.రమజాన్ పవిత్ర మాసం పొడుగునా ఉపవాసదీక్ష నిర్వహించిన ముస్లిములందరూ షవ్వాల్ నెల మొదటి రోజున నిర్వహించే నమాజ్ పద్దతి.
రమజాన్ పవిత్ర మాసం పొడుగునా ఉపవాసదీక్ష నిర్వహించిన ముస్లిములందరూ షవ్వాల్ నెల మొదటి రోజున రెండు రక్అత్ నమాజ్ చదువుతారు, దానిని చేసే విధానం:
రెండు రక్అత్ నమాజ్ ఈ ఉద్దేశంతో చదవాలి “దో రక్అత్ నమాజే ఈదుల్ ఫిత్ర్ పఢ్తా/పఢ్తీ హూఁ ఖుర్బతన్ ఇలల్లాహ్”(రెండు రక్అత్ నమాజ్ చదువుతున్నాను అల్లాహ్ సామీప్యం పొందెందుకు).
మొదటి రక్అత్: “అల్ హంద్” సూరా తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్ అ’లా” సూరాను చదవాలి(సూరా నెం:87) చదవాలి. ఆ తరువాత రెండు చేతులూ పైకెత్తి(ఖునూత్) ధార్మిక గ్రంథాలలో ఉన్న విధంగా ఒక ప్రత్యేక పఠనాన్ని ఐదు సార్లు చదవాలి, ప్రతీ పఠనం మధ్య చెతులను చెవుల వరకు ఎత్తి ఒకసారి “అల్లాహు అక్బర్” అని చెప్పాలి.
రెండవ రక్అత్: “అల్ హంద్” సూరా తరువాత “వష్షంస్” సూరాను చదవాలి(సూరా నెం:91). ఇక్కడ కూడా ఖునూత్ చదవాలి కాని కేవలం నాలుగు సార్లు మాత్రమే.
ఈ నమాజ్
లో పై చెప్పబడిన సూరాలు కంఠస్తం లేకుంటే వేరే ఏ సూరానైనా చదవగలరు. [మఫాతీహుల్ జినాన్, రమజాన్ ప్రార్ధనా విధానాల భాగంలో]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ ప్రార్ధనా విధానాల భాగం నుండి.
వ్యాఖ్యలు
Qunoot bhi mention karna tha
Thanks for procedure of Eid ul Fitr
వ్యాఖ్యానించండి