ఖుర్ఆన్ ఏమాత్రం వక్రీకరణకు గురికాలేదు

మంగళ, 03/16/2021 - 14:25

ఖుర్ఆనె కరీమ్, ఆకాశగ్రంథాలలో మానవుల చేత వక్రీకరణకు గురి కాకుండా సురక్షితంగా ఉన్న దైవప్రవక్త(స.అ) యొక్క నిత్యద్భుతం... 

ఖుర్ఆన్ ఏమాత్రం వక్రీకరణకు గురికాలేదు

ఖుర్ఆనె కరీమ్, ఆకాశగ్రంథాలలో మానవుల చేత వక్రీకరణకు గురి కాకుండా సురక్షితంగా ఉన్న దైవప్రవక్త(స.అ) యొక్క నిత్యద్భుతం, ఖుర్ఆన్ యొక్క చాలా ఆయతులు ఖుర్ఆన్ వక్రీకరణకు గురికాలేదు అన్న విషయాన్ని నిదర్శిస్తున్నాయి. వాటి ద్వార ఏమాత్రం ఖుర్ఆన్ వక్రీకరణకు గురి కాదు అని తెలస్తుంది. వాటి నుండి ఒక ఆయత్ “మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము”[సూరయె హిజ్ర్, ఆయత్09]
ఈ ఆయతే కాకుండా, ఖుర్ఆన్ యొక్క వక్రీకరణను నమ్మితే దాని నిత్య మార్గదర్శి అయ్యేవిషయం వ్యర్ధమౌతుంది. అయిన్నప్పటికీ ప్రతీ కొంతకాలానికి షియా హదీస్ గ్రంథాలలో ఉన్న కొన్ని జయీఫ్ రివాయతుల ఆధారంగా ఈ వర్గాన్ని ఖుర్ఆన్ వక్రీకరణ పై నమ్మకం కలిగి ఉన్నారు అని నిందిస్తూ ఉంటారు. నిజానికి షియా ఉలమాలు ఖుర్ఆన్ వక్రీకరణను బలంగా రద్దు చేస్తారు. షియా వర్గం ఖుర్ఆన్ వక్రీకరణను నమ్ముతారు అని వాదించేవారికి కొన్ని అంశాలు గుర్తుచేయాలనుకుంటున్నాము:

1. ఒకవేళ కేవలం హదీస్ గ్రంథాలలో జయీఫ్(బలహీనమైన) రివాయతులు ఉండడం ఖుర్ఆన్ వక్రీకరణకు ఆధారం అయితే ముందుగా రెండవ ఖలీఫా మరియు హజ్రత్ ఆయిషాలను ఖుర్ఆన్ వక్రీకరణకు సమ్మతించారు అని నమ్మాలి. ఎందుకంటే అహ్లె సున్నత్ రివాయత్ గ్రంథాల ప్రకారం, రెండవ ఖలీఫా దైవప్రవక్త(స.అ) కాలంలో “రజ్మ్” ఆయత్ ఖుర్ఆన్ లో ఉండేది తొలగించబడింది, అని నమ్మేవారు. వారు ఇలా అనేవారు: “ఒకవేళ ప్రజలు ఉమర్ ఖుర్ఆన్ లో ఏదో పెంచాడు అని అంటారు అన్న భయంలేకుంటే వెంటనే రజ్మ్ ఆయత్ ను పెంచేవాడిని[1] హజ్రత్ ఆయిషహ్ కూడా “రిజాయె కబీర్” మరియు “రజ్మ్” ఆయతులు దైవప్రవక్త(స.అ) కాలంలో అవతరించబడ్డాయి కాని పాన్పు క్రింద నుంచి ఒకమేక దాన్ని తినేసింది.[2]

2. ఒకవేళ కేవలం హదీస్ గ్రంథాలలో జయీఫ్(బలహీనమైన) రివాయతులు ఉండడం ఖుర్ఆన్ వక్రీకరణకు ఆధారం అయితే అహ్లె సున్నత్ ఉలమాలు ఉదా: బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజహ్ మొదలగు వారిని కూడా ఖుర్ఆన్ వక్రీకరణను నమ్మవారుగా భావించాల్సివస్తుంది. ఎందుకంటే వీరు గ్రంథాలలో ఖుర్ఆన్ వక్రీకరణకు సంబంధించిన రివాయతులు ఉన్నాయి కాబట్టి.

3. ఒకవేళ ఒక మనిషి యొక్క మాటను ఆ వర్గం యొక్క నమ్మకం అని లేదా వారి ఉలమాల నమ్మకం అని భావించడం సరైనది అయి ఉంటే, ఈ రంకంగా అహ్లె సున్నత్ యొక్క చాలా మంది ఉలమాల అభిప్రాయం ప్రకారం ఈ వర్గాన్ని కూడా ఖుర్ఆన్ వక్రీకరణను నమ్మే వర్గంగా భావించాలి.

చివరిమాట: షియా వర్గానికి చెందినవారు ఖుర్ఆన్ ఎటువంటి వక్రీకరణకు గురికాలేదు మరియు భవిష్యత్తులో గురి అయ్యే అవకాశం లేదు అని నమ్ముతారు. అహ్లె సున్నత్ హదీస్ గ్రంథాలలో ఖుర్ఆన్ వక్రీకరణకు సంబంధించిన రివాయతున్నింటిని జయీఫ్(బలహీనమైనవి)గా భావిస్తారు. ఎందుకంటే ఈ రివాయతులు ఖుర్ఆన్ ఆయతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి.

రిఫరెన్స్
1. ఇఖ్తెలాఫుల్ హదీస్ షాఫెయీ, పేజీ533. సహీ బుఖారీ, భాగం8, పేజీ113. మొ...
والذي نفسي بيده لولا أن يقول الناس زاد عمر في كتاب الله، لكتبتها؛  
2. ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం6, దారు సాదిర్, బీరూత్, పేజీ626, హదీస్1944. సుననె దారు ఖుత్నీ, భాగం4, పేజీ105. సుననె ఇబ్నె మాజహ్, భాగం1, పేజీ626. మొ..
قد نزلت آية الرجم و رضاعة الكبيرة عشرا و لقد كان في صحيفة تحت سريرتي، فلما مات رسول الله (صلي الله عليه و سلم) تشاغلنا بموته، دخل داجن فأكلها     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7