ఇమామ్ అలీ రిజా[అ.స] జీవితం నుండి ఐదు ఉత్తమ పాఠాలు...

దైవప్రవక్త[స.అ] యొక్క 8వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ రిజా[అ.స] గురించి షియా వర్గానికి చెందిన ఉలమాలే కాకుండా అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ప్రముఖులు కూడా వారిని ప్రశంసించారు, ఉదాహారణకు సంహూదీ వారి గురించి ఇలా అన్నారు: “మూసా కాజిమ్ యొక్క కుమారులు అయిన అలీ ఇబ్నె ముసా అల్ రిజా[అ.స] వారి కాలంలో వారు చాలా మంచి వ్యక్తి మరియు అత్యుత్తమ మనిషి”[1].
అలాగే షేఖ్ అబ్దుల్లాహ్ షబ్రావీ షాఫెయీ వారి గురించి ఇలా అన్నారు: “అలీ ఇబ్నె మూసా అల్ రిజా చాలా ప్రతిష్టతలు మరియు గొప్ప లక్షణాలు గలవారు, ..... లెక్కలేనివన్ని అద్బుతాలు గలవారు”[2] నిజానికి వారి జీవిత చరిత్ర మరియు వారి ఉపదేశాలు అమూల్యమైన గని, వారి అనుచరణ మనిషి జీవిత లక్ష్యాన్ని పొందడానికి జామీను.
ఇమామ్ అలీ రిజా[అ.స] జీవితం నుండి ఐదు విషయాలు:
ఇబ్రాహీమ్ ఇబ్నె అబ్బాస్ యొక్క రివాయత్ అనుసారం హజ్రత్ అలీ రిజా[అ.స] వారి ఐదు లక్షణాలను చాలా సంక్షిప్తంగా వివరిస్తున్నాము:
1. న్యాయధర్మాలను పాటించడం
ఇమామ్ అలీ రిజా[అ.స] ప్రజల పట్ల న్యాయపరంగా మరియు ఉత్తమ నడవడికతో ఉండేవారు. మాట ద్వార కూడా ఇతరులను కష్టపెట్టేవారు కాదు. రివాయత్: “ఎప్పుడూ నేను అబల్ హసన్ అల్ రిజా ను తన మాటతో ఇతరులకు అన్యాయం తలబెట్టినట్లు చూడలేదు (అపహాసించలేదు, హేళన చేయలేదు)”[3] అంతకు మించి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి మాటను మధ్యలోనే ఆపివేయలేదు ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది కూడా ఎదుటివారిని ఒకరకంగా అగౌరవించినట్లే కాబట్టి.[4]
2. పేదవారికి సహాయం చేయడం:
పేదవారికి ఇమామ్ యొక్క సహాయం గురించి ఇబ్రాహీమ్ ఇబ్నె అబ్బాస్ ఇలా ఉల్లేఖించారు: “పేదవారి యొక్క అవసరాలను తీర్చేవారు, వారి విన్నపాలను రద్దు చేసేవారు కాదు.[5]
ఇన్ఫాఖ్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఒక్క మాటతో తెలుసుకోగలము; అల్లాహ్ ఖుర్ఆన్ లో 80 ఆయతులు ఇన్ఫాఖ్ మరియు సహాయం గురించి సూచించెను. అల్లాహ్ ధర్మనిష్ట గలవారి లక్షణాలను వివరిస్తూ ఇలా అన్నాడు: “వారికి ప్రసాదించబడ్డ అనుగ్రహాల నుండి ఇన్ఫాఖ్ చేస్తారు”[బఖరహ్:3]
3. సత్ప్రవర్తన మరియు ప్రజల పట్ల గౌరవం:
వారి యొక్క మరో సద్గుణం, ఏమాత్రం గర్వం మరియు అహంకారం ఉండకపోవడం. వారు సామాజికంగా మరియు ధార్మికంగా గొప్ప స్థానం కలిగి ఉన్నప్పటికీ ఎటువంటి గర్వం వారిలో కనిపించేది కాదు. రావీ వారి గురించి ఇలా ఉల్లేఖించెను: “వారు ఎవ్వరి ముందు కూడా తమ కాళ్ళను చాచేవారు కాదు. అలాగే ఇతరుల ముందు దేనిపై వాలేవారు కాదు. వారు తమ దాసులను తిడుతుండడం గాని వారి పట్ల అసభ్య ప్రవర్తన గాని నేను చూడలేదు. అలాగే వారు గట్టి గట్టిగా నవ్వడం గాని చూడలేదు, వారు చిన్నగా నవ్వేవారు”[6]
4. వినయవిధేయత శిఖరం:
వారు పేదవారితో కూర్చునేవారు, వారితో పాటు ప్రయాణం చేసేవారు. ఇబ్రాహీమ్ ఇలా ఉల్లేఖించెను: “వారి కోసం భోజనం పరిచినప్పుడు వారు తమ పనివాళ్ళను, దాసులను చివరికి కావలివాడిని మరియు గుర్రాలను చూసుకునేవాడిని కూడా పిలిచి తనతో కూర్చోబెట్టుకునేవారు”[7]
5. ఆరాధన మరియు దాసోహం:
ఒకవైపు ప్రజల పట్ల ఈ నడవడికతోపాటు మరో వైపు సృష్టి లక్ష్యం అయిన అల్లాహ్ ఆరాధనను కూడా అదే విధంగా నిర్వర్తించేవారు. ఇబ్రాహీమ్ ఇలా ఉల్లేఖించెను: “రాత్రుళ్లు తక్కువ నిద్రపోయేవారు, ఎక్కువ సమయం మెలుకువగా ఉండేవారు, ఎక్కువ శాతం రాత్రంతా నిద్రపోకుండా ఆరాధనలో ఉండేవారు. ఉదయం పూట ఉపవాసం ఉండేవారు, ప్రతీ నెలలో మూడు రోజులైతే ఎప్పుడూ ఉపవాసాన్ని వదులుకునేవారు కాదు, ఈ మూడు రోజుల ఉపవాసాల గురించి చెప్పేవారు ఇవి మూడు ఉపవాసాలు పూర్తి జీవిత కాలంతో సమానమైనవి అని”[8]
రిఫరెన్స్
1. జవాహిరుల్ అఖ్దైన్, పేజీ353
2. జామివు కరామాతిల్ ఔలియా, భాగం2, పేజీ312
3,4,5,6,7&8. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం49, పేజీ90, హదీస్4
వ్యాఖ్యలు
Excellent, jazakallah
Mashaallah, jazakallah qibia.
వ్యాఖ్యానించండి