మనిషి ప్రళయదినాన ప్రశ్నించబడతాడా!

మంగళ, 03/23/2021 - 10:21

మనిషి ప్రళయదినాన ప్రశ్నించబడతాడా అన్న విషయం పై ఖుర్ఆన్ అబిప్రాయబేధం

మనిషి ప్రళయదినాన ప్రశ్నించబడతాడా!

ప్రశ్న:
ఖుర్ఆన్ మనిషి యొక్క చర్యల గురించి వైరుధ్యంగా వివరిస్తుంది; ఒకసారి నీ చర్యల గురించి ప్రశ్నించబడుతుంది అని మరోసారి ప్రశ్నించబడదు అని చెబుతుంది.

జవాబు:
మొదటి చూపులో ఖుర్ఆన్ లో ఉన్న ఆయతులు రెండు రకాలుగా కనబడతాయి. ఉదాహారణకు فَيَوْمَئِذٍ لَا يُسْأَلُ عَنْ ذَنْبِهِ إِنْسٌ وَلَا جَانٌّ  “ఆరోజు ఏ మనిషికీ, ఏ జిన్నుకూ అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు”[సూరయె రహ్మాన్, ఆయత్39] ఈ ఆయత్ ప్రకారం ఎటువంటి ప్రశ్న వారిని అగడరు అని తెలుస్తుంది. ఖుర్ఆన్ యొక్క మరో ఆయత్ ఉదాహారణకు وَ قِفُوهُمْ إِنَّهُمْ مَسْؤُلُون “అయితే కాస్త వాళ్లను ఆపండి. వారికి ప్రశ్నలు వేయాల్సివుంది”[సూరయె సాఫ్ఫాత్, ఆయత్24] లేదా మరో చోట ఇలా ఉంది: فَوَ رَبِّكَ لَنَسْئَلَنَّهُمْ أَجْمَعِينَ عَمَّا كانُوا يَعْمَلُونَ “నీ ప్రభువు సాక్షిగా! మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము, వారు చేస్తూ ఉండిన పనుల గురించి”[సూరయె హిజ్ర్, ఆయత్92,93]; ఈ రెండు ఆయతుల ప్రకారం చూసుకుంటే ప్రజలందరితో వారి చర్యల గురించి ప్రశ్నించబడుతుంది అని తెలుస్తుంది. దీంతో ఖుర్ఆన్ లో వైరుధ్యం ఉందనీ, ఒక ఆయత్ ప్రశ్నించబడదని మరియు మరో ఆయత్ ప్రశ్నించబడదు అని ఉంది.

ఈ ప్రశ్నకు సమాదానం ఇలా ఇవ్వవచ్చు:
ఖియామత్(ప్రళయదినం, అంతిమరోజు) చాలా సుధీర్ఘమైన రోజు. మనిషి వివిధ స్థానాల నుండి దాటి వెళ్లాల్సి వస్తుంది. ప్రతీ స్థానంలో ఒక నిర్ణిత సమయం వరకు ఉండాల్సి వస్తుంది, కొన్ని రివాయతుల ప్రకారం 50 స్థానాల ఉంటాయి, వాటిలో కొన్ని స్థానాలలో ఒక్క ప్రశ్నకూడా చేయబడదు, అక్కడ వారి ముఖం యొక్క రంగు వారి లోపలి రహస్యాలను వెల్లడిస్తుంది. మరి కొన్ని స్థానాలలో మనిషి నోరు పై తాళం వేయబడుతుంది, అతడి శరీరభాగాలు అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇస్తాయి[సూరయె యాసీన్, ఆయత్65], మరి కొన్ని స్థానాలలో మనుషులు సూక్ష్మంగా ప్రశ్నించబడతారు, మరి కొన్ని స్థానాలలో మనిషులు వాదులాడుతారు మరియు తన తరపు నుంచి డిఫెన్స్ చేస్తారు[సూరయె నహ్ల్, ఆయత్111]. సంక్షిప్తంగ చెప్పాలంటే ప్రతీ స్టేజీలో కొన్ని షరత్తులు ప్రత్యేకతలూ ఉంటాయి, ఒక స్టేజీ మరో స్టేజీకి భయంకరంగా ఉంటుంది.[1]

పై వివరణకు ఆధారం:
ఈ ఆయత్ “ఆరోజు ఏ మనిషికీ, ఏ జిన్నుకూ అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు”[సూరయె రహ్మాన్, ఆయత్39] తరువాత ఉన్న ఆయత్, అందులో అల్లాహ్ ఇలా సూచించెను: يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيماهُم “అపరాధులు తమ వాలకాన్ని(నలుపు ఆవరించిన తమ ముఖాలను) బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుత్తు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు”[సూరయె రహ్మాన్, ఆయత్41] అనగా వారి ముఖాన్ని బట్టి తీర్మానించబడతారు వారు స్వర్గస్తులా లేక నరకానికి వెళ్లేవారా అని; ఇంకో ఆయత్ లో ఇలా వివరించబడి ఉంది: وُجُوهٌ يَوْمَئِذٍ مُسْفِرَةٌ ضاحِكَةٌ مُسْتَبْشِرَةٌ وَ وُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْها غَبَرَةٌ تَرْهَقُها قَتَرَةٌ “ఆరోజు ఎన్నో ముఖాలు వెలిగి పోతుంటాయి (తమకు వినిపించబడిన శుభవార్తపై) నవ్వులు చిందిస్తూ, ఆనందంలో తేలియాడుతూ ఉంటాయి. మనెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకుని ఉంటాయి. వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది.(సూరయె అబస, ఆయత్38-41), వారి ముఖాలు ద్వార వారి స్థితుల ద్వార వారి లోపలి రహస్యాలు తెలుస్తున్నప్పుడు ఇక ప్రశ్నించే అవసరమే ఉండదు, ఇలా కాని స్థానాలలో ప్రశ్న అవసరం పడుతుంది.
బహుశా ప్రళయదినాన మొదటి స్థానాలలో ప్రశ్నలు చేయబడతాయేమో, ఆ తరువాత స్థానాలలో ప్రశ్నించే అవసరం లేకుండానే వారి స్థితిగతుల ద్వార తీర్మానించవచ్చేమో.

రిఫరెన్స్
1. ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబిల్ ఇస్లామియ, తహ్రాన్, చాపె అవ్వల్, 1373ష, పేజీభాగం23, పేజీ156.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11