అత్యుత్తమ నాలుగు చర్యలను వివరిస్తున్న హజ్రత్ మొహమ్మద్ బాఖిర్(అ.స) హదీస్ మరియు దాని వివరణ...
విజ్ఞానం మరియు ధనం మధ్య దేని ప్రాముఖ్యత ఎక్కువ అని చూసుకుంటే విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతయే ఎక్కువ అని తెలుస్తుంది. కాని ఈ రెండింటి కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినవి కూడా ఉన్నాయి అని? హజ్రత్ ఇమామ్ బాఖిర్[అ.స] ఒక రివాయత్ లో విజ్ఞానం మరియు ధనానికి మించిన నాలుగు విషయాలను వివరించారు, వాటిని వివరంగా తెలుసుకుందాం.
హజ్రత్ ఇమామ్ బాఖిర్[అ.స]: ప్రజల ముందూ మరియు వారు లేనప్పుడూ అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండటం, డబ్బు ఉన్నా మరియు డబ్బు లేకున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మధ్య తీరును ఎన్నుకోవాలి, ఆనందంగా ఉన్నా మరియు ఆగ్రహంగా ఉన్నా సరే సత్యం పలకడం, అల్లాహ్ సన్నిధిలో రోధించడం.[1]
1. అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండడం:
అన్ని పరిస్థితులలో అల్లాహ్ పట్ల భయబీతులు కలిగి ఉండడం. ప్రజలు ఉన్నా లేక పోయిన మన భయం అల్లాహ్ పట్ల ఒకే రకంగా ఉండాలి. మనుషుల ముందు అల్లాహ్ కు భయపడినట్లూ మరియు వారు లేనప్పుడు ఆ అల్లాహ్ ఎవరో తెలియనట్లూ ఉండకూడదు.
ఇక్కడ అరబీ యొక్క రెండు పదాలు “ఖౌఫ్” మరియు “ఖషియత్” ను వివరించడం అవసరం; ఖౌఫ్ అనగా మన పనులకు సంబంధించినది కాని ఖషియత్ మన హృదయానికి సంబంధించినది. అందుకే ఖౌఫ్ అనే పదం ప్రవక్తల[అ.స] కోసం ఉపయోగించవచ్చు కాని ఖషియత్ అనే పదం కేవలం అల్లాహ్ కు తప్ప మరొకరి కోసం ఉపయోగించకూడదు.[2]
ఈ ఖషియత్ ఎలా ధనవిజ్ఞానాల పై ప్రాముఖ్యత పొందుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం అహ్లెబైత్[అ.స] యొక్క దుఆలను చూడాలి. ఉదాహారణకు “ఓ అల్లాహ్ మా మరియు పాపాలకు అడ్డుగా నిలిచేటువంటి విధంగా నీ ఖషియత్(భయాన్ని, భీతిని)ను మాకు ప్రసాదించు”[3]
నిస్సందేహంగా విజ్ఞానం కన్నా దాని పై అమలు చేయడం మేలైనది. అల్లాహ్ గురించి తెలుసుకోవడం మేలుగా నిలుస్తుంది అదే పాపములకు దూరం చేస్తుంది మరియు విముక్తి కారణం అవుతుంది.
2. డబ్బు ఉన్నా లేకపోయినా మధ్య తీరును ఎన్నుకోవడం:
ఈ లోకంలో ఎవరికి ఎంత ఉన్నా అది కేవలం అల్లాహ్ తరపు నుండి పరీక్షకు మాత్రమే, అంటే ఈ ధనం మనిషి మనసును మరియు అతడి ఆలోచనలో మార్పకుండా చూసుకోవాలి. అతివృష్టి మరియు అనావృష్టికి గురి కాకుండా ఉండాలి. ఈ లోకం నుండి మనకు సరిపడినంతే తీసుకోవాలి. ఖుర్ఆన్ ఉపదేశం: “అల్లాహ్ యే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వొసగి ఉన్నాడు. ఆధిక్యత వొసగబడినవారు తమ ఉపాధిని తమ క్రిందనున్న బానిసలకు తామూ-వారూ సమానులయ్యేలా ఇవ్వరు. మరి వీరు అల్లాహ్ అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా?”[4]
3. ఆనందంగా ఉన్నా మరియు ఆగ్రహంగా ఉన్నా సరే సత్యం పలకడం:
ఖుర్ఆన్ ఈ క్రమంలో ఇలా వివరించెను: “ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు సత్యంపై నిలకడగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయవిరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చెయ్యండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మీరు చేసే పనులన్నీ అల్లాహ్ కు తెలుస్తూనే ఉంటాయి”[5]
ఈ విధంగా శత్రువుల పట్ల కూడా న్యాయంగా ఉండాలని ఇస్లాం ఉపదేశిస్తుంది. సంతోషం, దుఖ్ఖం, బాధ, ఆగ్రహాలు విశ్వాసిని రుజుమార్గం మరియు సత్యం నుండి దూరం చేయకూడదు. దైవప్రవక్త[స.అ] తన నిజమైన ఉత్తరాధికారి అయిన అమీరుల్ మొమినీన్ హజ్రత్ అలీ[అ.స] గురించి ఇలా ఉల్లేఖించారు: “అలీ సత్యంతో పాటు ఉన్నారు మరియు సత్యం అలీతో పాటు ఉంది”[6]
4. అల్లాహ్ సన్నిధిలో రోధన:
అల్లాహ్ సన్నిధిలో రోధించటం, వినయంగా ఉండడం... ఇవి దుఆ స్వీకరించబడడానికి కారణమౌతాయి. మనిషి శిక్షణకు మార్గాలు చూపించబడతాయి. దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే అల్లాహ్ తన దాసులకు ఈ స్థితిలో చూడడానికి కష్టాలకు గురి చేస్తాడు. ఖుర్ఆన్ ఇలా వివరిస్తుంది: “నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాలవారు అణకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళను దారిద్ర్యానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము”[7]
రిఫరెన్స్
1. అల్ ఖిసాల్, షైఖ్ సదూఖ్, జామిఅ అల్ ముదర్రిసీన్, మొఅస్ససయె అన్నష్ర్ అల్ ఇస్లాం, ఖుమ్, 1416, భాగం1, పేజీ241, హదీస్91
2. తఫ్సీరె అల్ మీజాన్, తబాతబాయి, జామిఅ అల్ ముదర్రిసీన్, (తర్జుమా)మొఅస్ససయె అన్నష్ర్ అల్ ఇస్లాం, ఖుమ్, 1378, భాగం16, పేజీ485
3. తహ్జీబ్, షేఖ్ తూసీ, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, తహ్రాన్, 1365, భాగం3, పేజీ92, హదీస్252
4. సూరయె నహ్ల్, ఆయత్:71
5. సూరయె మాయిదహ్, ఆయత్:8
6. కిఫాయతుల్ అసర్, రాజీ, బీదార్, ఖుమ్, 1401, పేజీ20
7. సూరయె అన్ఆమ్, ఆయత్:42
వ్యాఖ్యలు
Mashaallah bohut qhoob.
వ్యాఖ్యానించండి