హజ్రత్ ఈసా[అ.స] ఖుర్ఆన్ దృష్టిలో

ఆది, 01/31/2021 - 15:15

హజ్రత్ ఈసా[అ.స] యొక్క ఏడు ప్రతిష్టతల గురించి ఖుర్ఆన్ వివరణ...

హజ్రత్ ఈసా[అ.స] ఖుర్ఆన్ దృష్టిలో

ఖుర్ఆన్ ఉపదేశాల మరియు జ్ఞానం గురించి కొంచెం అవగానవున్న వారికి, ఖుర్ఆన్ లో హజ్రత్ ఈసా[అ.స] గురించి ఏ విధంగా మరియు ఎంత పవిత్రంగా వివరించబడి ఉందో తెలుస్తుంది. వారిని వివరిస్తూ ఉపయోగించబడిన పదాలు, వాక్యాలలో ఉన్న పదగోషం వేరే మతాల మూల గ్రంథాలలో కనిపించవు.
ఇస్లాం ఆలోచనల ప్రకారం హజ్రత్ ఈసా[అ.స] పట్ల గొప్ప గొప్ప పరిశోధకులు, జ్ఞానులు మరియు పండితులు ప్రత్యేక దృష్టిని చూపించారు. అల్లామా ఫఖీహ్ మర్హూమ్ కాషిఫుల్ గితా వారు ఇలా అన్నారు.. ..ఒకవేళ ప్రత్యేకంగా హజ్రత్ ఈసా[అ.స] మరియు వారి పవిత్ర తల్లి హజ్రత్ మర్యమ్ ముఖద్దస్[అ.స] గురించి ఖుర్ఆన్ వర్ణించిన పద్దితి గనక మా వద్ద లేకపోయి ఉంటే, యావత్ ప్రపంచానికి వారి పవిత్ర తెలిసేదికాదు, ఎందుకంటే ఒకవేళ హజ్రత్ ఈసా[అ.స] గొప్పతం గురించి తెలుసుకోవడానికి బైబిళ్ల సప్రదించినట్లైతే వారిని వర్ణించిన విధానాన్ని చూసి ఖలం సిగ్గుపడి ఉండేది.[1]
గుర్తుండిపోయే విధంగా హజ్రత్ ఈసా[అ.స] వర్ణన ఖుర్ఆన్ మాటల్లో:
అల్లాహ్ సుబ్హానవు వ తఆలా సూరయె మర్యమ్ లో హజ్రత్ ఈసా[అ.స] యొక్క అద్భుతాలను మరియు వారి గొప్పతనాన్ని మానవ సమాజం ముందు వివరించెను. సూరయె మర్యమ్ యొక్క మొదటి ఆయతులలో అల్లాహ్ హజ్రత్ ఈసా[అ.స] గురించి వివరిస్తూ ఏడు ప్రతిష్టతను సూచించెను. ఈ అముల్యమైన మరియు అత్యుత్తమ లక్షణాలు ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి పరలోక భాగ్యాన్ని బహుమతిగ పొందుతాడు.
1. అల్లాహ్ దాసోహం:
ఈనాడు సమాజంలో హజ్రత్ ఈసా[అ.స] పట్ల కలిగివున్న నమ్మకం., వారిని భగవంతుడిగా భావించడం. ఈ ఆలోచన మరియు నమ్మకం సమాజంలో మనుషులను షిర్క్ కు గురిచేసింది. అల్లాహ్ సూరయె మర్యంలో ఉన్న 30వ ఆయత్ యొక్క ఈ చిన్న పదం “ఇన్నీ అబ్దుల్లాహ్” నేను అల్లాహ్ దాసుడను, ద్వార హజ్రత్ ఈసా[అ.స] భగవంతుడు అనే నమ్మకాన్ని అసత్యమని మరియు హజ్రత్ ఈసా[అ.స] అల్లాహ్ దాసుడని ప్రకటించాడు.
2. పరిపూర్ణత్వాన్ని చేర్చే ప్రణాళిక:
అల్లాహ్ తరపు నుండి హజ్రత్ ఈసా[అ.స]కు ప్రసాదించబడిన ప్రతిష్టతలో ఒకటి వారిని షరీఅత్ గలవారిగా నిర్ధారించబడం. అల్లాహ్ సూరయె మర్యంలో ఉన్న 30వ ఆయత్ లో ఇలా ప్రవచించెను: “ఆతానియల్ కితాబ్” అల్లాహ్ నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ఈ గ్రంథం సమాజాన్ని పరిపూర్ణ స్థాయికి చేర్చే ప్రణాళిక కలిగి ఉండేది కాని ఖేదించదగ్గ విషయమేమిటంటే ఈ ఆకాశ బహుమతిని కొంతమంది స్వార్ధపరులు మరియు మనోవాంఛకులు దీన్ని వక్రీకరణకు గురి చేశారు.
3. అల్లాహ్ ద్వార ఎన్నుకోబడ్డ ప్రవక్త:[2]
దైవదౌత్యం, గొప్ప స్థానం. ఎవరికి పడితేవారికి ఆ స్థానం దక్కదు. ఇలాంటి గొప్ప మరియు అమూల్యమైన స్థానాన్ని హజ్రత్ ఈసా[అ.స]కు ప్రసాదించిం ఉమ్మత్ యొక్క హిదాయత్(మార్గదర్శకం) యొక్క బాధ్యతను వారి భూజాలపై వేశాడు.
4. హజ్రత్ ఈసా[అ.స] యొక్క అస్థిత్వం అనుగ్రహాలకు కారణం:[3]
అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ మరియు హజ్రత్ ఈసా[అ.స] ద్వార ప్రచారించబడ్డ మతానికి కూడా సమాజాన్ని గమ్యానికి చేర్చే యోగ్యత ఉండేది మరియు హజ్రత్ ఈసా[అ.స] అస్థిత్వం ద్వార హిదాయత్ మరియు  మోక్షం యొక్క రుచిని చూడవచ్చు.
5. అల్లాహ్ ఆజ్ఞ పట్ల విధేయత కలిగి ఉండడం:
ప్రవక్త హజ్రత్ ఈసా ఇబ్నె మర్యమ్[అ.స] ఉల్లేఖనాన్ని ఇలా సూచించెను: “నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు”[4]
6. తల్లిదండ్రుల పట్ల అత్యుత్తమ గౌరవం కలిగి ఉండడం:
ప్రవక్త హజ్రత్ ఈసా ఇబ్నె మర్యమ్[అ.స] ఉల్లేఖనాన్ని ఇలా సూచించెను: “అల్లాహ్ నన్ను నా తల్లికి సేవచేసేవానిగా చేశాడు”[5]
7. దుర్మార్గం మరియు దౌర్జన్యం నుండి దూరం:
ప్రవక్త హజ్రత్ ఈసా ఇబ్నె మర్యమ్[అ.స] ఉల్లేఖనాన్ని ఇలా సూచించెను: “నేన్ను దౌర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యునిగానూ చేయలేదు”[6]

రిఫరెన్స్
1. పజోహిషీ దర్బారె మసీహ్ వ ఇంజీల్, ఆయతుల్లాహ్ షేఖ్ మొహమ్మద్ హుసైన్ కాషిఫుల్ గితా, పేజీ17
2. సూరయె మర్యమ్:30
3. సూరయె మర్యమ్:31
4. సూరయె మర్యమ్:31
5. సూరయె మర్యమ్:32
6. సూరయె మర్యమ్:32             

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7