అల్లాహ్ యువకులను ఇష్టపడతాడు

శుక్ర, 02/05/2021 - 06:22

అల్లాహ్ యువకులను మరియు యవ్వనంలో వారు చేసే మంచి పనులను ఇష్టపడతాడు...

అల్లాహ్ యువకులను ఇష్టపడతాడు

మనిషి యొక్క జీవితంలో యవ్వనం చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే మనిషి యవ్వనంలో శారీరకంగా మరియు ఆత్మ పరంగా సిద్ధంగా ఉంటాడు అలా దాసోహం మరియు అల్లాహ్ అంగీకారానికి చాలా త్వరగా చేరుకోగలడు; అందుకనే దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ తరపు నుంచి ఒక దూత ప్రతీ రాత్రి నింగి నుండి దిగి వచ్చి ఓ ఇరవై సంవత్సరాల వయసుగలవారా! ప్రయత్నించు”[1]
యువకులు అల్లాహ్ వద్ద కలిగి ఉన్న ప్రత్యేక స్థానాన్ని వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీసులు:

నా యవ్వనం అల్లాహ్ పై ఫిదా:
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఆయన మార్గంలో ఖర్చు చేయాల్నిన వాటి గురించి ఇలా వివరించెను: “ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తిచేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి-మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్లు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కరలేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి”[2]
అందుకనే అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలు అర్పించినవారి స్థానం అల్లాహ్ వద్ద చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వారు తమ అతి ఇష్టమైన దానిని అనగ ప్రాణాలను అల్లాహ్ మార్గంలో ఫిదా చేశారు. అదే ఒకవేళ మనిషి తన యవ్వనంలో ప్రాణాలను అర్పిస్తే అతడి త్యాగం ఇంకా విలువైనది. ఈ విధంగా యువకుడు తన యవ్వనాన్ని అల్లాహ్ పట్ల విధేయతకు ప్రత్యేకిస్తే అతడు అల్లాహ్ కు ప్రియమైనవాడు అవుతాడు. దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: “ఒక యువకుడు తన యవ్వనాన్ని అల్లాహ్ మార్గానికి అంకితం చేస్తే, అల్లాహ్ అతడిని ఇష్టపడతాడు”[3]

నా అందం అల్లాహ్ సొంతం:
అల్లాహ్ ఇష్టానికి కారణమయ్యే మరో అంశం అందం; అందంగా ఉండి కూడా ఆ అందం యొక్క వలలో పడకుండా అల్లాహ్ పట్ల విధేయతను చాటుకునే యువకుడ. దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “సృష్టితాలలో అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన వారు; తన యవ్వనాన్ని మరియు సౌందర్యాన్ని అల్లాహ్ కొరకు మరియు ఆయన పట్ల విధేయత కొరకు నిర్ధారించే యువకుడు. ఇలాంటి యువకుడిని చూసి అల్లాహ్ దూతల ముందు గర్విస్తాడు మరియు వారితో ఇలా చెబుతాడు: నిస్సందేహంగా ఈ యువకుడు నా దాసుడు”[4]

వివేకవంతుడైన యువకుడు:
తన బుద్ధి వివేకాలను ఉపయోగించి తన భావోద్వాగాలను తన బుద్ధికి అనుకువగా చేసుకున్న యువకుడు అల్లాహ్ దృష్టిని తన వైపు మలుచుకొగలడు, ఆయన కారుణ్యానికి నోచుకోగలడు. దీని కోసం యువకులు పెద్దల ఫలితాన్ని పొందిన అనుభవాలను మరియు వారి సలహాల సహాయంతో మరలా అదే సమస్యలు రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ అమలు చేసుకుంటే త్వరగా అల్లాహ్ సామిప్యాన్ని పొందవచ్చు. దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “మీలో మంచి యువకులు; వారి ప్రవర్తతన మరియు నడవడిక వృద్ధుల వలే ఆచితూచి నడిచేవారు. అతి చెడ్డ వృద్ధులు; యువకుల వలే ప్రవర్తించువారు, నడుచుకునేవారు”[5]

యువకుడి తౌబహ్(పశ్చాత్తాపం):
మరో ప్రాముఖ్యత; యవ్వనంలో తౌబహ్ చేయడం. తౌబహ్ ప్రభావాలు చాలా ఎక్కువ దాంతో మనిషి పుట్టినపుడు ఎలా పవిత్రంగా ఉంటాడో అలా మారిపోతాడు; ఇక్కడ గుర్తుంచుకోవల్సిందేమిటంటే మరలా ఆ పాపాం తిరిగి చేయకూడదు. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నిస్సందేహంగా అల్లాహ్, తౌబహ్ చేసే యువకుడిని ఇష్టపడతాడు”[6]

రిఫరెన్స్
1. ఇర్షాదుల్ ఖులూబ్, దైలమీ, నాషిర్ అల్ షరీఫ్ అల్ రజీ, ఖుమ్1412ఖ, భాగం1, పేజీ22
2. సూరయె బఖరహ్:267
3. కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖీయె హింది, భాగం15, పేజీ776, హదీస్43060
4. కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖీయె హింది, భాగం15, పేజీ785, హదీస్43103
5. మకారిముల్ అఖ్లాఖ్, తబర్సీ, ఖుమ్, చాప్4, 1412ఖ/1370ష, పేజీ118
6. కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖీయె హింది, భాగం4, పేజీ209, హదీస్10185

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12