ఒంటరితనం యొక్క చికిత్స

ఆది, 02/14/2021 - 09:14

ఒంటరిగా ఉన్నాను అనిపించడానికి కారణాలు మరియు దాని చికిత్స మార్గాలు...

ఒంటరితనం యొక్క చికిత్స

ఒంటరిగా ఉన్నాను అనిపించడానికి కారణాలు మరియు దాని చికిత్స మార్గాలు:
1. కష్టాలు మరియు అపజయాలు:
మనిషి యొక్క జీవితం ప్రతీ క్షణం కష్టాలతో ముడిపడి ఉంటుంది. వాటిని ఎదురుకోవాల్సి వస్తుంది. కాని కొందరు ఆ కష్టాలను భరించలేకపోతారు. కొందరు ఆ కష్టాల వల్ల ఒత్తిడికి గురి అయి అల్లాహ్ వారిని ఒంటరివారు చేశాడనీ, అల్లాహ్ వారి విన్నపాలను వినడం లేదని, అతడొక్కడే కష్టాలకు గురి అయ్యాడు మిగినవారందరూ ఆనందంగా ఉన్నారని అనుకుంటారు....
ఈ ఆలోచనలు ఒకటి తరువాత ఒకటి అతడి ఒంటరితనం పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే అతడు దుఖాన్ని తన మిత్రుడిగా చేసుకుంటాడు మరియు ఒంటరితనం యొక్క దుఖం, కన్నీళ్ల రూపంలో వాడి కళ్ళ నుండి ప్రవహిస్తూ ఉంటాయి.
చికిత్స
కష్ట పడకుండా ఏది లభించదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కష్టం వచ్చింది అంటే సహనంగా దానిని ఎదురుకుంటే దాని ఫలితం తప్పకుండా మంచి అనుగ్రరూపంలో మనకు ప్రసాదించబడుతుంది. మనపై పడే కష్టాల యొక్క మూల్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించెను: “స్వర్గం కష్టాలతో ముడి పడి ఉంది”[1]
మరో రివాయత్: “విశ్వాసుల కొరకు ఇహలోక కష్టాలకు ప్రసాదించబడే పుణ్యాన్ని చూసినవారు ఇలా అంటారు: ఈ కష్టాలతో పాటు ఇంకా ఎక్కువ కష్టాలు జోడించి మాకు ఇవ్వబడి ఉంటే ఎంతబాగుండేదో”[2]
ఔను, కష్టాలు పరిపూర్ణ స్థాయి చేరడానికి మరియు స్వర్గంలో ప్రవేశించడానికి కారణం.
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది: (అని వారిని ఓదార్చటం జరిగింది).[సూరయె బఖరహ్:214]
2. సిగ్గు పడడం:
కొందరు అతిగా సిగ్గు పడేవారు ఉంటారు. అందువల్ల వారు ఎక్కువగా జనం ఉన్న చోట్లకు హజరు కారు. ఎల్లప్పుడూ ఒక గదిలో ఒంటరిగా ఉంటారు.
చికిత్స:
ప్రముఖ ఆలిమ్ హుజ్జతుల్ ఇస్లాం ఖరాఅతీ ఇలా అన్నారు: నేను ఇండోనేషియా లో 8 అంతస్తుల మాల్, ప్రతీ అంతస్తులో వందల షాపులు, అక్కడ ఒకామెను చూశాను, ఆమే ఏదో కొనుక్కోవడానికి వచ్చింది, ఒకసారి తన వాచ్ ను చూసింది అప్పుడు అస్ర్ నమాజ్ సమయం అయ్యింది. నేను నమాజ్ చదవాలి అని అడిగింది. ఆ మాల్ లో ఎవరూ లేని ఒక చోట వెళ్లి న్యూస్ పేపర్ ను పరిచి దాని పై నిలబడి నమాజ్ చదవడం మొదలు పెట్టింది, అందరూ ఆమె నే చూస్తున్నారు.
ఆమె ఈ పని ద్వార అందరికి తెలియ పరిచిన విషయమేమిటంటే నీవు చేస్తున్న పని సరైనదైతే ఏమాత్రం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సిగ్గు పడాల్సిన అవసరం లేదు.[4]
మరో సందర్భంలో ఖరాఅతీ గారు ఇలా అన్నారు: “ఒక యువకుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు: నాకు సిగ్గు ఎక్కువ, నేనేమి చేయాలి? ఇంట్లో అజాన్ ఇవ్వమని చెప్పాను. ఇంట్లో కూడా సిగ్గు పడతాను అన్నాడు. దుప్పటి కప్పుకొని అజాన్ ఇవ్వు, దుప్పటి కప్పుకున్న తరువాత అల్లాహు అక్బర్ అని చెప్పు, భూకంపం రాలేదు అని అనుకున్న తరువాత నీ తలను బయటకు తీ, బయట అల్లాహు అక్బర్ చెప్పు. ఇప్పుడు ఆకాశం ఊడి పడలేదు అని అనుకున్న తరువాత వాకిలిలో వెళ్ళి ఆజాన్ చెప్పు. అలా అలా ప్రాక్టీస్ చేయి. ఇలా చేయడం వల్ల నీలో ఉన్న బిడయం దూరమౌతుంది.[5]

రిఫరెన్స్
1. తఫ్సీరె కాషిఫ్, భాగం1, పేజీ9, 31
2. తఫ్సీరె మన్హజ్ అల్ సాదిఖైన్, భాగం1, పేజీ552
3. సూరయె బఖరహ్, ఆయత్213
4. బర్నామా దర్స్ హాయి అజ్ ఖుర్ఆన్, 1375ష, అమ్ర్ బిల్ మారూఫ్22, పేజీ6
5. ఉపన్యాసం, టాపిక్ తర్బియతె ఇజ్తిమాయి దర్ ఆయాత్ వ రివాయాత్, 03/06/1389ష.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15