అల్లాహ్ పట్ల విధేయతకు

సోమ, 02/01/2021 - 08:18

అల్లాహ్ పట్ల విధేయతకు ఆటంకం కలిపించే అంశాలు ఖుర్ఆన్ మరియు హదీస్ దృష్టిలో... 

అల్లాహ్ పట్ల విధేయతకు ఆటంకం

చలికాలంలో అతడ్ని చూశాను, పూర్తిగా దుస్తులు ధరించిలేడు, “ఎందుకు సరిపడ దుస్తులు ధరించిలేవు?” అని అడిగాను. “బట్టలు లేవు” అని సమాధానమిచ్చాడు. “ఎందుకని ఎవరి వద్ద అడిగవు?” అని అన్నాను. అతడు “నాకు నా యజమాని తప్ప మరొకడితో అడిగే హక్కు లేదు” అని సమాధానం ఇచ్చాడు. “అయితే నీ యజమాని ఎందుకని అడగవు?” అని అన్నాను. “నా యజమాని నన్ను ఈ పరిస్థితిలో చూస్తున్నాడు, ఇవ్వాలనుకుంటే ఇచ్చేవాడు” అన్నాడు. నేను తెలుసుకున్నాను నిజమైన యజమాని(అల్లాహ్) ముందు దాసోహం యొక్క పద్ధతి ఈ దాసుడి పద్ధతి అని.[1]
అల్లాహ్ పట్ల విధేయతకు ఆటంకం కలిపించే అంశాలు:

1. కడుపు నిండుగా భుజించడం:
అతిగా తినడం వల్ల మనిషి అనారోగ్యానికి గురి అవ్వడమే కాకుండా వారి ఆత్మకు సంబంధించిన రోగాలకు గురి అవుతాడు.
దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించెను: “తినడంలో అతిని మానుకోండి దాంతో హృదయం క్రూరంగా మారుతుంది, అల్లాహ్ ఆజ్ఞలను అమలు పరిచే విషయంలో అశ్రద్ధత వస్తుంది మరియు సద్గుణాలు వినకుండా చెవులను చెవిటివిగా మారుస్తుంది”[2]

2. అహంకారం మరియు అహంభావం:
అల్లాహ్ తన దూతలకు హజ్రత్ ఆదమ్[అ.స] ముందు సజ్దా(సాష్ఠాంగం) చేయమని ఆదేశించినపుడు వారందరూ ఆ ఆజ్ఞను అమలు పరిచారు అహంకారం మరియు అహంభావానికి గురి అయిన ఒక్క ఇబ్లీస్ తప్ప, అతడు హజ్రత్ ఆదమ్[అ.స] పై తన సృష్టి పరంగా గర్వించి, పక్షపాతానికి గురి అయ్యాడు, అందుకే అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉన్నవారి నుండి బయటకు గెంటేయబడ్డాడు, అవిశ్వాసి అయ్యాడు.
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు.[బఖరహ్:34]

3. అన్యాయంగా అధికార కాంక్ష:
కొందరు ఎలాగైనా సరే అధికారం తన చేతికి రావాలి అని అనుకుంటారు, అది అన్యాయం మరియు దుర్మర్గపు మార్గం అయినా సరే. ఆ అధికారం కోసం ఇతరుల పై దౌర్జన్యం చేస్తాడు. ఎవరైతే అన్యాయం చేస్తాడో అతడు అల్లాహ్ పట్ల విధేయతగా ఉండలేడు. 
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ఉల్లేఖించారు: “ఎవరైతే అధికారాన్ని అన్యాయంగా చేజిక్కించుకోవాలనుకుంటాడో అతడు అల్లాహ్ పట్ల విధేయతను కోల్పోతాడు”[4]   

రిఫరెన్స్
1. బందగీ రాజె ఆఫరీనిష్, భాగం1, పేజీ122
2. ایَّاكُمْ وَ فُضُولَ الْمَطْعَمِ فَانَّهُ یَسِمُ الْقَلْبَ بِالْقَسْوَةِ وَ یُبْطِى‏ءُ بِالْجَوارِحِ عَنِ‏الطَّاعَةِ وَ یَصُمُّ الْهِمَمَ عَنْ سِماعِ الْمَوعِظَةِ (బిహారుల్ అన్వార్, భాగం69, పేజీ199)
3. وَ إِذْ قُلْنا لِلْمَلائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلاَّ إِبْلیسَ أَبى‏ وَ اسْتَكْبَرَ وَ كانَ مِنَ الْكافِرینَ (బఖరహ్..34)
4. مَنْ طَلَبَ الرِّئاسَةَ بِغَیْرِ حَقٍّ حُرِمَ الطَّاعَةُ لَهُ بِحَقٍّ (బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ235)

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11