నఫ్సె అమ్మారహ్ యొక్క ప్రత్యేకతలు

మంగళ, 02/02/2021 - 17:12

నఫ్సె అమ్మారహ్ యొక్క ప్రత్యేకతలు ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం...

నఫ్సె అమ్మారహ్ యొక్క ప్రత్యేకతలు

నఫ్సె అమ్మారహ్ యొక్క ప్రత్యేకతలు

నఫ్సె అమ్మారహ్ గురించి ఇంతకు ముందు వివరించబడింది. నఫ్సె అమ్మారహ్ అంటే చెడు ఆత్మ అని మరియు అది మనిషిని పాపాలకు గురి చేస్తుంది అని. ఖుర్ఆన్ లో దీని గురించి సూచించబడి ఉంది అని. ఇప్పుడు ఆ నఫ్సె అమ్మారహ్ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందా

1. మనోవాంఛల పట్ల విధేయత:
నఫ్సె అమ్మారహ్(చెడు ఆత్మ) యొక్క మొదటి ప్రత్యేకత అది మనోవాంఛల పట్ల విధేయత కలిగివుంటుంది అంటే అల్లాహ్ ఆజ్ఞానలను పాటించదు, దానిని వ్యతిరేకిస్తుంది. షైతాన్ తప్పుడు పనులను మరియు చెడు చర్యలను అతడి కోసం అలంకరించీ మరియు అతడి హృదయాన్ని మంచి చెడులను గుర్తించనట్లుగా మారుస్తాడు. ఇలాంటి వారు నిరంతరం అజ్ఞానులుగా ఆలోచిస్తూ ఉంటారు.
అల్లాహ్ వీరి గురించి ఇలా సూచించెను: “..... వీళ్లు కేవలం అంచనాలను, తమ మనో వాంఛలను అనుసరిస్తున్నారు. మరి చూడబోతే వారి ప్రభువు తరపున వారి వద్దకు ఖచ్చితంగా మార్గదర్శకత్వం వచ్చి ఉన్నది”[1]
ఒక్కోసారి నఫ్సె అమ్మారహ్ ను అనుసరించే హద్దు ఎంతెలా మితిమీరుతుందంటే ఏమాత్రం బుద్ధి ఉపయోగించబడదు. ఆజ్ఞలన్ని కేవలం మనోవాంఛలకు మరియు నఫ్సె అమ్మారహ్ కు పరిమితమై ఉంటాయి. అందుకే హజ్రత్ అలీ[అ.స] ఇలా ఉపదేశించారు: “చాలా (మంది) బుద్ది మరియు వివేకాల పై మనోవాంఛల అధికారం ఉంటుంది”[2]
ఒక్కోసారి నఫ్సె అమ్మారహ్ పట్ల మనిషి యొక్క అనుచరణం దీనికి మించిపోతుంది, అలాంటి సమయంలో మనోవాంఛలు అతడి భగవంతుడిగా మారుతాయి. ఖుర్ఆన్ సూచన: “తన మనోవాంఛను ఆరాధ్యదైవంగా చేసుకున్న వాడ్ని నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ – అల్లాహ్ అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకూ, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్లపై కూడా తెరను వేసేశాడు”[3]

2. దుర్మార్గం మరియు శత్రుత్వం:
హజ్రత్ ఆదమ్[అ.స] కుమారులు ఖాబీల్ చేత చంపబడిన హాబీల్ సంఘటన దీనికి నిదర్శనం, ఈ సంఘటనను అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా వివరించెను: “తర్వాత అని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది”[4]

3. చెడు ఆత్మ ఉపమానం కుక్క మాదిరి:
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా వివరించెను: “....కాని అతనేమో ప్రపంచం వైపుకే మ్రొగ్గాడు. తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారయింది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని దాని మానాన వదిలి పెట్టినా (నాలుక తీసి) రొప్పుతూనే ఉంటుంది”[5]

రిఫరెన్స్
1. సూరయె నజ్మ్:23
2. నెహ్జుల్ బలాగహ్, కలెమాతె ఖిసార్, 211
3. సూరయె జాసియహ్:23
4. సూరయె మాయిదహ్:30
5. సూరయె అఅరాఫ్:176
 
 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13