ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క లక్షణాలు; వారు పేదవారికి సహాయం చేసి వారి చేతులను ముద్దు పెట్టుకునేవారు...
ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క లక్షణాలు
1. అల్లాహ్ పట్ల భయం కలిగివుండడం:
అల్లాహ్ యొక్క ఔలియా(ప్రత్యేక దాసులు) యొక్క అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అల్లాహ్ పట్ల భయం కలిగివుండడం. ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) కూడా ఈ లక్షణం కలిగివుండేవారు. తావూస్ అనబడే వ్యక్తి ఇలా ఉల్లేఖించెను: “ఒకరోజు మస్జిదుల్ హరామ్ లో ఇమామ్ ను చూశాను, వారు నమాజ్ చదువుకుంటున్నారు, కళ్ళనుండి కన్నీళ్ళు కారుతున్నాయి, దుఆ చేస్తున్నారు. నమాజ్ పూర్తయిన తరువాత వారి వద్దకు వెళ్ళి వారితో ఇలా అన్నాను: యబ్న రసూలిల్లాహ్, మీ విముక్తి కోసం మూడు మార్గాలు ఉన్నప్పటికీ మీరు ఎందుకని రోధిస్తున్నారు? మొదటిది మీరు దైవప్రవక్త(స.అ) కుమారులు, రెండవది మీ పితామహులు ప్రళయదినాన సిఫార్సు చేయువారు మరియు మూడవది అల్లాహ్ దయామయుడు!
ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: దైవప్రవక్త(స.అ) కుమారుడు కావడం నాకు ఎటువంటి లాభాన్ని చేకూర్చదు ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలుగానీ, ఒండొకరిని అడిగి చూడటంగానీ ఆనాడు ఉండదు”(సూరయె మోమినూన్, ఆయత్101) ఇక మా పితామహుల సిఫార్సు గురించి చెప్పాలంటే అది నాకు లాభాన్ని చేకూరుస్తుందా లేదా అనేది తెలియదు ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడినవారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయరు”(సూరయె అంబియా, ఆయత్28). ఇక అల్లాహ్ కారుణ్యం గురించి చెప్పాలంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది”(సూరయె అఅరాఫ్, ఆయత్56) నేను సజ్జనులలో ఉన్నానో లేదో నాకు తెలియదు.[1]
2. మంచి నైతికం కిలిగివుండడం:
అల్లాహ్ కు నచ్చే లక్షణాలలో ముఖ్యమైన లక్షణం. నిజానికి ఈ లక్షణం ప్రతీ ముస్లిం కలిగి వుండాలి. ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) ఈ నైతికం యొక్క అగ్రస్థానంలో ఉండేవారు. వారి మంచి నైతికం గురించి ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఒకరోజు ఒకవ్యక్తి ఇమామ్ సజ్జాద్(అ.స) తమ సహచరులతో కలిసి కూర్చొని ఉండగా వారిని నిందించి వెళ్లిపోయాడు, ఇమామ్ సభలో ఉన్నవారితో ఇలా అన్నారు: విన్నారా అతడు ఏమన్నాడో, ఇప్పుడు మీరు నాతో వచ్చి నేను అతడికి ఇచ్చే సమాధానం వినండి అన్నారు. అక్కడున్నవారు ఇలా అన్నారు: అతడు చెడుగా మాట్లాడినపుడే, అక్కడే మీరూ మేమూ అతడికి సమాధానం ఇచ్చి ఉండాల్సింది. ఇమామ్ వారితో పాటు ఆ చెడుగా మాట్లాడినవాడి ఇంటికి బయలుదేరారు, దారిలో ఇమామ్ ఈ ఆయత్ ను పఠిస్తున్నారు: “వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.(సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్134).
వారితో పాటు వస్తున్నవారు ముందు మరో విధంగా ఆలోచించారు కాని ఈ ఆయత్ విన్న తరువాత ఇమామ్ ప్రతికారం కోసం వెళ్లడం లేదు అని తెలుసుకున్నారు. అతడి ఇంటికి చేరుకున్నారు. అతడు ఇమామ్ ప్రతికారం తీర్చుకోవడానికి వచ్చారు అని భావించి జగడానికి సిద్ధమై బయటకు వచ్చాడు. కాని ఇమామ్ అతడితో ఇలా అన్నారు: “సోదరా! నువ్వు కొన్ని నిమిషాల ముందు నా వద్దక వచ్చి ఏదేదో చెప్పావు, ఒకవేళ నువ్వు చెప్పినవి నాలో ఉండి ఉంటే అల్లాహ్ తో నన్ను క్షమించమని వేడుకుంటాను, అదే ఒకవేళ నాలో అవి చేకపోయి ఉంటే అల్లాహ్ ను నిన్ను క్షమించమని కోరుకుంటాను. ఇమామ్ యొక్క సున్నితాన్ని, వినయాన్ని చూసి ఆ వ్యక్తి సిగ్గిపడ్డాడు, దగ్గరకు వచ్చి ఇమామ్ నొసలును చుంబించి ఇలా అన్నాడు: నేను చెప్పినవి మీలో లేవు అవి నాలో ఉన్నాయి అని ఒప్పుకుంటున్నాను”[2]
3. దైవమార్గంలో ఖర్చు పెట్టడం:
అల్లాహ్ ఖుర్ఆన్ లో పలు చోట్లు ఆదేశించిన వాటిలో ఒకటి ఇన్ఫాఖ్ అనగా అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం, పేదవారిని ఆదుకోవడం. ఈ లక్షణం ఇమామ్ సజ్జాద్(అ.స)లో పుష్కలంగా ఉండేది. దీని గురించి ఇలా ఉల్లేఖించబడి ఉంది: “వారు పేదవారికి ఏదైనా ఇచ్చేటప్పుడు వారు తన చేయిని ముద్దు పెట్టుకునేవారు కొన్ని రివాయతుల ప్రకారం ఒక్కోసారి ఎదుటివాడి(ఎవరికైతే దానం చేస్తున్నారో) చేతిని ముద్దు పెట్టుకునేవారు. దీని కారణమేమిటి అని అడిగితే వారు ఇలా అనేవారు; అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “ఏమిటీ, అల్లాహ్ యే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడనీ, దానధర్మాలను ఆమోదిస్తాడనీ, పశ్చాత్తాపాన్ని అంగీకరించటంలోనూ, దయజూపటంలోనూ అల్లాహ్ యే మేటి అనీ వారికి తెలియదా?”(సూరయె తౌబహ్, ఆయత్104) చూడడానికి అది తీసుకునేవాడి చేయి కాని నిజానికి అది తీసుకునే అల్లాహ్, ఈ చేయి శుభకరంగా మారింది, అందుకనే నేను నా చేతిని ముద్దు పెట్టుకున్నాను ఈ మంచి ఈ చేతితో జరిగిందని”[3]
హజ్రత్ ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స)ను మన ఇమామ్ గా నమ్మే మనము కూడా ముందుగా అల్లాహ్ గురించి తెలుసుకొని ప్రతీ క్షణం మేము ఆయన సన్నిధిలో ఉన్నాము అని ఆయనను మన ప్రక్కనే స్పర్శిస్తూ, ఆయన పట్ల భయభక్తులు కలిగు వుంటే, ఇదే భయం మంచి ప్రవర్తనను మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడంలో ఉన్న సంతోషాన్ని తెలియరావడానికి సబబు అవుతుంది.
రిఫరెన్స్
1. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం46, పేజీ83
فَقُلْتُ أَنَا طَاوُسٌ يَا ابْنَ رَسُولِ اللَّهِ مَا هَذَا الْجَزَعُ وَ الْفَزَعُ- وَ نَحْنُ يَلْزَمُنَا أَنْ نَفْعَلَ مِثْلَ هَذَا وَ نَحْنُ عَاصُونَ جَانُونَ- أَبُوكَ الْحُسَيْنُ بْنُ عَلِيٍّ وَ أُمُّكَ فَاطِمَةُ الزَّهْرَاءُ- وَ جَدُّكَ رَسُولُ اللَّهِ ص- قَالَ فَالْتَفَتَ إِلَيَّ وَ قَالَ هَيْهَاتَ هَيْهَاتَ يَا طَاوُسُ- دَعْ عَنِّي حَدِيثَ أَبِي وَ أُمِّي وَ جَدِّي- خَلَقَ اللَّهُ الْجَنَّةَ لِمَنْ أَطَاعَهُ وَ أَحْسَنَ وَ لَوْ كَانَ عَبْداً حَبَشِيّاً- وَ خَلَقَ النَّارَ لِمَنْ عَصَاهُ وَ لَوْ كَانَ وَلَداً قُرَشِيّاً- أَ مَا سَمِعْتَ قَوْلَهُ تَعَالَى فَإِذا نُفِخَ فِي الصُّورِ- فَلا أَنْسابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَ لا يَتَساءَلُونَ «سورة المؤمنون آیه: 101»- وَ اللَّهِ لَا يَنْفَعُكَ غَداً إِلَّا تَقْدِمَةٌ تُقَدِّمُهَا مِنْ عَمَلٍ صَالِح...
2. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం2, పేజీ146
وَقَفَ عَلَى عَلِيِّ بْنِ الْحُسَيْنِ ع رَجُلٌ مِنْ أَهْلِ بَيْتِهِ فَأَسْمَعَهُ وَ شَتَمَهُ فَلَمْ يُكَلِّمْهُ فَلَمَّا انْصَرَفَ قَالَ لِجُلَسَائِهِ قَدْ سَمِعْتُمْ مَا قَالَ هَذَا الرَّجُلُ وَ أَنَا أُحِبُّ أَنْ تَبْلُغُوا مَعِي إِلَيْهِ حَتَّى تَسْمَعُوا رَدِّي عَلَيْهِ قَالَ فَقَالُوا لَهُ نَفْعَلُ وَ لَقَدْ كُنَّا نُحِبُّ أَنْ تَقُولَ لَهُ وَ نَقُولَ قَالَ فَأَخَذَ نَعْلَيْهِ وَ مَشَى وَ هُوَ يَقُولُ وَ الْكاظِمِينَ الْغَيْظَ وَ الْعافِينَ عَنِ النَّاسِ وَ اللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ فَعَلِمْنَا أَنَّهُ لَا يَقُولُ لَهُ شَيْئاً قَالَ فَخَرَجَ حَتَّى أَتَى مَنْزِلَ الرَّجُلِ فَصَرَخَ بِهِ فَقَالَ قُولُوا لَهُ هَذَا عَلِيُّ بْنُ الْحُسَيْنِ قَالَ فَخَرَجَ إِلَيْنَا مُتَوَثِّباً لِلشَّرِّ وَ هُوَ لَا يَشُكُّ أَنَّهُ إِنَّمَا جَاءَهُ مُكَافِئاً لَهُ عَلَى بَعْضِ مَا كَانَ مِنْهُ...
3. ఆయతుల్లాహ్ సాఫీ, తఫ్సీరె సాఫీ, భాగం2, పేజీ37
عن السّجّاد عليه السلام ضمنت على رَبّي أنّ الصدقة لا تقع في يد العبد حتى تقع في يد الرّب و هو قوله هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبادِهِ وَ يَأْخُذُ الصَّدَقاتِ.و عنه عليه السلام أنّه كان إذا أعطى السائل قبل يد السائل فقيل له لم تفعل ذلك قال لأنّها تقع في يد اللَّه قبل يد العبد و قال ليس من شيء إلّا و كلّ به ملك إلّا الصدقة فانّها تقع في يد اللَّه قال الرّاوي أظنّه يقبّل الخبز أو الدّرهم...
వ్యాఖ్యానించండి