మనోవాంఛల నుండి విముక్తి

గురు, 02/11/2021 - 09:00

మనోవాంఛల నుండి విముక్తి చెంది అల్లాహ్ కోసం అమలు చేస్తేనే ఉపయోగపడుతుంది లేకపోతే చేసుకున్నదంతా నాశనమౌతుంది...

మనోవాంఛల నుండి విముక్తి

అతడు పెద్ద హోదా కలిగి ఉన్నవాడు, పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నవాడు. గొప్ప గొప్ప పనులు చేసున్నాడు. ఎలాగో అలాగ ఆగా(స్వామి) వద్దకు వచ్చాడు. వారితో నాకు ఏదైనా బోధించండి అని అన్నాడు. ఆగా ఒకేమాట అన్నారు: “మనిషిగా మారడానికి ప్రయత్నించు”
ఆ తరువాత ఇలా అన్నారు: “జీవితంలో ముష్రిక్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించు, నీ పనులన్ని సరిచేసుకోగలిగితే ఈ బోధనయే మంచి సద్బోధన”
అతడు ఆ ధర్మవేధి మరియు ప్రముఖ ముజ్తహిద్ నుండి ఇంకా ఏదైనా వినాలని అనుకున్నాడు. వారితో అతడు “ఆగా దుఆ చేయండి” అన్నాడు. వారు ఇలా అన్నారు: “ముందు మనిషిగా మారు! దుఆ తన ప్రభావాన్ని చూపిస్తుంది అంతేగాని అర్హత లేకపోతే దుఆ ప్రయోజనం కూడా ఉండదు”
అతడు వారి మనసును తన వైపుకు మక్కువ చేసుకోవడానికై ఇలా అన్నాడు: “ఈ సంవత్సరం మక్కాకు వెళ్ళాను, మీకోసం అక్కడ దుఆ చేశాను”
ఆ మజ్తహిద్ ఇలా అన్నారు: “ఇన్ షా అల్లాహ్ మనిషిగా మారడానికి ప్రయత్నించు! నీకోసం మరియు ఇతరుల కోసం తవాఫ్(కాబా ప్రదక్షణాలు) ఉపయోగపడాలంటే”
అప్పుడు అతడితో పాటు వచ్చిన వ్యక్తి ఆ ముజ్తహిద్ కు అతడి గురించి తెలియదేమో అన్న అనుమానంతో ఇలా అన్నాడు: “స్వామి! ఇతను ఫలాన పట్టణంలో ఫలానా అధికారంలో ఉన్న వ్యక్తి, ఇతను చాలా మంచి మంచి పనులు చేశారు”
మర్హూమ్ ఆయతుల్లాహ్ హాజ్ సయ్యద్ రిజా బహాఉద్దీనీ ఇలా అన్నారు: “చెబుతున్నది అర్ధం చేసుకోవడం లేదేమిటి?, ముందు మనిషిగా మారితే ఇవన్నీ అతడికి ఉపయోగపడతాయి. మనోవాంఛలకు దూరంగా ఉండాలి. అంతా నేనే చేస్తున్నాను అని అనుకోకూడదు. ఇతరులను తప్పుగా వ్యక్తం చేయడానికి లేదా ఒకరి పై ఆధిక్యాన్ని పొందడానికి పన్నాగాలు పన్నకుండా ఉండాలి. మోసం, ద్రోహాలకు దూరంగా ఉండాలి, అప్పుడే ఈమాన్ యొక్క నిజమైన రుచిని ఆశ్వాదించగలడు, లేకపోతే ఇవన్నీ ప్రజల దృష్టికి రావడడానికి మాత్రమే”[1]
మనిషిగా మారడం యొక్క ఉపమానం కారు నడపడం లాంటిది, ఒకడు నలభై ఏళ్ల నుండి డ్రైవింగ్ చేస్తున్న సరే ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే లోయలో పడతాడు. అతడు నలభై ఏళ్ల నుండి డ్రైవింగ్ చేస్తున్నాడు అని చెప్పలేము. మనిషి కూడా ఒక్క మాటతో మారిపోవచ్చు షైతాన్ మాదిరి. షైతాన్ 6వేల సంవత్సరాలు ఆరాధనలో ఉన్నాడు, కాని ఒక్క క్షణం అల్లాహ్ కు వ్యతిరేకంగా నిలబడ్డాడు. నేను ఆదమ్ కు సజ్దా చేయను అని అన్నాడు. ఒక్క క్షణం వ్యతిరేకత అతడి కొన్ని సంవత్సరాల ఆరాధన నాశనమయ్యింది.  
అంటే ఎల్లప్పుడూ అల్లాహ్ సన్నిధిలో వినయవిధేయతలతో ఇలా వేడుకోవాలి: “ఓ ప్రభూ! నీవు నన్ను రెప్పపాటి సమయానికి తక్కువ లేదా ఎక్కువ నా స్థితిలో నన్ను వదిలేయకు”[2]     

రిఫరెన్స్
1. జల్వహాయె జావిదానెహ్, పేజీ58
2. మర్హూమ్ కులైనీ, కాఫీ, భాగం2, పేజీ581

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

"ఇతరులను తప్పుగా వ్యక్తం చేయడానికి లేదా ఒకరి పై ఆధిక్యాన్ని పొందడానికి పన్నాగాలు పన్నకుండా ఉండాలి. మోసం, ద్రోహాలకు దూరంగా ఉండాలి, అప్పుడే ఈమాన్ యొక్క నిజమైన రుచిని ఆశ్వాదించగలడు"
Mashaallah behtareen wordings hai agha. Jazakallah

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10