నిజమైన షియా ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) మాటల్లో సంక్షిప్తంగా తెలుసుకుందా...
నిజమైన షియా ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) మాటల్లో
1. ధర్మనిష్టను బలపరచడం మరియు పవిత్రత:
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) దృష్టిలో షీయత్ యొక్క ముఖ్యమైన మరియు మొట్టు మొదటి మెట్టు అల్లాహ్ పరీక్షల నుండి విజయవంతంగా బయట పడడం అనగా ధర్మనిష్టను పాటించడం. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉల్లేఖించెను: “మా షియాలు(మమ్మల్ని అనుసరించేవారు) కాలేరు అల్లాహ్ పట్ల ధర్మనిష్ఠ కలిగి ఉన్న మరియు ఆయన పట్ల విధేయత కలిగి ఉన్న వారు తప్ప”(1) నిజానికి కొందరు యదార్థానికి వ్యతిరేకంగా చాలా అల్పంగా ఆలోచిస్తూ ఉంటారు., వారు కేవలం ముస్లిం మరియు షియా అని పేరు పెట్టుకోవడామే విముక్తికి కారణంగా భావిస్తారు. కాని సమాజాన్ని సంపూర్ణ స్థాయికి చేర్చాలని ప్రవచించబడిన పవిత్ర మాసూముల(అ.స) ఉపదేశాలను చూసినట్లైతే ఈ అమాయకపు ముస్లిముల ఆలోచనలకు వ్యతిరేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే స్వయంగా అహ్లెబైత్(అ.స) తఖ్వా(ధర్మనిష్ట) మరియు పవిత్రతను పాటించేవారు, వారు అల్లాహ్ పట్ల దాసోహానికి నిదర్శనాలు మరియు నమూనాలు. తమ జీవితమంతా ధర్మనిష్టతో గడిపారు అందుకని వారిని షియాలు అనగా వారి అనుచరులు కూడా వారి నాయకులు అయిన పవిత్ర మాసూముల జీవితాన్ని తమ ఐడియల్ గా నిర్ధారించాలి.
మరో రివాయత్ లో ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉపదేశించారు: “ఓ జాబిర్! నా సలామును నా షియాలకు చేర్చు మరి వారితో ఇలా చెప్పు; మా మరియు అల్లాహ్ మధ్య ఎటువంటి బంధుత్వం లేదు, అల్లాహ్ సామిప్యం కోసం కేవలం ఆయన పట్ల విధేయత మరియు అనుచరణ కలిగి ఉండడం మాత్రమే నిజమైన దాసోహం. ఓ జాబిర్ ఎవరైతే అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉండి మమ్మల్ని ఇష్టపడతారో వారు మా మిత్రులు మరియు ఎవరైతే పాపములు చేస్తారో వారికి మా పట్ల ప్రేమ ఎటువంటి లాభాన్ని చేకూర్చదు”(2)
2. వినయం మరియు నమ్మకస్తంగా ఉండడం:
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) దృష్టిలో అహ్లెబైత్(అ.స)లను తమ ఇమాములుగా నమ్మే షియాల రీతి పరంగా రెండవ మొట్టు వినయం మరియు నమ్మకస్తంగా ఉండడం. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉల్లేఖించెను: “వారు(షియా) వినయం, విధేయత మరియు నమ్మకస్తం తప్ప వారు గుర్తించబడతారు(అనగా వీటి ద్వారానే వారిని తెలుసుకోగలము”(3) ఈ బంగారంలాంటి ప్రత్యేకతలు సంపూర్ణత్వానికి చేరడానికి మరియు మంచి జీవితానికి చాలా అవసరం. ఈ మూడు ప్రత్యేకతలు కేవలం సామాజికంగానే కాకుండా అల్లాహ్ తో మనిషి యొక్క బంధాన్ని కూడా బలపరుస్తుంది.
3. అల్లాహ్ ఆరాధన మరియు ఆయన దాసోహాన్ని ఇష్టపడడం:
నిజమైన షియా ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) యొక్క దృష్టిలో అల్లాహ్ ఆరాధన మరియు ఆయన దాసోహాన్ని ఇష్టపడతాడు. నిజమైన షియా ఆరాధనల కోసం ఖచ్చితమైన ప్రణాలిక కలిగి ఉంటారు, ఇందులో ఎటువంటి కొరతకు మరియు నిర్లక్ష్యానికి చోటు ఉండదు. ఈ ప్రత్యేకత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉపదేశించారు: “మా షియా కాలేరు అల్లాహ్ పట్ల ధర్మనిష్ట కలిగినవారు..... అల్లాహ్ ను ఎక్కువగా గుర్తుచేస్తూ ఉండేవారు, ఉపవాస దీక్షలు నిర్వర్తించేవారు, నమాజ్ ను అమలు పరిచేవారు...., ఖుర్ఆన్ పఠించేవారు.... తప్ప”(4).
4. సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపడం:
షియా యొక్క నిజమైన నడవడిక సత్ప్రవర్తనతో కూడి ఉంటుంది. ఇతరుల పట్ల అత్యుత్తమ రీతిని ప్రదర్శిస్తారు. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) దృష్టిలో మొదటి పరస్పర నైతికం తల్లిదండ్రులకు సంబంధించినది. అహ్లెబైత్(అ.స) పట్ల ప్రేమ కలిగి ఉన్నవారి నుంచి అనైతికం అంగీకరించబడదు, వారు ఉత్తమ నైతికం కలిగి ఉండాలి. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉపదేశించారు: “మా షియాలు కాదు వీళ్లు తప్ప; తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతి కలిగి ఉన్నవారు, పొరుగు వారి, పేదవారి, అనాధుల పట్ల బాధ్యతగా ఉండడం, నీతిగా ఉండడం...”(5)
రిఫరెన్స్
1. హర్రానీ, తొహ్ఫుల్ ఉఖూల్, అన్నస్, పేజీ295
2,3,4,5. బిహారుల్ అన్వార్, భాగం68, పేజీ179, హదీస్28
వ్యాఖ్యానించండి