మీ భార్యలు మీకు దుస్తులు - మీరు వారికి దుస్తులు

ఆది, 03/14/2021 - 14:15

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మీ భార్యలు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు”[సూరయె బఖరహ్, ఆయత్187]

మీ భార్యలు మీకు దుస్తులు - మీరు వారికి దుస్తులు

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మీ భార్యలు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు”[సూరయె బఖరహ్, ఆయత్187]

ఈ ఆయత్ కు సంబంధించిన మరికొన్ని అంశాలు:

1. జీవిత భాగస్వామి, మనశాంతికి కారణం:
దుస్తులు మనశాంతికి కారణం కాదు. దాని క్వాలిటీయే మనశాంతికి కారణం. క్వాలిటీ లేని బట్టలు కొని ధరిస్తే అవి శరీర దురదకు కారణం అవుతుంది. ఇదేవిధంగా కొన్ని సమయాలలో క్వాలిటీ(దీన్ దారీ) లేని వారితో వివాహం చేసుకుంటారు, తీరా చూస్తే జీవితం నిరంతరం బాధలు తప్పా ఆనందం లేదు. ఎందుకంటే ఒకరికొకరు అనుకూలంగా లేరు కాబట్టి.
దుస్తులు శరీర లోపాలను దాచిపెడుతాయి, అందరికీ తెలియపరిచేటట్లు చేయవు. అదే విధంగా భార్య లేదా భర్త తమ భాగస్వాముల లోపాలను దాచిపెట్టి వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని చిన్న చిన్న విషయాలకు కోర్టులకని, రచ్చబండలకని వెళ్లిపోకూడదు. లేదా భార్య పుట్టింటికి మరియు భర్త ఇంటిని వదిలి వెళ్లిపోకూడదు. 
కొన్ని దుస్తులు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భార్యభర్తల స్వభావం కూడా ఒక్కోసారి చాలా సున్నితంగా ఉంటుంది, దానికి తగ్గట్టు మన ప్రవర్తన ఉండాలి.

2. పవిత్ర భాగస్వామిని ఎంచుకొనె విషయంలో శ్రద్ధ:
అవిశ్వాసి మరియు దౌర్జన్యకారుడు బట్టలు దొంతనం చేసి వేసుకోగలడు కాని ఒక విశ్వాసి అలా చేయడానికి ఇష్టపడడు. దుర్మార్గులు అపవిత్రులతో ఉండగలరు కాని విశ్వాసులు అపవిత్రులతో తన జీవితాన్ని గడపలేరు. ఖుర్ఆన్ సూచన.. ..అపవిత్ర స్ర్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు. అపవిత్ర పురుషులు అపవిత్ర స్ర్తీలకు తగినవారు. (అలాగే) పవిత్ర స్ర్తీలు పవిత్ర పురుషులకు తగినవారు. పవిత్ర పురుషులు పవిత్ర స్ర్తీలకు తగినవారు.(సూరయె నూర్, ఆయత్:26)
అందమైన దుస్తులు సంతోషాన్నిస్తాయి. భార్యభర్తలు కూడా ఒకరికోసం ఒకరు తమను అలంకరించుకుంటే ఇది సంతోషానికి కారణమౌతుంది. మాట్లాడుకునేటప్పుడు ప్రేమపూరితమైన మరియు మంచి పదాలు ఉపయోగించాలి. హదీస్ అనుసారం., భర్త తన భార్యతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అది జీవితాంతం ఆమె మనసులో ఉండిపోతుంది. మరో హదీస్ అనుసారం; ఒకవేళ నీవు ఎవరినైనా ఇష్టపడుతుంటే వారితో నీ ఇష్టాన్ని వెల్లడించు(హలాల్ సంబంధం కుటుంబ సభ్యులు; తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, భార్యభర్తలు, మిత్రులు మొదలగువారు ఇందులో మా ఉద్దేశంలో ప్రేమికులు ఏమాత్రం కాదు) కృతజ్ఞతను వ్వక్తం చేయి, విమర్శలను వినడం, తప్పు చేస్తే క్షమపణ కోరడం ఇవన్నీ జీవితాన్ని తియ్యదనాన్ని తీసుకోస్తాయి.

3. యదార్థాన్ని బట్టి మెహ్ర్ (అబ్బాయి తరపు నుండి అమ్మాయికి ఇచ్చే రొక్కము)ను నియమించడం:
బట్టలు కొనేటప్పుడు జేబులో డబ్బును చూసుకుంటాము అలాగే మెహ్ర్ చెల్లించే విషయంలో కూడా జేబును చూసి నిశ్చయించాలి అంతేగాని తీర్చలేని విధంగా నిశ్చయించేసుకోకూడదు.
దరించిన బట్టులను బట్టి అతని వ్యక్తిత్వానికి అనుకూలంగా ఉన్నవారు వారితో తోడు అవుతారు. అలాగే అపవిత్రులు అపవిత్రులను తమ వైపు లాగుకుంటారు.
బయట చలిగా ఉంటే దానికి అనుకూలంగా దుస్తులు ధరిస్తారు అదే ఎండగా ఉంటే పలచని దుస్తులు ధరిస్తారు ఇదే విధంగా భర్తకు కోపం వస్తే భార్య మరియు భార్యకు కోపం వస్తే భర్త తగ్గాలి. నువ్వునేనూ అనే బేధం రాకూడదు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8