రజబ్ మాసంలో ప్రతి రోజు చదవవలసిన దుఆ

మంగళ, 02/23/2021 - 17:51

రజబ్ మాసంలో ప్రతి రోజు చదవవలసిన దుఆల యొక్క అచ్చారణ తెలుగులో... 

రజబ్ మాసంలో ప్రతి రోజు చదవవలసిన దుఆ

ఒకవేళ ఎవరైన రజబ్ మాసంలో ఉపవాస దీక్షను నిర్వర్తించే శక్తీ లేదా అవకాశం లేకపోతే ప్రతీ రోజు ఈ తస్బీహాత్ ను 100 సార్లు పఠించాలి. దాంతో రజబ్ మాసం యొక్క ఉపవాసాల పుణ్యాన్ని పొందవచ్చు. ఆ దుఆ: “సుబ్హానల్ ఇలాహిల్ జలీలి సుబ్హాన మన్ లా యంబగీత్ తస్బీహు ఇల్లా లహు సుబ్హానల్ అఅజ్జల్ అక్రమి సుబ్హాన మన్ లబిసల్ ఇజ్జ వ హువ లహు అహ్లున్”
ప్రతి రోజు చేయవలసిన ఆమాల్:
1. ప్రతి రోజు ఈ దుఆను పఠించాలి. హజ్రత్ జైనుల్ ఆబెదీన్[అ.స] రజబ్ మాసం ఆరంభంలో హజరె ఇస్మాయీల్ వద్ద పఠించేవారు. దుఆ: “యా మన్ యమ్లికు హవాయిజస్సాయిలీన వ యఅలము జమీరస్సామితీన లికుల్లి మస్అలతిన్ మిన్క సమ్ఉన్ హాజిరున్ వ జవాబున్ అతీదున్ అల్లాహుమ్మా వ మవాయీదుకస్ సాదిఖతు వ అయాదీకల్ ఫాజిలతు వ రహ్మతుకల్ వాసిఅతు ఫ అస్అలుక అన్ తుసల్లియ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మదివ్ వ అన్ తఖ్జీ హవాయిజీ లిద్దునియా వల్ ఆఖిరతి ఇన్నక అలా కుల్లి షైయిన్ ఖదీర్”
2. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] రజబ్ మాసంలో ప్రతి రోజు పఠించేవారు. ఆ దుఆ: “ఖాబల్ వాఫిదూన అలా గైరిక వ ఖసిరల్ ముతఅర్రిజీన ఇల్లా లక వ జాఅల్ ములిమ్మూన ఇల్లా బిక వ అజ్దబల్ మంతజిఊన ఇల్లా మన్ ఇంతజఅ ఫజ్లక బాబుక మఫ్తూహున్ లిర్రాగిబీన వ ఖైరుక మబ్జూలున్ లిత్తాలిబీన వ ఫజ్లుక ముబాహున్ లిస్సాయిలీన వ నైలుక ముతాహున్ లిల్ ఆమిలీన వ రిజ్ఖుక మబ్సూతున్ లిమన్ అసాక వ హిల్ముక ముఅతరిజున్ లిమన్ నావాక ఆదతుకల్ ఇహ్సాను ఇలల్ ముసీఈన వ సబీలుకల్ ఇబ్ఖాఉ అలల్ ముఅతదీన అల్లాహుమ్మ ఫహ్దీనీ హుదల్ ముహ్తదీన వర్ జుఖ్నీ ఇజ్తిహాదల్ ముజ్తహిదీన వలా తజ్అల్నీ మినల్ గాఫిలీనల్ మబ్అదీన వగ్ ఫిర్ లీ యౌమద్దీన్.”
3. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఈ దుఆను ప్రతి రోజు పఠించేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక సబ్రష్షాకిరీన లక వ అమలల్ ఖాయిఫీన మన్క వ యఖీనల్ ఆబిదీన లక అల్లాహుమ్మ అంతల్ అలియ్యుల్ అజీము వ అనా అబ్దుకల్ బాయిసుల్ ఫఖీరు అంతల్ గనీయ్యుల్ హమీదు వ అనల్ అబ్దుల్ జజీలు అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహి వమ్నున్ బిగినాక అలా ఫఖ్రీ వ బిహిల్మిక అలా జహ్లీ వ బి ఖువ్వతిక అలా జఅఫీ యా ఖవీయ్యు యా అజీజు అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహిల్ ఔసియాయిల్ మర్జీయ్యీన వక్ఫీనీ మా అహమ్మనీ మిన్ అమ్రిద్దునియా వల్ ఆఖిరతి యా అర్హమర్రాహిమీన్”
"అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ వ అతూబు ఇలైహ్" రాత్రింబళ్ళు ఎక్కువగా చెబుతూ ఉండాలి.
4. "అస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహ ఇల్లాహూ, వహ్దహు లా షరీకలహు వఅతూబు ఇలైహ్" ఒకవేళ ఎవరైనా దీనిని 100 సార్లు చదివి సద్ఖా ఇస్తే అల్లాహ్ అతనికి క్షమించి అతని పై తన కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు 400 సార్లు చదివిన వారికి ఒక షహీద్(అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలు త్యాగం చేసినవాడు)కు ఇవ్వబడే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు.
5. "లా ఇలాహ ఇల్లల్లాహ్" ఒకవేళ ఎవరైనా దీనిని 1000 సార్లు చెబితే 100000 పూణ్యములు మరియు స్వర్గంలో 100 పట్టణాలు తయారు చేసుకున్నట్లే.
6. ఉదయం పూట 70 సార్లు మరియు జొహ్‌ర్ పూట 70 సార్లు "అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్" అని చదివి తన రెండు చేతులు ఎత్తి ఒకసారి ఇలా "అల్లాహుమ్మగ్ఫిర్లీ వ తుబ్ అలయ్య" చెబితే అల్లాహ్ అతనికి ఇష్టపడతాడు మరియు నరకాగ్ని అతనికి తాకదు.
7. పూర్తి మాసంలో 1000 సార్లు "అస్తగ్ఫిరుల్లాహ జుల్ జలాలి వల్ ఇక్రామ్ మిన్ జమీఇజ్జూనూబి వల్ ఆసామ్" అని చెబితే అల్లాహ్ అతనికి క్షమిస్తాడు.
8. దైవప్రవక్త(అ.స) రివాయత్ ప్రకారం, సూరయే "ఖుల్ హు వల్లాహు అహద్" 10000 సార్లు లేదా 1000 సార్లు లేదా 100 సార్లు చదవాలి.
9. రివాయత్ లో ఇలా కూడా ఉంద్ ..రజబ్.. మాసంలో శుక్రవారం నాడు 100 సార్లు సూరయే "ఖుల్ హు వల్లాహు అహద్" పఠించాలి దాంతో అతని కోసం ప్రళయంనాడు ఒక కాంతి నిశ్చయించబడుతుంది అది అతనిని స్వర్గం వైపుకు తీసుకొని వెళ్తుంది.
10. రజబ్ మాసంలో ప్రతి నమాజ్ తరువాత చదవాల్సిన దుఆ: "యా మన్ అర్‌జూహు లికుల్లి ఖైరివ్ వ ఆమను సఖతహు ఇంద కుల్లి షర్, యా మయ్ యుతిల్ కతీర బిల్ ఖలీల్, యా మయ్ యుతీ మన్ సఅలహ్, యా మయ్ యుతీ మల్లమ్ యస్అలుహు వ మల్లమ్ యరిఫుహు తహన్నునమ్ మిన్‌హు వ రహ్మా, అతినీ బిమస్అలతీ ఇయ్యాక జమీఅ ఖైరిద్దునియా వ జమీఅ ఖైరిల్ ఆఖిరహ్, వస్‌రిఫ్ అన్నీ బిమస్అలతీ ఇయ్యాక జమీఅ షర్రిద్దునియ వ షర్రిల్ ఆఖిరహ్, ఫ ఇన్నహు గైరు మన్‌ఖూసిమ్మాతైత వ జిద్‌నీ మిన్ ఫజ్‌లిక యా కరీమ్. (ఆ తరువాత ఎడమ చేతితో గడ్డాన్ని పట్టుకుని కుడి చేతి చూపుడు వ్రేలును కదపాలి) యా జల్ జలాలె వల్ ఇక్రామ్, యా జన్నమాయి వల్ జూద్, యా జల్ మన్ని వత్తౌల్, హర్రిమ్ షైబతీ అలన్నార్".[1]

రిఫరెన్స్
1. మఫాతీహుల్ జీనాన్, షేఖ్ అబ్బాసె ఖుమ్మీ. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8