాయి, అవి దాని రోమ్ములపై పడి ఉన్నాయి కాని దాని రోమ్ములో పాలు లేవు. ఆ కుక్కను చూసి నా మనసు కరిగిపోయింది. నేను ఎలాగో ఇన్ని రోజులు ఆకలిని సహించాను ఇంకా కొంతకాలం సహిద్దాం అని అనుకొని తనకు అవసరం ఉన్నా సరే ఆ రొట్టెను ముక్కలు చేసి ఆ కూరలో నానబెట్టి ఆ కుక్క ముందు పెట్టారు. ఆ కుక్క దానిని తింది...
ఆ తరువాత నేను వెళ్ళి ఆ పాత్రను తిరిగి ఇచ్చేశాను, అల్లాహ్ నాకోసం కొంత ధనాన్ని ఏదో విధంగా చేరేటట్లు చేశాడు. కొంత కాలం తరువాతే షస్త్(గీలాన్ కు చెందిన) పట్టణం నుండి ఒకడు వచ్చి ఇలా అన్నాడు.. ఫలానా పెద్ద మనిషి మరణించాడు, అతడి ఆస్తి నుండి మూడవ వంతు నీకు ఇవ్వమని వీలు రాశారు.
నేను లెక్కేసుకుంటే సరిగా నేను ఆ కుక్కకు ఏ రోజైతే సహాయం చేశానో అదే రోజు అస్ర్ సమయంలో ఈ వీలు నా గురించి చేయబడింది అని తెలుసుకున్నాను. మరియు మెల్లమెల్లగా ఆ రోజు నుండి ఇస్ఫహాన్ లో నేను గొప్ప స్థానానికి చేరుకున్నాను.(గంజీనయె మఆరిఫ్, పేజీ164)

రిఫరెన్స్
గంజీనయె మఆరిప్, పేజీ164, జిహాద్ బా నఫ్స్, ఆయతుల్లాహ్ మజాహిరీ, పేజీ135 నుండి ఈ సంఘటన ఉల్లేఖించబడింది.          

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15