ఆత్మ దశలు

సోమ, 02/01/2021 - 09:56

నైతిక శాస్త్రవేత్తలు, ఆత్మ(నఫ్స్) కు మూడు దశలు ఉంటాయి అనీ, దీనిని వివరిస్తూ ఆయతులు కూడా ఉన్నాయి అని భావిస్తారు...

ఆత్మ దశలు

నైతిక శాస్త్రవేత్తలు, ఆత్మ(నఫ్స్) కు మూడు దశలు ఉంటాయి అనీ, దీనిని వివరిస్తూ ఆయతులు కూడా ఉన్నాయి అని భావిస్తారు.

1. నఫ్సె అమ్మారహ్(చెడు ఆత్మ):
ఈ దశలో ఆత్మ మనిషికి చెడు చేయమని ఆజ్ఞాపిస్తుంది, ఏది చేయడానికి కూడా వెనకాడదు. ఈ దశలో ఈ చెడు ఆత్మ(నఫ్సె అమ్మారహ్) ను కంట్రోల్ లో పెట్టుకోవడానికి బుద్ధి మరియు విశ్వాసంలో అంత శక్తి ఉండదు. చాలా సందర్భాలలో మనిషి ఇలాంటి ఆత్మకు లోంగిపోతాడు.
ఖుర్ఆన్ ఇలాంటి ఆత్మ గురించి ఇలా వివరించెను: “నిశ్చయంగా మనసైతే చెడు వైపుకే పురికొల్పుతుంది. అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు”[యూసుఫ్:53]
ఈ ఆయత్ ఆత్మ యొక్క చెడు కార్యములన్నీంటిని సూచిస్తుంది. అందుకనే ఇమామ్ అలీ(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఆత్మ నిరంతరం ఆజ్ఞలను నిరాకరిస్తూ మరియు పాపాములకు పాల్పడుతూ ఉంటుంది”[2]

2. నఫ్సె లవ్వామహ్(తనను తాను నిందించుకునే ఆత్మ):
ఈ దశ మనిషి యొక్క జ్ఞానం, శిక్షణ మరియు ప్రయత్నంతో అతడికి దక్కుతుంది. ఈ దశలో మనిషి అప్పుడప్పుడు మనోవాంఛలకు గురి అయి తప్పులు చేసే అవకాశం ఉంటుంది, వెంటనే పశ్చాత్తాపం కూడా చెందుతాడు, తిరిగి ఆ తప్పును చేయను అని నిర్ణయించుకొని తౌబహ్ చేస్తాడు.
ఖుర్ఆన్ ఇలాంటి ఆత్మల గురించి ఇలా వివరించెను: “నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను. ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను”[ఖియామత్:1-2]

3. నఫ్సె ముత్మయిన్(ప్రశాంత ఆత్మ):
ఈ దశలో మనిషి ఉన్న స్థానం మరియు స్థాయి ముందు మనోవాంఛలు లోంగిపోతాయి, ఎందుకంటే అతడి బుద్ధీ మరియు విశ్వాసం యొక్క శక్తి ముందు మనోవాంఛల శక్తి అల్పమౌతుంది, వాటికి ఇలాంటి ఆత్మ ముందు నిలబడే శక్తి కూడా ఉండదు. ఈ దశలో మనిషి మనశాంతిగా మరియ సకీనా(ఖుర్ఆన్ వివరించిన విధంగా) స్థితికి చేరుకొని ఉంటాడు. ఈ దశ దైవప్రవక్తల, వారి ఉత్తరాధికారుల మరియు వారి నిజమైన అనుచరుల స్థితి.
ఖుర్ఆన్ ఈ దశ గురించి ఇలా వివరించెను: “ఓ ప్రశాంత ఆత్మా! నీ ప్రభువు వైపు పద! నువ్వు ఆయన పట్ల సంతోషించావు. ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి (సత్కరించబడిన) నా దాసులలో చేరిపో. నా స్వర్గంలో చేరిపో” (అని విధేయులతో అనబడుతుంది).[4]  

రిఫరెన్స్
1. وَ ما أُبَرِّئُ نَفْسِي إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ إِلاَّ ما رَحِمَ رَبِّي إِنَّ رَبِّي غَفُورٌ رَحِيم (యూసుఫ్:53)
2. و انها لا تزال تنزع الي معصية في هويً (నెహ్జుల్ బలాగహ్, ఉపన్యాసం176)
3. لا أُقْسِمُ بِيَوْمِ الْقِيامَةِ . وَ لا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَة (ఖియామత్:1,2)
4. يا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ ، ارْجِعِي إِلي رَبِّكِ راضِيَةً مَرْضِيَّةً ، فَادْخُلِي فِي عِبادِي ، وَ ادْخُلِي جَنَّتِي (ఫజ్ర్:27, 28)

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21