సత్యం మరియు దాని ఫలితాలు

మంగళ, 02/02/2021 - 18:52

సత్యం మరియు నిజం పలకడం యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఇహపరలోక ప్రభావాలు...

సత్యం మరియు దాని ఫలితాలు

సత్యం మరియు నిజం పలకడం మొదటి నుండే మానవ స్వభావంలో ఉంటుంది. ఇది మనిషి యొక్క అతి ముఖ్యమైన మరియు గొప్ప నైతికం, దీనిని మానవులందూర ఇష్టపడతారు, నిజాన్ని ఇష్టపడనివారుండరు. సత్యవంతుల హృదయం మరియు నాలుక రెండూ సమన్వయం కలిగు ఉంటాయి. నమ్మిన దానినే నోటి నుండి పలుకుతాడు.
నిజం; ఇహపరలోకాల భాగ్యానికి మరియు పరిపూర్ణతకు కారణం.
నిజం, ఇస్లాం పరంగా మనిషి యొక్క ఉత్తమ లక్షణం. దాని స్థానం కూడా ఇస్లాం దృష్టిలో చాలా గొప్ప స్థానం. హజ్రత్ అలీ[అ.స] సత్యాన్ని విశ్వాసం యొక్క బలమైన మూలంగా సూచించారు: “సత్యం, విశ్వాసం(ఈమాన్) యొక్క బలమైన మూలం”[1]
సత్యం ఇహపరలోకాలలో మనిషి భాగ్యానికి కారణం. హజ్రత్ అలీ ఇలా వివరించారు: “ఈ నాలుగు విషయాలు ఎవరికైనా ప్రసాదించబడ్డాయి అంటే ఇహపరలోకాల మంచి వారికి ప్రసాదించబడినట్లే; సత్యం, నమ్మకస్తంగా ఉండడం, న్యాయసమ్మతమైన ఉపాది(హలాల్ విధంగా సంపాదించి తినడం) మరియు మంచి ప్రవర్తన”[2]
నిజం పలకడం ద్వార మనిషి స్వర్గానికి చేరుతాడు అని దైవప్రవక్త(స.అ) ఈ హదీస్ ద్వార తెలుస్తుంది: “సత్యమే పలకండి; అది స్వర్గం యొక్క ద్వారల నుండి”[3]
సత్యం అన్ని విధాలుగా మంచిది, అది మనిషిని పరిపూర్ణతకు చేరేందుకు సహాయం చేస్తుంది.

మాటలో సత్యం:
ఇది సత్యం యొక్క మొదటి స్థానం, అంటే మనిషి ఎల్లప్పుడూ నిజం చేప్పడానికి ప్రయత్నించాలి, యదార్థానికి వ్యతిరేకంగా నోరు విప్పకూడదు. సత్యం మనలోని వ్యక్తిత్వాన్ని వ్యక్తిం చేస్తుంది. సత్యవంతుడు తన సత్యం ద్వార అందరికి అతడిలోని మంచి మరియు అద్ధం లాంటి లక్షణాన్ని ప్రకటిస్తున్నట్లు. మొల్ల మొల్లగా ప్రజలు అతడు చెప్పేవాటిని నమ్ముతారు, అలా యదార్థాన్ని తెలుసుకోవడానికి అతడిని ఆశ్రయిస్తారు. ప్రజలు అతడు చెప్పిన మాటలను నమ్ముతారు, అతడిని ఇష్టపడతారు, కష్టాలు వస్తే అతడికి సహాయపడతారు, ఇలా అతడిని ఒంటరిగా విడిచిపెట్టరు; దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: “సత్యం మరియు నిజం యొక్క ప్రతిఫలం విముక్తి మరియు ఆరోగ్యం”[4]

అమలులో సత్యం:
ఇది సత్యం యొక్క రెండవ స్థానం, అంటే మనిషి చేసే పనిలో చెప్పిన మాటకు అనుకూలత ఉండాలి. ఒక్కోసారి మనిషి చెప్పే మాటలు యదార్థానికి అనుకూలంగా ఉంటాయి కాని అతడి చర్య మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటుంది; అనగా అతడు చేసిన పని తాను తన నోటితో చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటుంది. ఖుర్ఆన్ ఇలాంటి వారి కోసం ఇలా సూచిస్తుంది: “ఓ విశ్వాసులారా! మీరు చెయ(లే)ని దాన్ని గురించి ఎందుకు చెబుతారు? మీరు చేయని దాన్ని గురించి చెప్పటం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది”[సఫ్:2,3]
నిజమైన సత్యవంతుల చర్యలు వారి మాటలకు అనుకూలంగా ఉంటాయి.

నియ్యత్(ఆలోచన)లో సత్యం:
ఇది సత్యం యొక్క మూడవ స్థానం. సత్యం అమలులో ఉన్న నియ్యత్(ఆలోచన)ను బట్టి ఉంటుంది. ఒక చర్య యొక్క మూలం దాని నియ్యత్ పై ఆధారపడి ఉంటుంది. ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: “చర్యలు, నియ్యత్ యొక్క ఫలాలు”[6] మనిషి చేసే పని యొక్క విలువ అతడి నియ్యత్ పై ఉంటుంది. హజ్రత్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: “మనిషి యొక్క విలువ అతడి ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది మరియు అతడి అమలు అతడి నియ్యత్ ని బట్టి ఉంటుంది”[7]
ఈ విధంగా చూసుకున్నట్లైతే ప్రతీ మంచి పని అది ప్రార్ధనలు కానివ్వండి లేదా సమాజ సేవ కానివ్వండి నియ్యత్తు మంచిదైతేనే దానికి విలువ ఉంటుంది, నియ్యత్తు మంచిది కాకపోతే అది విలువ లేనిది అని తెలుస్తుంది. అదే ఒక చిన్న పని మంచి నియ్యత్ తో చేస్తే అది చాలా కాలం వరకు నిలిచిపోతుంది.
మనం మన జీవితంలో ఈ మూడు విషయాలను పాటిస్తే ఇహపరలోక భాగ్యం మనకు సొంతం అవుతుంది.    

రిఫరెన్స్
1. గురరుల్ హికమ్, భాగం1, పేజీ84
2. ఉయూనుల్ హికమ్, భాగం1, పేజీ74
3. నెహ్జుల్ ఫసాహత్, హదీస్419
4. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ10
5. సూరయె సఫ్:2,3
6. గురరుల్ హికమ్, భాగం1, పేజీ51
7. గురరుల్ హికమ్, భాగం1, పేజీ122

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11