ఇమామ్ సజ్జాద్(అ.స) అహ్లెసున్నత్ ఉలమా మాటల్లో

గురు, 03/25/2021 - 05:18

ఇమామ్ సజ్జాద్(అ.స) అహ్లెసున్నత్ వర్గానికి చెందిన గొప్ప ముహద్దిసీన్ మరియు ఉలమా దృష్టిలో...

ఇమామ్ సజ్జాద్(అ.స) అహ్లెసున్నత్ ఉలమా మాటల్లో

ఇమామ్ సజ్జాద్(అ.స) కూడా వారి తండ్రి మరియు వారి పితామహులైన హజ్రత్ అలీ(అ.స) మరియు ఇతర పవిత్ర మాసూముల వలే సాటిలేని మనిషి, మరియు గొప్ప స్వభావ కలిగివున్న మనిషి, పరిపూర్ణమైన మనిషి, వారిని మన జీవితంలో ఆదర్శంగా భావించదగ్గ మనిషి, సంపూర్ణ వ్యక్తిలో ఏ ఏ గొప్పతానాలు ఉండాలో అన్ని కలిగివున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తి గురించి అహ్లె సున్నత్ వర్గానికి చెందిన కొంతమంది ఉలమాలు గొప్పగా చెప్పారు. వాటిని ఇప్పుడు చూద్దాం:

1. ముహద్దిస్, గొప్ప ఫఖీహ్ మరియు తాబెయి అయిన జొహ్రీ, ఇతను మదీనహ్ లో ఉండేవారు. ఇతను దైవప్రవక్త(స.అ) సహాబీయులలో కొందరితో కలిశారు. అహ్లెసున్నత్ ఫుఖహా(ఫిఖా జ్ఞాననిపుణులు)ల యొక్క ఏడు విజ్ఞానాలు తెలిసినవారు. అహ్లె సున్నత్ ఉలమాలు వారిని చాలా గొప్పగా వర్ణిస్తారు.[1] ఇతని గురించి అహ్లె సున్నత్ ఉలమాలు ఇలా వ్రాశారు: “ఇతను ఇమమ్ సజ్జాద్(అ.స) యొక్క గొప్ప జ్ఞానం మరియు వారి ధర్మనిష్ఠ పై ఆకర్షితుడయ్యాడు మరియు వారి గురించి ఇలా అన్నారు: “నేను జైనుల్ ఆబెదీన్ కు మించిన జ్ఞానిని చూడలేదు”[2]
మరో చోట ఇలా అన్నారు: “నేను ఎక్కువగా అలీ ఇబ్నె హుసైన్ తోనే కూర్చునేవాడిని, వారిని మించిన జ్ఞానిని నేను చూడలేదు”[3]

2. మాలిక్ ఇబ్నె అనస్ ఇమామ్ సజ్జాద్[అ.స] గురించి ఇలా అనెను: “అలీ ఇబ్నె హుసైన్, దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్లలో సాటిలేనివారు”[4]

3. ఇబ్నె హజరె హైసమీ తన గ్రంథం సవాయిఖుల్ ముహ్రిఖహ్ లో ఇలా రచించెను: “జైనుల్ ఆబెదీన్ జ్ఞానం, ఔదార్యం, ఆరాదనలలో వారి తండ్రి గారి ఉత్తరాధికారి, నమాజ్ కోసం ఉజూ చేస్తున్నప్పుడు వారి ముఖం పసుపు రంగులో మారిపోయేది, ఎందుకు ఇలా జరుగుతుంది అని వారితో ప్రశ్నిస్తే వారు “నీకు తెలుసా నేను ఎవరి ముందు నిలబడడానికి వెళ్తున్నానో!” అని సమాధానమిచ్చేవారు.[5] వారు ఒకరోజులో వెయ్యి రక్అతుల నమాజులు చేసేవారు, ఒక్కసారి అల్లాహ్ పట్ల వారికి ఉన్న భయం వల్ల స్పృహ కోల్పోయేవారు.[6]

4. అహ్లెసున్నత్ వర్గానికి చెందిన మరో గొప్ప వ్యక్తి అయిన అబ్దొ రబ్బిహి అందులూసీ మాలికీ తన గ్రంథం అఖ్దుల్ ఫరీద్ లో ఇలా రచించారు: అలీ ఇబ్నె హుసైన్ నమాజ్ చేయడం కోసం నిలబడితే వారి శరీరం వణిపోతూ ఉండేది, కారణం అడిగితే వారు “అయ్యో, నీకు తెలియదా నేను ఎవరి ముందు నిలబడి ఉన్నానో? మరియు ఎవరితో వేడుకుంటున్నానో”[7]

5. సుఫ్యాన్ ఇబ్నె ఉయయ్నా ఇమామ్ యొక్క స్వచ్చతా మరియు దాసోహం గురించి చెప్పిన మాటాలు వినదగ్గవి. అతడు ఇలా అనెను: “అలీ ఇబ్నె హుసైన్ హజ్ చేయడానికి మక్కాకు బయలుదేశారు, ఎప్పుడైతే ఎహ్రామ్(హజ్ సమయంలో ధరించే ప్రత్యేక దుస్తులు) ధరించి తన సవారీ పై ఎక్కినప్పుడు వారి రంగు పసుపుగా మారేది మరియు వారి శరీరం వణికిపోయేది, దాంతో వారు లబైక్ కూడా చెప్పలేకపోయేవారు, వారితో ఎందుకు మీరు లబ్బైక్ చెప్పడం లేదు అని అడిగితే వారు “నేను లబ్బైక్ చెబితే దానికి సమాదానంగా లాలబ్బైక్ అని ఎక్కడ చెప్పబడుతుందో” అని సమాధానమిచ్చేవారు.[8]

6. అహ్లెసున్నత్ యొక్క గొప్ప ఆలిమ్ అయిన సిబ్తె జౌజీ ఇమామ్ గురించి ఇలా రచించెను: “వారు ఆద్యాత్మికపరంగా సాటిలేనివారు, వారు జైనుల్ ఆబెదీన్, సజ్జాద్, జుస్సఫనాత్ మరియు సయ్యదుల్ ఆబెదీ లాంటి బిరుదులతో ప్రఖ్యాతి చెందారు. వారు ఇమామ్ యొక్క తండ్రి, వారి కున్నియత్ అబుల్ హసన్.......”[9]

7. ఇబ్నె తల్హా షాఫెయీ వారిని ఇలా వర్ణించారు: “ఇతనే జైనుల్ ఆబెదీన్, దర్మనిష్ఠగలవారి నాయకుడు, విశ్వాసుల ఇమామ్. పూర్వీకులు వారిపై సాక్ష్యమిస్తారు; వారు దైవప్రవక్త(స.అ) వంశానికి చెందినవారనీ, వారి మార్గం స్పష్టమైనదనీ, అల్లాహ్ పట్ల వారి సామిప్యం మరియు దాసోహం, అల్లాహ్ వద్ద వారి స్థానాన్ని నిదర్శిస్తారు.....”[10]

రిఫరెన్స్
1. అల్ వాఫీ బిల్ వఫియాత్, సఫదీ, దారు ఇహ్యాయిల్ తురాసిల్ అరబీ, బీరూత్, లెబ్నాన్, భాగం5, పేజీ24
2. షజరాత్ అల్ జహబ్, ఇబ్నె ఇమాదె హంబలీ, దారు ఇహ్యాయిల్ తురాసిల్ అరబీ, బీరూత్, లెబ్నాన్, భాగం1, పేజీ105
3. సియరో అఅలామిన్నుబలా, జహబీ, ముఅస్ససతుర్రిసాలహ్, బీరూత్, లెబ్నాన్, భాగం4, పేజీ387
4. సియరో అఅలామిన్నుబలా, జహబీ, ముఅస్ససతుర్రిసాలహ్, బీరూత్, లెబ్నాన్, భాగం4, పేజీ389
5. అల్ సవాయిఖుల్ ముహ్రఖహ్, ఇబ్నె హజరె హైసమీ, ముఅస్ససతుర్రిసాలహ్, బీరూత్, లెబ్నాన్, పేజీ119
6. సిఫ్వతుస్ సిఫ్వహ్, ఇబ్నె జౌజీ హంబలీ, దారుల్ ఫిక్ర్, బీరూత్, లెబ్నాన్, చాప్ అవ్వల్, భాగం2, పేజీ52
7. అఖ్దుల్ ఫరీద్, అబ్దు రబ్బిహీ అందులూసీ, మన్షూరాతు దారిన్ వ మక్తబతుల్ హిలాల్, బీరూత్, లెబ్నాన్, భాగం3, పేజీ169
8. కిఫాయతుత్తాలిబ్, గంజీ షాఫెయీ, దారు ఇహ్యాయి అల్ తురాసి అహ్లిల్ బైత్, తహ్రాన్, ఇరాన్, పేజీ450
9. తజ్కిరతుల్ ఖవాస్, సిబ్తె ఇబ్నె జౌజీ, ఇంతెషారాతె షరీఫ్ రజీ, ఖుమ్, ఇరాన్, 1376ష, పేజీ291
10. మతాలిబుస్సుఆల్, ఇబ్నె తల్హా షాఫెయీ, ముఅస్ససయె ఉమ్ముల్ ఖురా, బీరూత్, లెబ్నాన్, భాగం2, పేజీ84

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21