ధర్మనిష్ట కలిగి ఉండడం అవసరం

శని, 02/20/2021 - 17:01

ధర్మనిష్ట మనిషికి చెప్పలేనంత భాగ్యాన్ని తెచ్చిపెడుతుంది అన్న మాట నిజం...

ధర్మనిష్ట కలిగి ఉండడం అవసరం

కొన్ని రోజుల ముందు ఇజ్రాయీల్ దేశానికి చెందిన రకరకాల పండ్ల తోట ఫోటోలు చూశాను. అందులో పండ్లతో నిండి ఉన్న ఆరెంజ్ చెట్లను చూశాను(ఇంచుమించు పండ్లు ఆకులతో సమానంగా ఉన్నాయి), ఈ ఫోటోలు ఇంటర్ నెట్ లో అలా తిరుగుతూ ఉన్నాయి, దాంతో కొందరు ఈ ఫోటోల క్రింద కామెంట్లు వ్రాశారు. ఇప్పుడు క్రింద ఈ ఫోటోలను చూసి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు మరియు దాని ఫలితాన్ని వివరించబోతున్నాము. ఆ ఇద్దరి పేర్లు సయీద్ మరయు అహ్మద్.
అహ్మద్: ఇందులో కొంత మనకూ ఉంటే ఎమయ్యేది?
సయీద్: ధనం కలిగి ఉండడం తప్పేమికాదు, కాని ఆ ధనం శుభమైనది అయి ఉండాలి మరి శుభం ధర్మనిష్ట ద్వార లభిస్తుంది. మేము కూడా అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉండి ధర్మనిష్టను పాటిస్తే అల్లాహ్ తన అనుగ్రహాలను శుభాలను మనపై కురిపిస్తాడు.[1]
అహ్మద్: అంటే ఇప్పుడు ధనవంతులందరూ, ధర్మనిష్ట కలిగి ఉన్నట్లేనా?
సయీద్: కాదు, ధర్మనిష్ట మనిషికి చెప్పలేనంత భాగ్యాన్ని తెచ్చిపెడుతుంది అన్న మాట నిజం[2] కాని ధనం కలిగి ఉన్నవారందరూ ధర్మనిష్ట కలిగినవారు అని అర్ధం కాదు, ఎందుకంటే చాలా మంది ధర్మనిష్ట లేకపోవడం వల్ల చాలా ధనం కలిగి ఉంటారు (వడ్డీ, లంచం, దొంగతనం మొ.. ద్వార).
అహ్మద్: ఏదీ కాదు, ముఖ్యమేమిటంటే వారి పరిస్థితి బాగుంది, జీవితాన్ని అనుభవిస్తున్నారు, అంతకు మించి ఏంకావాలి?
సయీద్: చూడడానికి వారు తమ జీవితాన్ని అనుభవిస్తున్నారు, కాని ఏ విధంగానైనా సరే ఆశ్వాదించడం, సమ్మతమైనదేనా?
అహ్మద్: కాదు అని తెలుసుగా. అయినా నా దృష్టి ప్రకారం ధనం లేని వారికి మంచి భాగ్యం కూడా ఉండదు.
సయీద్: ధనం ఈలోకపు కోరికలను తీర్చవచ్చు కాని ఆనందాన్ని మంచి భాగ్యాన్ని ఇస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మనిషికి సంతృప్తీ ఆనందాలు, గౌరవం మరియు గొప్ప స్వభావంలో ఉంటాయి ధనం కలిగి ఉండడంలో కాదు. చాలా సార్లు ధనం కలిగి ఉండడం మనిషిని అవమానానికి గురి చేస్తుంది, ఉదాహారణకు దొంగతనంగా చేజిక్కించుకున్న ధనం., నిస్సందేహంగా ఇలాంటి ధనం ఏమాత్రం మంచి భాగ్యానికి, ఆత్మ సంతోషానికి కారణం అవ్వదు.
అహ్మద్: దేన్ని ఒక మనిషి యొక్క గౌరవం మరియు గొప్ప స్వభావం అని చెప్పగం?
సయీద్: ఖుర్ఆన్ ఉపదేశానుసారం అల్లాహ్ దృష్టిలో ధర్మనిష్ట కలిగి ఉన్నవారే అత్యుత్తములు[3]
అహ్మద్: ఈ విధంగా చూసుకున్నట్లైతే ధర్మనిష్ట మనిషి యొక్క గౌరవానికి మరియు గొప్ప స్వభావానికి ప్రమాణం మరియు అల్లాహ్ కారుణ్య వర్షానికి కారణం అన్న మాట.
సయీద్: ఔను, అందుకే ఖుర్ఆన్ ధర్మనిష్ట కలిగి ఉండమని సిఫార్సు చేసింది.
అహ్మద్: ఇంత మంచి మాటలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స
సయీద్: వెల్ కమ్, అల్లాహ్ మనందరికీ ధర్మనిష్ట పాటించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.

రిఫరెన్స్
1. సురయె అఅరాఫ్, ఆయత్96
2. సూరయె తలాఖ్, ఆయత్2,3
3. సూరయె హుజురాత్, ఆయత్13
           

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7