ఇఖ్లాస్ పొందడం ఎలా

సోమ, 01/25/2021 - 16:22

కేవలం అల్లాహ్ కోసం మాత్రమే అమలు చేయాలంటే ఏమి చేయాలి అన్ని విషయం పై సంక్షిప్త వివరణ...

ఇఖ్లాస్ పొందడం ఎలా

1. నిజమైన నమ్మకం: అల్లాహ్ పై నమ్మకం చేసే పనులలో స్వచ్ఛతకు బలమైన కారణం. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: అమలులో స్వచ్ఛతకు కారణం నమ్మకం.[1] అల్లాహ్ పై నమ్మకం ఉంటే ఆయన అంతిమ ప్రవక్త[స.అ] ఉపదేశాలపై కూడా నమ్మకం ఉంటుంది.
2. జ్ఞానవిజ్ఞానాలు: ముఖ్యంగా ధార్మిక జ్ఞానం కలిగి ఉండడం. మనిషి హృదయం అర్హత కలిగి ఉంటే దైవప్రవక్త(స.అ) ఉపదేశించిన ఈ హదీస్ “విజ్ఞానం కాంతిలాంటిది, అల్లాహ్ తాను కోరినవారి హృదయంలో నిర్ధారిస్తాడు”[2] విధంగా ధార్మిక విధ్యను పొందుతుంది. దాని ఫలితం అమలులో స్వచ్ఛత తెలిసి వస్తుంది.
హజ్రత్ అలీ[అ.స] ఉల్లేఖనం: విజ్ఞానం యొక్క (ప్రతి)ఫలం, అమలులో స్వచ్ఛత(కు కారణం)[3]     
3. ఆశలను తగ్గించుకోవడం: ఆశలు ఉండటం మనిషికి అవసరం మరియు మంచిది కూడా, ఆశలే లేకుంటే చాలా అభివృద్ధులు జరగవు, చాలా పనులు ముందుకు సాగవు. మనిషిని ఇఖ్లాస్ నుండి ఆపే మరియు సంపూర్ణ స్థాయికి చేరకుండా అడ్డుపడే మిథ్య మరియు దీర్ఘ ఆశలు ఉండకూడదు.
ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: నీ ఆశలను తగ్గించుకో, నీ అమలు స్వచ్ఛమైనదౌతుంది[4]
4. ఇతరుల నుండి ఏదీ ఆశించకపోవడం: ఇతరుల నుండి ఏదీ ఆశించని వాడే నిజమైన ఇఖ్లాస్ కలిగి ఉన్నవాడు.
ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: ఇఖ్లాస్ యొక్క మూలం ప్రజల చేతుల్లో నుండి(ఉదా: ధనం, డబ్బు మొ..) ఏదీ ఆశించకపోవడం.[5]

రిఫరెన్స్
1. గురరుల్ హికమ్, హదీస్5538; ముంతఖబె మీజానుల్ హిక్మహ్, పేజీ165, హదీస్1889.
2. మిస్బాహుష్షరీఅహ్, పేజీ16.
3. గురరుల్ హికమ్, హదీస్4642; ముంతఖబె మీజానుల్ హిక్మహ్, పేజీ165, హదీస్1890.
4. గురరుల్ హికమ్, హదీస్6793; ముంతఖబె మీజానుల్ హిక్మహ్, పేజీ165, హదీస్1891.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13