ఇమామ్ మహ్దీ(అ.స) జననం పై అహ్లెసున్నత్ ఉలమాల అభిప్రాయాలు

శని, 03/27/2021 - 05:14

ఇమామ్ మహ్దీ(అ.స) జననం గురించి అహ్లెసున్నత్ ఉలమాల అభిప్రాయాలు...

ఇమామ్ మహ్దీ(అ.స) జననం పై అహ్లెసున్నత్ ఉలమాల అభిప్రాయాలు

దైవప్రవక్త(అ.స) యొక్క అంతిమ ఉత్తరాధికారి అయిన హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) షాబాన్ మాసం 255హిజ్రీలో, బనీ అబ్బాస్ అదికారులకు తెలియకుండా కొన్ని జాగ్రత్తలు వహించడంతో ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఇంట జన్మించారు. ఇంచుమించు వారి జననం హజ్రత్ మూసా(అ.స)తో పోలినది. అప్పుడు ఫిర్ఔన్ యొక్క ఒత్తిడి, అన్వేషణ మరియు యోచనలకు వ్యతిరేకంగా అల్లాహ్ సురక్షితంగా ఫిర్ఔన్ కోట ప్రక్కనే హజ్రత్ మూసా(అ.స)ను ఈలోకంలో తీసుకొచ్చాడు, అదే విధంగా హజ్రత్ మహ్దీ(అ.స) కూడా అబ్బాసీ అధికారులు, గూఢాచారులు ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఇంటిపై నిఘా వేసి ఉంచినప్పటికీ, చాలా సురక్షితంగా, శత్రువులకు ఏమాత్రం తెలియకుండా, శుక్రవారం ఉదయం పూట షాబాన్ మాసంలో ఈ లోకంలో అడుగు పెట్టారు.[1]

ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) తనకు కుమారుడు జన్మించాడనే విషయాన్ని రహస్యంగా ఉంచారు., ఎందుకంటే ఇమామ్ మహ్దీ వస్తారని మరియు షియాలు వారి రాక కోసం ఎదురుచూస్తున్నారనీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని అప్పటి అధికారులు ఇమామ్ మహ్దీ(అ.స)ని వెతుకుతూ ఉన్నారు. ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) తన జీవితంలో వారికి కుమారుడు పుట్టాడు అని అందరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) మరణానంతరం చాలా మందికి వారి కుమారుడి గురించి తెలియదు.[2]

ప్రపంచాన్ని కాపాడడాన్ని రక్షకుడు వస్తాడు అనే విశ్వాసం కేవలం షియా లేదా ఇస్లామీయ వర్గాలకే పరిమితం కాదు, దీనిని వేరే వర్గాల వారు కూడా నమ్ముతారు; కాకపోతే షియా ఇస్నా అషరీ వర్గం మరియు ఇతర వర్గాలవారి విశ్వాసంలో గల బేధమేమిటంటే షియా ఇస్నా అషరీ వారు ఆ రక్షకుడు నిర్థారితమైన వ్యక్తి, అతడు హిజ్రీ యొక్క 255వ సంవత్సరములోనే జన్మించాడు మరియు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు.[3]
హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) జననం పై అహ్లె సున్నత్ గ్రంథాలలో:

ముస్లిములలో కేవలం షియా వర్గానికి చెందినవారు మాత్రమే ఇమామ్ మహ్దీ(అ.స) జన్మించారు మరియు ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు అని నమ్ముతారు అని అంటారు. కాని చరిత్ర తిరిగి చూస్తే అహ్లె సున్నత్ వర్గానికి చెందిన చాలా మంది ఉలమాలు ఇమామ్ మహ్దీ(అ.స) ఎప్పుడో జన్మించారు అని ఉల్లేఖించారు. వాటి నుండి కొన్ని నమూనాలు ఇక్కడ మీ కోసం:
1. ఫఖ్రుదీనె రాజీ(మరణం:606హిజ్రీ): ఇతను అహ్లెసున్నత్ వర్గానికి చెందిన గొప్ప ఆలిమ్, ముతకల్లిమ్ మరియు ముఫస్సిర్, “అల్ షజరతుల్ ముబారకహ్ ఫీ అన్సాబిల్ తాలిబియహ్” లో ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) కు రెండు కుమారులు పేర్లు ఇలా వ్రాశారు: “మొదటివారు సాహిబ్బుజమాన్(అ.స) మరియు రెండవవారు మూసా ఇతను వారి తండ్రి జీవితంలోనే ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు”[4]

2. ఇజ్జుద్దీన్ ఇబ్నె అసీర్(మరణం:630హిజ్రీ): ఇతను అహ్లె సున్నత్ వర్గానికి చెందిన గొప్ప ముహద్దిస్ మరియు చరిత్రకారుడు, స్పష్టంగా ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) కి కుమారుడు ఉన్నాడు అని పేరుతో సహా వెల్లడించారు.[5]

3. అహ్మద్ ఇబ్నె ఇబ్రాహీమ్ ఇబ్నె ఖల్ఖాన్(మరణం:681హిజ్రీ): ఇతను అహ్లెసున్నత్ వర్గానికి చెందిన గొప్ప ఖాజీ, చరిత్రకారుడు, ఇతను హజ్రత్ మహ్దీ(అ.స) షాబాన్ నెల 15వ తేదీ, శుక్రవారం రోజు, హిజ్రీ 255వ సంవత్సరంలో జన్మించారు అని ఉల్లేఖించారు.[6]

4. మొహమ్మద్ ఇబ్నె అహ్మదె జహబీ(మరణం:748హిజ్రీ): ఇతను అహ్లె సున్నత్ వర్గానికి చెందిన చరిత్రకారుడు, రావీయుల జ్ఞానం కలిగి ఉన్న ముహద్దిస్, ఇతను తన గ్రంథాలలో హజ్రత్ మహ్దీ(అ.స) యొక్క పేరు మరియు వారి జననం గురించి ఉల్లేఖించారు.[7]

5 మరియు 6వ శతాబ్ధానికి చెందిన అహ్లె సున్నత్ యొక్క గొప్ప గొప్ప ఉలమాల ఉల్లేఖనలు, హజ్రత్ మహ్దీ(అ.స) 255హిజ్రీలోనే జన్మించారు అనే విషయాన్ని నిదర్శిస్తున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని కూడా తెలుస్తుంది.

రిఫరెన్స్
1. హౌజహ్ నెట్. పాయెగాహె ఇత్తెలా రసానీయె హౌజెహ్
2. అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, ఇంతెషారాతె సయీద్ ఇబ్నె జబీర్, ఖుమ్, 1428ఖ, పేజీ510
3. మసాయిలె ఏతెఖాదీ అజ్ దీద్గాహె తషయ్యో, ముహమ్మద్ రిజా ముజఫ్ఫర్, తర్జుమా మొహమ్మద్ మొహమ్మదీ ఇష్తెహార్దీ, దఫ్తరె ఇంతెషారాతె ఇస్లామీ, ఖుమ్, 1375ష, పేజీ102
4. అల్ షజరతుల్ ముబారకహ్, ఫఖ్రె రాజీ, మక్తబతు ఆయతుల్లాహ్ అల్ మర్అషీ అల్ నజఫీ, ఖుమ్, 1419ఖ, పేజీ92-93
5. అల్ కామిల్, ఇబ్నె అసీర్, దారు సాదిర్, బీరూత్, 1385ష, భాగం7, పేజీ274
6. వఫీయాతుల్ అఅయాన్, ఇబ్నె ఖల్ఖాన్, భాగం4, పేజీ176
7. తారీఖుల్ ఇస్లాం వ వఫియాతుల్ మషాహీర్ వల్ అఅలామ్, జహబీ, తహ్ఖీక్ ఉమర్ అబ్దుస్సలామ్ తదమ్మురీ, బీరూత్, దారుల్ కితాబిల్ అరబీ, తా అల్ సానియహ్, 1413/1993, భాగం19, పేజీ113

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8