ఆగ్రహాన్ని జయించడం ఎలా?

సోమ, 02/08/2021 - 16:28

ఆగ్రహాన్ని జయించడం ఎలా అన్న విషయంపై ఖుర్ఆన్ మరియు హదీస్ సమాధానం...

ఆగ్రహాన్ని జయించడం ఎలా?

ప్రశ్న: ఇప్పటి వరకు తన జీవితంలో నిరంతరం ఆగ్రహానికి గురి అయ్యే వ్యక్తి కోసం వైద్యుల చేత ఎన్నో మార్గాలు వివరించబడ్డాయి కాని ఖుర్ఆన్ మరియు హదీస్ లో కూడా ఆగ్రహం యొక్క మంటను ఆర్పివేయడానికి మార్గాలు వివరించబడి ఉన్నాయా?

సమాధానం: ఖుర్ఆన్ ఆయతులలో మరియు రివాయతులలో ఆగ్రహాన్ని జయించడం పై ఎన్నో విషయాలు వివరించబడి ఉన్నాయి. ఇక్కడ సంక్షిప్తంగా వాటిని సూచిస్తున్నాము:

1. ఎదుటి వారి తప్పులను చూసీచూడనట్లు ఉండడం: దీని గురించి ఖుర్ఆన్ ఈ విధంగా ఉపదేశిస్తుంది: “(మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే) వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు”[షూరా:37]

2. ధర్మనిష్ఠ: అల్లాహ్ ధర్మనిష్టగలవారిని వారు ఆగ్రహాన్ని జయించే శక్తి గలవారు అని పరిచయించెను. ఆగ్రహాన్ని లోబరుచుకోవడానికి అతి ముఖ్య కారణం ధర్మనిష్టయే., ఖుర్ఆన్ ఇలా వివరించెను: “మీ ప్రభువు యొక్క క్షమాబిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది. వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”[ఆలి ఇమ్రాన్:134]

3. దైవప్రవక్త(స.అ) ప్రిస్క్రిప్షన్: దైవప్రవక్త[స.అ] ఎవరైతే తన ఆగ్రహం పై జయిస్తారో వారిని శక్తివంతులైనవారిగా నిర్ధారించారు.[నస్రుద్దురర్, భాగం1, పేజీ183] ఆగ్రహాన్ని జయించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి; వాటి నుండి: 

A) ఎండుద్రాక్ష తినడం: “ఎండుద్రాక్ష, బహు మంచి తినుపదార్ధం! పాదాలను బలపరుస్తుంది, రోగాలను నాశనం చేస్తుంది, ఆగ్రహాన్ని తగ్గిస్తుంది”[దానిష్ నామయె అహాదీసె పిజిష్కీ, 1/382]

B) కోపంగా ఉన్నప్పుడు కూర్చుండిపోవడం: ఆగ్రహానికి గురి కావద్దు, ఒకవేళ ఆగ్రహానికి గురి అయితే కూర్చుండిపో మరి తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క శక్తి మరియు బలం గురించి అలాగే ఆయన క్షమాబిక్ష గురించి ఆలోచించు[తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ14]  

రిఫరెన్స్
https://btid.org/fa/news/6537

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8