ఇమామ్ హుసైన్ భూమ్యాకాశాల అలంకరణ

గురు, 03/18/2021 - 12:43

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనుసారం ఇమామ్ హుసైన్ భూమ్యాకాశాల అలంకరణ. వారి ప్రతిష్టతను అహ్లె సున్నత్ ఉలమాలు చివరికి వారి శత్రువులు కూడా అంగీకరించారు...

ఇమామ్ హుసైన్ భూమ్యాకాశాల అలంకరణ

షాబాన్ నెల మూడవ తేదీన దైవప్రవక్త(స.అ) మూడవ ఉత్తరాధికారి మరియు వారికి అత్యంత ఇష్టమైన హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) జన్మించారు. వారి ఇమామత్ కాలం 10 సంవత్సరాలు. వారి ఇమామత్ కాలంలో ముఆవియహ్ అధికారంలో ఉన్నాడు మరియు యజీద్ ను చక్రవర్తిగా నియమించబడిన మరియు అధికారంలో వచ్చిన కాలం కూడానూ.

ఇమామ్ హుసైన్ భూమ్యాకాశాల అలంకరణ
వారి ప్రతిష్టత గురించి చెప్పాలంటే ఇది చాలు; ఇలా ఉల్లేఖించబడి ఉంది: ఒకరోజు దైవప్రవక్త(స.అ) ఇమామ్ హుసైన్(స.అ)ను లోపలికి వస్తుండగా వారితో ఇలా అన్నారు: “సుస్వాగతం ఓ భూమ్యాకాశాల అలంకరణ” అక్కడున్న వారిలో ఉబయ్ ఇబ్నె కఅబ్ పేరు గల వ్యక్తి (ఆశ్చర్యంగా) ఇలా ప్రశ్నించెను: యా రసూలల్లాహ్, మీరు కాకుండా భూమ్యాకాశాల అలంకరణగా వేరొకరిని కూడా భావించవచ్చా? దైవప్రవక్త(స.అ) ఇలా సమాధానమిచ్చారు: “ఓ ఉబయ్ ఇబ్నె కఅబ్, అల్లాహ్ సాక్షిగా, నిస్సందేహముగా హుసైన్ ఇబ్నె అలీ(అ.స) భూమి కన్నా ఆకాశంలోనే ప్రఖ్యాతి చెందినవారు. నింగిపై వారి పేరు ఇలా లిఖించబడి ఉంది: “ఇన్నల్ హుసైన్ మిస్బాహుల్ హుదా వ సఫీనతున్నజాహ్” నిస్సందేహముగా హుసైన్ హిదాయత్ యొక్క జ్యోతి మరియు విముక్తి నావా”[2]
ఇదే విధంగా దైవప్రవక్త(స.అ) ఎన్నోసార్లు ఇమామ్ హసన్(అ.స) మరియు ఇమామ్ హుసైన్(అ.స) గురించి “హసన్ మరియు హుసైన్ స్వర్గ యువకుల నాయకులు” అని ఉల్లేఖించారు.[3]

ఇమామ్ హుసైన్(అ.స) ప్రతిష్ట అహ్లె సున్నత్ నోట
సోదరులైన మన అహ్లెసున్నత్ గ్రంథాలలో ఇమామ్ హుసైన్(అ.స) గురించి చూస్తే, ఆ వర్గానికి చెందిన ఒలమాలు ఇమామ్ హుసైన్(అ.స) ను వర్ణిస్తూ చాలా మంచి మంచి వాఖ్యాలు చెప్పారు. ఈ విధంగా చాలా తక్కువ మంది గురించి చెప్పబడి ఉంది. వాటి నుండి కొన్ని మీ కోసం:
1. ఈజిప్టుకు చెందిన ప్రముఖ అహ్లెసున్నత్ ఆలిమ్, ఖాలిద్ మొహమ్మద్ ఖాలిద్ ఇలా రచించెను: “ఇమామ్ హుసైన్(అ.స) దీన్ ను రక్షించడానికి త్యాగాన్ని ఎంచుకున్నారు... ఈ విధంగా ఆషూరా తిరుగుబాటు అంశం కూడా దీన్ రక్షణ; ఎందుకంటే ఆ కాలంలో దీన్ రక్షణ అవసరం అని గ్రహించారు కాబట్టి”
2. పాకిస్తాన్ లీడర్ ముహమ్మద్ అలీ జినాహ్ ఇలా అనెను: “ఇమామ్ హుసైన్(అ.స) ప్రదర్శించిన శౌర్యానికి మించిన శౌర్య నమూన ఈ ప్రపంచంలో లేదు. నా నమ్మకం ప్రకారం ముస్లిములందరూ ఇరాక్ నేలపై తన ప్రాణాలను అర్పించిన ఆ వీరుని మార్గంపై నడవాలి”.
3. ఈజిప్టుకు చెందిన గొప్ప రచయిత అబ్బాస్ మహ్మూద్ అల్ ఇఖ్ఖాద్ ఇలా రచించెను: “హుసైన్(అ.స) విప్లవం, విప్లవ చరిత్రలోనే సాటిలేనిది”
4. సయ్యద్ ఖుతుబ్ ఇలా రచించెను: “భూమండలం పై హుసైన్(అ.స) లాంటి వీరుడు లేడు. వారు భావోద్వేగాలను మరియు హృదయాలను వశపరుచుకొని, తరాలను ఆత్మాభిమానం మరియు త్యాగం వైపు ఆహ్వానించారు. ఒకవేళ వేయ్యి సంవత్సరాలు జీవించినా తన ఆహ్వానాన్ని ఇంతిలా విస్తరించడం అసాధ్యం. కాని హుసైన్(అ.స) తన విశ్వాసాన్ని మరియు ఆహ్వానాన్ని తన ప్రాణత్యాగంతో ఇది సాధ్యం చేశారు.... ..[4]

ఇమామ్ హుసైన్(అ.స) ప్రతిష్టత శత్రువుల నోట
1. ముఆవియహ తన కొడుకు యజీద్ తో ఇలా అనెను: “బాబూ! అల్లాహ్ తో కలిసేటప్పుడు నీపై హుసైన్ రక్తం లేకుండా జాగ్రత్త పడు” (అనగా ఏదైనా సరే హుసైన్ ను చంపకు). ఇలా ఉల్లేఖించబడి ఉంది ముఆవిహ్ మరణించే సమయం దగ్గర పడినపుడు ఇలా అనెను: “హుసైన్ రక్తమాంసాలు దైవప్రవక్త రక్తమాంసాలు”(అంటే వారికున్న ప్రతిష్టత వీరికీ ఉంది).
2. ఉమర్ ఇబ్నె సఅద్: కర్బలాలో ఉమర్ ఇబ్నె సఅద్, షిమ్ర్ తో ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా హుసైన్, యజీద్ తో బైఅత్ చేయరు; ఎందుకంటే వారిపై వారి తండ్రి అలీ(అ.స) అధికారం ఉంది(అనగా వారు తండ్రి మార్గంలో నడుస్తారు)”
3. షిమ్ర్ బిన్ జిల్ జౌషన్ ఇలా అనెను: “నా ప్రాణాల సాక్షిగా, హుసైన్ ఇబ్నె అలీ స్వాతంత్రం కోరే మరియు కారుణ్యం కలిగి ఉన్న వారు” ఇలా కూడా ఉల్లేఖించబడి ఉంది: షిమ్ర్ ఇమామ్ హుసైన్(అ.స) శిరస్సును వేరు చేయడం మొదలు పెడుతుండగా ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, నాకు తెలుసు నీవు గొప్ప స్వామివి మరియు దైవప్రవక్త(స.అ) కుమారుడివి, నీ తల్లిదండ్రులు ప్రజలలోనే అతి ఉత్తములు, అని అయినా సరే నేను నీ శిరస్సును నీ దేశం నుండి వేరు చేస్తున్నాను”
4. షబస్ ఇబ్నె రిబ్ఈ(కర్బలాలో ఉమర్ ఇబ్నె సఅద్ యొక్క పదాతిదళ అధిపతి) ఇలా అన్నాడు: అల్లాహ్ ఈ పట్టణం(కూఫా) వారికి శుభం చేయకూడదుగాక, వారిని అభివృద్ది మరియు స్థిరత్వం లేకుండా చేయుగాక! ఇది ఆశ్చర్యకం కాదా; మేము అలీ ఇబ్నె అబీతాలిబ్, ఆ తరువాత వారి కుమారుడు హసన్ తో ఆలె అబీసుఫ్యాన్ కోసం ఐదు సంవత్సరాలు యుద్ధం చేయలేదా!!, ఆ తరువాత ఆలె ముఆవియహ్ మరియు ఇబ్నె జియాద్ తో చేరి అలీ కుమారుడితో యుద్ధం చేయలేదా?”
5. మర్జానహ్(ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్ తల్లి) ఆషూరా సంఘటన తరువాత తన కుమారుడితో ఇలా అనెను: “ఓ నీచుడా! దైవప్రవక్త(స.అ) కుమారుడ్ని చంపావు; అల్లాహ్ సాక్షిగా, నీవు స్వర్గాన్ని ఏమాత్రం చూడలేవు”[5]              

రిఫరెన్స్
1. బహ్రానీ సయ్యద్ హాషిమ్ ఇబ్నె సులైమాన్, మదీనతుల్ మఆజిజ్, ముఅస్ససతుల్ మఆరిఫిల్ ఇస్లామియహ్, ఖుమ్, చాప్ అవ్వల్, 1413ఖ, భాగం4, పేజీ52
2. షేఖ్ సదూఖ్, మన్ లా యహ్జుర్, 4జిల్దీ, దఫ్తరె ఇంతెషారాతె ఇస్లామీ వాబస్తె బె జామిఅహ్ ముదర్రిసీ హౌజయె ఇల్మియ, ఖుమ్, చాప్ దువ్వుమ్, 1413, భాగం4, పేజీ179
3,4 హౌజహ్ నెట్

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8