దైవప్రవక్త[స.అ] జన్మంపై సంభవించిన అద్భుతాలు

గురు, 03/04/2021 - 18:33

షైతానులను మరియు జిన్నాతులను ఆకాశం నుండి తరిమేయబడింది...

దైవప్రవక్త[స.అ] జన్మంపై సంభవించిన అద్భుతాలు

ముహమ్మద్[స.అ] అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివాడు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ర్ద హృదయులు. దైవకృపను, దైవ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇన్ జీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు.[1]
దైవప్రవక్తల దౌత్యాన్ని నిదర్శించేందుకు వారు జన్మకు ముందూ లేదా తరువాత అల్లాహ్ కొన్ని అద్భుతాలను సృష్టింస్తాడు. వీటిని “ఇర్హాస్” అంటారు.
అంతిమ దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ] వారు జన్మించినపుడు కూడా కొన్ని ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన సంఘటనలు జరిగాయి అని నిదర్శిస్తున్న కొన్ని రివాయతులను చూద్దాం..
కిస్రా భవనం కంపించింది మరియు ఆ భవనంలో ఉన్న 13 Chandelier (కొవ్వొత్తులను పెట్టుకునే లేదా విద్యుత్ బల్బులను పెట్టుకునే అలంకార వస్తువు) పగిలిపోయాయి.[2]
వెయ్యి సంవత్సరాల నుంచి ఆరిపోకుండా మండుతున్న ఫార్స్(ఇరాన్)కు చెందిన పెద్ద అగ్ని గుండం ఆరిపోయింది.[3]
సావహ్ అనబడే నది ఎండిపోయింది.[4]
సమావహ్ అనబడే లోయ నీటితో నిండిపోయింది.[5]
వారు జన్మంతో పాటు ఒక కాంతి పుట్టుకొచ్చింది, అది పడమర నుండి తూర్పు వరకు ఉన్న రాజభవనాలను రాత్రి తెరుచుకొని ఉన్న బజారులను కాంతిపజేసింది.[6]
షైతానులను మరియు జిన్నాతులను ఆకాశం నుండి తరిమేయబడింది, వారికి ఆకాశవాణులు వినబడకుండా నిషేధించబడినది.[7]
పూజించబడే విగ్రహాలు తలక్రిందులయ్యాయి.[8]
కొన్ని రివాయతుల ప్రకారం మరెన్నో అద్భుతాలు మరియు సంఘటనలు సంభవించాయి. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) రివాయత్ ప్రకారం ఇక్కడ కొన్ని సంఘటనలు ప్రదర్శిస్తున్నాము..
కిస్రా భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి దాంతో దజ్లా నది నీళ్లు ఆ భవనంలో ప్రవేశించాయి, హిజాజ్ నుండి తూర్పు వైపుకు కాంతి వ్యక్తం అయ్యింది, చక్రవర్తి రాజ్యం అంతం అయ్యింది మరుసటిరోజు వారు మూగబోయారు, పూజారుల జ్ఞానం అపహరించబడింది, మాంత్రీకుల మంత్రాలు మిథ్యమయ్యాయి, షైతానులతో గుడి పూజారుల సంబంధం తెగిపోయింది.[9]
షేఖ్ సదూఖ్ దీనికి సంబంధించిన కొన్ని రివాయతులు తన అమాలీ గ్రంథంలో వివరించారు. ఇవి బైబిల్ పట్ల పూర్తి జ్ఞానం కలిగి ఉన్న కఅబుల్ అహ్బార్ ద్వార ఉల్లేఖించబడినవి. వాటి అనువాదం ఎటువంటి కొరత లేకుండా మీకోసం:
లైస్ ఇబ్నె సఅద్ ఉల్లేఖనం.. కఅబ్ ముఆవిహ్ వద్ద ఉన్నప్పుడు నేను అతడితో దైవప్రవక్త[స.అ] జన్మదినం గురించి మీ గ్రంథంలో ఏమని ఉంది?, వారి కుటుంబ సభ్యుల గురించి ప్రతిష్టతలను గమనించావా?
కఅబ్, ఇందులో ముఆవియహ్ కు ఎంత మక్కువ ఉందో చూడడానికి అతడి వైపు చూశాడు. అల్లాహ్ ముఆవియహ్ నోటి నుండి ఇలా మాట్లాడించాడు: “అబూ ఇస్హాఖ్, దీని గురించి నీకు తెలిసినంతా చెప్పు, అల్లాహ్ నిన్ను కరుణించుగాక”
కఅబ్: నేను 72 ఆకాశ గ్రంథాలను చదివాను, దానియాల్ గ్రంథాలన్నీ చదివాను వాటన్నింటిలో వారి జననం గురించి వివరించబడి ఉంది, వారి పేరు ప్రఖ్యాతి చెందినది, ఏ ఒక్క దైవప్రవక్త[స.అ] జననం పై దైవదూత అవతరించలేదు ఈసా మరియు అహ్మద్ ల జననం పై తప్ప. ఏ ఒక్కరి కోసం స్వర్గం చూడడానికి మధ్యలో ఉన్న ముసుగు తొలగించబడలేదు మర్యమ్ మరియు అహ్మద్ యొక్క తల్లి గారి కోసం తప్ప. దైవదూతలు ఏ ఒక్క స్త్రీ కాన్పు సమయంలో రాలేదు ఈసా తల్లి మర్యమ్ మరియు అహ్మద్ తల్లి ఆమినహ్ వద్దకు తప్ప. నాకు చేరిన వార్త ప్రకారం దైవప్రవక్త[స.అ] జన్మించినపుడు స్వర్గంలో ఉన్న కౌసం సెలయేరు కంపించింది 70 వేల భవంతుల అలంకరణ మణిమాణిక్యాలు ఊడిపడ్డాయి. షైతాన్ ను శపించారు, సంకెళతో బంధించారు, నలభై రోజుల వరకు కారాగారంలో వేశారు, వాడి అధికారం నలభై రోజుల వరకు ముంచేయబడింది, విగ్రహాలు తలక్రిదులు అయ్యాయి, ... కాబా నుండి ఇలా శబ్ధం వినబడింది: ఓ ఖురైష్ వంశాని చెందినవారా! శుభవార్త గలవాడు మీ కోసం వచ్చాడు, భయపెట్టేవాడు మీ కోసం వచ్చాడు అతడు మీ నిత్య గౌరవానికి కారకుడు, గొప్ప లాభం అతడితో ఉంది, అతడు అంతిమ ప్రవక్త. మా గ్రంథాలలో ఇలా ఉంది వారి తరువాత వారి అహ్లె బైత్ ప్రజలలోనే అత్యుత్తములు. వారి నుండి భూమిపై ఉన్నంత వరకు ప్రజలు శిక్ష నుండి రక్షణలో ఉంటారు.
ముఆవియహ్: ఓ కఅబ్! వారి ఇత్రత్ ఎవరూ?
కఅబ్: ఫాతెమా సంతానం
ముఆవియహ్ ముఖం మారిపోయింది, పెదాన్ని పళ్లతో కొరుకున్నాడు, గడ్డంతో ఆడుకోవడం మొదలెట్టాడు.
కఅబ్: ప్రియమైన ఇద్దరు చంపబడతారు(షహీద్ చేయబడతారు) వారిద్దరూ ఫాతెమాకు ప్రియమైనవారు, వారిని అతి నిఛమైన వారు చంపుతారు.
ఎవరు వారిని చంపుతారు అని ప్రశ్నించాను.
ఖురైష్ వంశానికి చెందినవాడు అన్నాడు.
అప్పుడు ముఆవియహ్ నిలబడి నేను నిలబడ్డాను కావాలంటే మీరు కూడా నిలబడవచ్చు. (అంటే నేను వెళ్తున్నాను మీరు కూడా ఇక వెళ్ళవచ్చు అని అర్థం)[10]
అల్లాహ్ మనల్ని ఇంత గొప్ప ప్రవక్త[స.అ] మరియు వారి ఉత్తరాధికారి అయిన అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] మరియు వారి పవిత్ర సంతానాన్ని ఆచరించే వారిలో నిర్ధారించినందుకు ఆ అల్లాహ్ కు నిత్యం కృతజ్ఞతలుగా ఉంటాము మరియు ఉండాలి కూడా. ఇదే ధర్మం.

రిఫరెన్స్
1. సూరయె ఫత్హ్, ఆయత్29.
2,3,4. తారీఖె యాఖూబీ, యాఖూబీ, భాగం2, పేజీ8., కమాలుద్దీన్, షేఖ్ సదూఖ్, పేజీ192., మొ..
5. అల్ అమాలీ, షేఖ్ సదూఖ్, మజ్లిస్48, పేజీ361, హదీస్1
6. అల్ సీరతున్నబవీయహ్, ఇబ్నె హిషామ్ హిమ్యరీ, భాగం1, పేజీ159 – పేజీ203.
7. తారీఖె యాఖూబీ, యాఖూబీ, భాగం2, పేజీ8
8,9,10. అల్ అమాలీ, షేఖ్ సదూఖ్, మజ్లిస్48, పేజీ361, హదీస్1.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9