త్యాగం మనిషి యొక్క మంచి గుణం. త్యాగం కేవలం అల్లాహ్ సామిప్యాన్ని పొందేందుకు చేసినట్లైతే దాని స్థానమే వేరు.
త్యాగం మనిషి యొక్క మంచి గుణం. త్యాగం కేవలం అల్లాహ్ సామిప్యాన్ని పొందేందుకు చేసినట్లైతే దాని స్థానమే వేరు. ఖుర్ఆన్ లో కొన్ని విధాల త్యాగాల గురించి వివరించబడి ఉంది. వాటిలో మూడు త్యాగాలు
1. ధన త్యాగం:
ఖుర్ఆన్: “మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవమార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు”[ఆలిఇమ్రాన్:92]
2. నిద్ర త్యాగం:
ఖుర్ఆన్: “వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు”[సజ్దా:16]
3. కామ త్యాగం:
ఖుర్ఆన్: “యూసుఫ్ ఉంటున్న ఇంటి స్ర్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. ఒకసారి తలుపులు మూసేసి, రా... రా! అని అంది. ‘అల్లాహ్ శరణు! ఆయన నా ప్రభువు. ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు. అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు’ అని యూసుఫ్ అన్నారు”[యూసుఫ్:23]
వ్యాఖ్యానించండి