వక్రీకరణకు గురి కాని గ్రంథం

గురు, 03/18/2021 - 04:11

ఖుర్ఆన్ వక్రీకరణకు గురి కాలేదు అనడానికి కొన్ని ఖుర్ఆన్, హదీస్ మరియు జ్ఞాన పరమైన సాక్ష్యాలు...

వక్రీకరణకు గురి కాని గ్రంథం

ఖుర్ఆన్ వక్రీకరణకు గురి కాలేదు అనడానికి కొన్ని సాక్ష్యాలు

ఖుర్ఆన్ మరియు హదీస్ సాక్ష్యాలు:
1. అల్లాహ్ ఖుర్ఆన్ ను కాపాడుతాడు:
మనం పరిశీలించాలని అనుకుంటున్న అంశాన్ని ముందుగా అది ఎవరికి సంబంధించినదో, ఆయన స్వయంగా ఏమి చేబుతున్నాడో తెలుసుకోవడం అవసరం. అల్లాహ్ తాను అవతరించిన పవిత్ర గ్రంథంలో ఖుర్ఆన్ వక్రీకరణకు ఖండించెను. అల్లాహ్ ఇలా ప్రవచించెను: “మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము”[1]
సాహిబ్ అల్ తమ్హీద్ ఇలా రచించెను: “ఇందులో ఎటువంటి సందేహం లేదు., ఖుర్ఆన్ ముస్లిముల మధ్య తవాతుర్(నమ్మకమైన మార్గం) ద్వార ఈనాటి ముస్లిములకు చేరింది, అల్లాహ్ కూడా అందులో ఎటువంటి ఎక్కుతక్కువలు జరగకుండా కాపాడుతానని అనెను.[2]

2. ఖుర్ఆన్ వక్రీకరణకు గురి కాలేదు అనడంపై హదీస్ నిదర్శనం:
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) యొక్క ప్రముఖ సహాబీయులలో ఒకరైన జురారహ్ ఇమామ్ తో ఖుర్ఆన్ వక్రీకరణ గురించి ప్రశ్నించగా ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: “ఖుర్ఆన్ ఒక్కటే మరియు ఒక్కడైన అల్లాహ్ తరపు నుండి అవతరించబడింది, ఈ వ్యతిరేకతలు రావీయుల తరపు నుండి”[3]
ఈ హదీస్ మరియు ఇలాంటి ఇతర హదీసులు, ఖుర్ఆన్ పఠన ప్రకారం ఉన్న వ్యతిరేకతను నిరాకరిస్తున్నాయి, మరియు అసలైన ఖుర్ఆన్ పఠనం(అవతరించబడినపుడు) పై తాకీదు చేస్తున్నాయి.

జ్ఞానపరమైన సాక్ష్యాలు:
1. శత్రువులతో చేసిన సవాళ్లు ఖుర్ఆన్ లో ఉండడం:
ఖుర్ఆన్ శత్రువులతో ఇలా సవాలు చేసింది “ఏమిటి, అతనే(ప్రవక్త) ఈ ఖుర్ఆన్ ను కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? “మరైతే మీరు కూడా ఇలాంటి పది సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే, అల్లాహ్ ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.[4] అయితే ఆకాలపు అవిశ్వాసులు కానివ్వండి లేదా ఈనాటి వారు కానివ్వండి ఖుర్ఆన్ ఆయత్ లాంటి ఒక్క ఆయత్ తీసుకొని రాలేకపోయారు. ఈ విధంగా చూసుకున్నట్లైతే ఒకవేళ ఇప్పుడు మావద్ద ఉన్న ఖుర్ఆన్ వక్రీకరణకు గురి అయి ఉంటే, అందులో ఎక్కుతక్కువలు చేయబడి ఉంటే; నిస్సందేహంగా ఇతరులు కూడా ఇలాంటిది మరోకటి తీసుకొచ్చేవారు. కాని ఇప్పటి వరకు ఒక్క ఆయత్ కు బదులు తీసుకొని రాలేక పోయారు.

2. ఖుర్ఆన్ ఒక నిత్యద్భుతమైన గ్రంథం:
ఖుర్ఆన్ నిత్యద్భుతమైన గ్రంథం అవ్వడానికి కారణాలలో ఒకటి దాని అద్భుతమైన జ్ఞానం; అందులో ఉన్న చాలా విషయాలు ఈనాటి జ్ఞానానికి అనుకూలంగా ఉన్నాయి. సాఫాత్ సూరహ్ యొక్క 6 ఆయత్ “మేము సమీప ఆకాశాన్ని నక్షత్రాల (అందం)తో ముస్తాబు చేశాము”.[5]
పదాల పరంగా ఖుర్ఆన్ లో ఉన్న అద్భుతం గురించి చెప్పాలంటే దైవప్రవక్త(స.అ) కాలంలో ఉన్న వాక్చాతుర్యం కలిగు ఉన్న అరబ్ దేశస్తులు కూడా ఖుర్ఆన్ వాక్చాతుర్యం ముందు మూగవారైయ్యారు; నిస్సహాయులై చివరికి వారు నఊజు బిల్లాహ్ దైవప్రవక్త(స.అ)ను ఉన్మాద కవి అని అన్నారు. ఖుర్ఆన్: “పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్యదైవాలను వదులుకోవాలా?” అని అనేవారు.[6]
దైవప్రవక్త(స.అ) శత్రువులు, ఖుర్ఆన్ ను మానవవాకుగా భావించేవారు. నిజానికి ఖుర్ఆన్ దైవప్రవక్త(స.అ) కవి కాదు అని సూచించెను: “మేమతనికి (దైవప్రవక్తకు) కవిత్వం నేర్పలేదు. అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖుర్ఆన్ మాత్రమే”[7]

రిఫరెన్స్
1. సూరయె హిజ్ర్, ఆయత్09
2. అల్ తమ్హీదియహ్, మారెఫత్ ముహమ్మద్ జవాద్, భాగం1. పేజీ309
3. అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), కులైనీ ముహమ్మద్ ఇబ్నె యాఖూబ్, దారుల్ కితాబ్ ఇస్లామియహ్, 1407హి, తెహ్రాన్, భాగం2, పేజీ630
4. సూరయె హూద్, ఆయత్13-సూరయె యూనుస్, ఆయత్38
5. సూరయె సఫ్పాత్, ఆయత్06
6. సూరయె సాఫ్పాత్, ఆయత్36
7. సూరయె యాసీన్, ఆయత్69

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11